Bigg Boss Telugu: ఈ సీజన్ విన్నర్ అతడేనా.. నాగ్ ఇచ్చిన హింట్ తో స్ట్రాటెజీ మార్చిన టైటిల్ ఫేవరెట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముందుగా హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగా.. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారం శుభశ్రీ రాయగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆ తర్వాత 2.0 అంటూ మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను లోపలికి తీసుకు వచ్చారు.
ఇక అప్పటి నుంచి ఆట మరింత రసవత్తరంగా సాగుతోంది. ముందుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని, ఆ తర్వాత వారం పూజా మూర్తి ఇంట్లోంచి వెళ్లిపోయారు. పూజా మూర్తి ఎలిమినేషన్ తర్వాత రతికా రోజ్ ను మళ్లీ హౌస్ లోకి తీసుకువచ్చారు. ఇక ఎనిమిదో వారంలో సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోగా.. ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.

అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్ ఆటను చాలా చక్కగా ఆడుతున్నాడు. ఈయన చివరి వరకూ ఉంటాడని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా అమర్ దీప్ టైటిల్ విన్ అవుతాడని.. ముందు నుంచి అంతా భావించారు. కానీ ఆయన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శివాజిలపై విరుచుకు పడడం, గ్రూపుగా గేమ్ ఆడడంతో.. జనాల్లో ఆయనపై చాలా నెగిటివిటీ వచ్చేసింది. ఇక ఆయన టైటిల్ విన్ అవ్వడం కష్టమే అని తెలిసిపోయింది. ఈక్రమంలోనే హౌస్ లోకి వచ్చిన మరో సీరియల్ హీరో అంబటి అర్జున్ పై ఆశలు మొదలు అయ్యాయి.
బిగ్ బాస్ టీం వాళ్లు కూడా స్టార్ మా బ్యాచ్ అంటే సీరియల్ గ్రూపులోనే ఒకరిని గెలిపించాలని చూస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నాగార్జున సైతం చాలా ఫేవరిజం చూపిస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఈ వారం నాగార్జున.. అంబటి అర్జున్ కు ఓ హింట్ ఇచ్చాడు. బయట చూస్తున్న వారు ఎవరూ.. మీరు గ్రూపుగా ఆడుతున్నట్లు అనుకోకూడదని... అందుకోసం అమర్ తప్పు చేసినా నువ్వు చెప్పాలని తెలిపాడు. దీన్ని గట్టిగా మైండ్ లో పెట్టుకున్న అంబటి అర్జున్.. గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. అందుకోసం తన స్నేహితులు అయిన శోభా శెట్టి, అమర్ దీప్ లనే నామినేట్ చేయడం గమనార్హం.

ముఖ్యంగా శోభా శెట్టిని అంబటి అర్జున్ నామినేట్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ ఆమె గతం వారం చేసిన రచ్చ.. నాగార్జున దాన్ని హైలెట్ చేయడం, ముఖ్యంగా తాను ఏ గ్రూపుకు చెందిన వాడు కాదని ప్రూవ్ చేసుకునేందుకు అర్జున్ ఆమెను నామినేట్ చేసినట్లు అందరికీ అర్థం అయిపోతుంది. గతంలో కూడా అంబటి అర్జున్.. అమర్ దీప్ ను నామినేట్ చేశాడు. కానీ మిగతా సమయాల్లో అమర్ దీప్ వైపే ఉంటూ సపోర్ట్ గా నిలుస్తున్నాడు. కానీ ఇదంతా ఆడియన్స్ లోకి వెళ్తే తనకు చాలా నెగిటివ్ అవుతుందని భావించిన అతడు.. ఈసారి కూడా అమర్ దీప్ నే నామినేట్ చేశాడు.
అయితే బిగ్ బాస్ టీం వాళ్లు సీరియల్ బ్యాచ్ కు చెందిన వారికే టైటిల్ ఇస్తారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాను ఆడే గేమ్స్ తో అందరి మనసులను గెలుస్తున్నాడు రైతుబిడ్డ. వీరిద్దరిలో ఎవరూ ఒకరు విన్ అవడం, రెండో వాళ్లు రన్నరప్ గా నిలవడం ఖాయమని చాలా మంది భావిస్తున్నారు. చూడాలి మరి ముందు ముందు వారాల్లో కూడా వీళ్లు ఇలాగే గేమ్ చక్కగా ఆడితే కచ్చితంగా వీళ్లు టాప్ - 5లో ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అంబటి అర్జున్ బయట ఏం జరుగుతుందో ఊహించుకుంటూ ముందుకెళ్తున్నాడు.


Click it and Unblock the Notifications











