Bigg Boss Telugu 7: తండ్రైన అంబటి అర్జున్.. మంచి నాన్నగా గుర్తింపు.. ప్రేమంటే ఇదిరా నాయనా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన రేటింగ్ ను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతున్న ఈ షో మరికొన్ని రోజుల్లో ఫినాలేకు చేరనుంది. అయితే ప్రస్తుతం 14వ వారం కొనసాగుతుండగా.. మొదటి ఫైనలిస్ట్ గా అంబటి అర్జున్ రికార్డు సృష్టించాడు. 13వ వారంలో కచ్చితంగా ఎలిమినేట్ అవుతాడని అనుకన్న ఇతను ఫినాలే అస్త్ర గెలుచుకుని టాప్ 5కి చేరిపోయాడు. అయితే తాజాగా ఈయన తండ్రిగా మారాడు. అంతేకాదండోయ్ మంచి నాన్నగా కూడా గుర్తింపు పొందాడు. ఏం చేసి ఆయన మంచి నాన్నగా మారారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

14వ వారంలో భాగంగా.. బిగ్ బాస్ ఫన్ టాస్క్ నిర్వహిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే టాస్క్ లు ఇస్తూ అందరినీ అలరిస్తున్నారు. ముఖ్యంగా ఓటింగ్ వేయమని ప్రేక్షకులను అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించేందుకు ఈ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. అయితే ఇందులో భాగంగానే బిగ్ తన ఇద్దరు చిన్న పిల్లలను హౌస్ లోకి పంపాడు. తాను బయటకు వెళ్తున్నట్లు చెప్పి పిల్లలను కంటెస్టెంట్లకు అప్పగించాడు. వారిని చూసుకోవాల్సి బాధ్యత మీ మీద ఉందంటూ వెల్లడించాడు. ఇందులో భాగంగానే హౌస్ మేట్స్ అంతా పిల్లలను చక్కగా చూసుకున్నారు.

Ambati Arjun Seemed Like Good Father Before The Children Were Born in Bigg Boss Telugu 7

ఈక్రమంలోనే ప్రిన్స్ యావర్ ఓ బేబీని తీసుకోగా.. అంబటి అర్జున్ మరో బేబీని తీసుకున్నాడు. వీరిద్దరూ బిగ్ బాస్ పిల్లలను తమ సొంత పిల్లలకంటే ఎక్కువగా చూసుకున్నారు. పిల్లలకు ఏం కావాలంటే అది అందిస్తూ... నవ్విస్తూ చాలా చక్కగా చూసుకున్నారు. ముఖ్యంగా అంబటి అర్జున్ అయితే ఆ బేబీని తన సొంత బిడ్డలా భావించి చంకనెత్తుకున్నారు. బేబీకి పాలు తాగించి పడుకోబెట్టడం, ఆడించడం వంటివి చేశారు. ముఖ్యంగా బేబీని ఫుల్ గా నవ్విస్తూ... ఏమాత్రం ఏడవనివ్వలేదు.

మరోవైపు ప్రిన్స్ యావర్ కూడా చాలా చక్కగా చూసుకున్నాడు. చిన్న పిల్లలకు అర్థమయ్యే భాషలో సౌండ్స్ చేస్తూ... ఎంతో అనుభనం ఉన్నవాడిలా ఆడించాడు. తింటుండగా.. బిడ్డ ఏడుస్తుంటే కూడా పరిగెత్తుకు వచ్చి మరీ పాలు పట్టాడు. బొమ్మలనే ఇంత చక్కగా చూసుకున్న వీరు నిజమైన బిడ్డలను ఇంకెంత చక్కగా చూసుకుంటారో. ఇంట్లో వాళ్లంతా ఈ టాస్క్ లో పాల్గొన్నప్పటికీ.. అంబటి అర్జున్, యావర్ లే ఎక్కువగా పిల్లల బాధ్యత తీసుకున్నారు.

Ambati Arjun Seemed Like Good Father Before The Children Were Born in Bigg Boss Telugu 7

ముఖ్యంగా అంబటి అర్జున్ అయితే... మరింత ప్రేమను ఒలకబోశాడు. అల్లుల్లూ.. బుచ్చు బుచ్చులూ అంటా తెగ సందడి చేశాడు. నిజ జీవితంలో త్వరలోనే తండ్రి కాబోతున్న ఈయన.. ఈ టాస్క్ లో బిడ్డను చక్కగా చూసుకోవడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. అలాగే బిగ్ బాస్ బిడ్డ కూడా మాట్లాడుతూ.. మీరు మంచి తండ్రిలా కనిపిస్తున్నారంటూ పొగిడింది. దీనికి అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. మరి నిజ జీవితంలోనూ ఈయన మంచి నాన్న అనిపించుకుంటారని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X