Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లోకి రియల్ ఆటగాడు... శివాజీని మించి మైండ్ గేమ్..

బిగ్ బాస్ సీజన్ 7 ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన హౌజ్ మేట్స్ తో బిగ్ బాస్ నామినేషన్స్ వేయించాడు. ఇక హౌజ్ లో గొడవలు పెట్టేందుకు బిగ్ బాస్ పెద్ద ప్లానే వేశాడు. కొత్త కంటెస్టెంట్స్ కి, పాత కంటెస్టెంట్స్ కు మధ్య పుల్లలు పెట్టేందుకు బిగ్ బాస్ ప్లాన్స్ బాగానే ఉన్నాయి. ఇక వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ అంబటి మాత్రం క్లారిటీ రిజన్స్ తో నామినేషన్స్ లోకి దిగాడు. రావడం రావడమే.. సీరియల్ బ్యాచ్ కు షాక్ ఇచ్చాడు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గతవారం బిగ్ బాస్ సీజన్ 7... 2.ఓ గ్రాండ్ లాంఛ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ గ్రాండ్ లాంచ్ లో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. వారిలో అర్జున్ అంబటి, బోలే షవాళి, అశ్విని శ్రీ, నయని పావని, పూజ మూర్తి ఉన్నారు. ఇక హౌజ్ లో 14 మంది ఎంటర్ అవ్వగా ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకిలా, దామిని, రతికా రోజ్, శుభ శ్రీ రాయగురు హౌజ్ నుంచి వెళ్లి పోయారు.

Bigg Boss Telugu 7 Sixth Week Nominations Episode

ఇక బిగ్ బాస్ హౌజ్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, సందీప్, టేస్టీ తేజ, ప్రియాంక జైన్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ లు ఉండగా.. గౌతమ్ ను సీక్రెట్ రూమ్ కు పంపించారు. ఇక వీరికి తోడు.. కొత్తగా వచ్చిన ఐదుగురు బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టారు. మొత్తం ఇప్పుడు హౌజ్ లో 13 మంది ఉండగా.. ఒకరు సీక్రెట్ హౌజ్ లో ఉన్నారు. ఇక బిగ్ బాస్ 6 వ వారంలోనే ఆట మొదలు పెట్టేశాడు.

కొత్త కంటెస్టెంట్స్ తో పాత కంటెస్టెంట్స్ ను నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఒక్కోక్కరు వచ్చి ఏవో రీజన్స్ చెప్తూ ఓటు వేస్తున్నారు. ఇక ఆ కారణాలు ఎలా ఉన్నాయంటే... పాత రీజన్స్ చెప్పడం ప్రేక్షకులకు అంతగా నచ్చదు. ఇక హౌజ్ లోకి వచ్చిన సీరియల్ హీరో అర్జున్ అంబటి... క్లియర్ కట్ రీజన్స్ చెప్పి... సీరియల్ బ్యాచ్ కు షాక్ ఇచ్చాడు. రావడం రావడమే సీరియల్ బ్యాచ్ ను అటాక్ చేశాడు.

ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ముందుగా కొత్తగా వచ్చిన అర్జున్ అంబటి.. ఇద్దరిని నామినేట్ చేశాడు. అందులో ఒకరు అమర్ దీప్, రెండోది సందీప్. ఇక నామినేషన్ మొదలు పెట్టే ముందే... ఓ క్లారిటీ ఇచ్చాడు. అపార్థం చేసుకోవడం మొదలుపెడితే అర్థం చేసుకోవడం మానేస్తారు.. కనుక దయచేసి అర్థం చేసుకోండి అంటూ చెప్పుకు వచ్చాడు. ముందుగా సందీప్ ను నామినేట్ చేశాడు. దానికి ఆయన చెప్పిన రీజన్... సంచాలక్‌ గా ఉండి అన్ని రూల్స్ తెలిసి నువ్వే రూల్స్ బ్రేక్ చేశావ్... అది కరెక్ట్ కాదు... దానికి పనిష్మెంటుగా ఈ వారం నువ్వు నామినేషన్‌లో ఉండాలంటూ నామినేట్ చేశాడు.

Ambati Arjun Nominates Amardeep and Sandeep

ఇక అమర్దీప్ ను నామినేట్ చేసిన అంబటి అర్జున్... ఆయన చెప్పిన రీజన్స్ చూస్తే.. ఈయనగారు ఆట మొత్తం బయట చూసి.. ఎలా ఆడాలో తెలుసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. అమర్ నీ విషయంలో నేను ఎంతగా డిజప్పాయింట్ అయ్యానంటే.. గేమ్ ఆడుతున్నానని నువ్వు అనుకుంటున్నావ్.. నీకు ఒక టాస్క్ అర్థం చేసుకోవడం రావట్లేదు.. ఎవరైనా ఏమైనా చెబితే నువ్వు సరిగా అర్థం చేసుకోవట్లేదు.. సొంతంగా ఆలోచించడం లేదు.. టాస్కులో నువ్వు ఒక అగ్రెషన్ అని ఫీలువతున్నావ్ కానీ నువ్వు మాట్లాడేదానికి రిలెవంట్ ఉండటం లేదు.. చెప్పుకువచ్చాడు అర్జున్.

ఇక ఏదైనా ఎవరైనా చెబితే ఈ వీక్ నేను తినేస్తా, పొడిచేస్తా, ఇరగదీసెస్తా అంటున్నావ్.. కానీ నువ్వు ప్రతి వారానికి మేము అనుకున్న దానికి ఇంకొక మెట్టు కిందకి వస్తున్నావ్ కానీ.. పైకి మాత్రం రావడం లేదు.. అంటూ తన కారణాలు చెప్పుకువచ్చాడు. ఇక అమర్ దీప్ కూడా కవర్ చేసుకోడానికి చూశాడు. కానీ అంబటి అర్జున్ చెప్పిన రీజన్స్ విని ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇక రియల్ ఆటగాడు వచ్చేశాడు రోయ్ అని అంతా అనుకుంటన్నారు. ఇక ఈ వారం అమర్ దీప్ 7 ఓట్లతో నామినేషన్స్ లోఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X