Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ కాదు రతికా బిడ్డ.. శివాజి పుల్లలు పెడతాడు.. హీరో సంచలన వ్యాఖ్యలు
దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో ఆదరణను సొంతం చేసుకుంటూ అత్యధిక రేటింగ్‌ను దక్కించుకుంటోన్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే నిర్వహకులు వరుస పెట్టి సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పుడు నడుస్తోన్న ఏడో సీజన్ ఉల్టా పుల్టా కంటెంట్‌తో వినూత్నంగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజా ఎపిసోడ్‌లో షోలోకి కొందరు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరు పల్లవి ప్రశాంత్, శివాజిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
ఉల్టా పుల్టా 2.O వెర్షన్‌తో:గత రెండు సీజన్లు ఆశించిన రీతిలో ఆదరణను అందుకోలేదు. దీంతో ఏడో సీజన్‌ను సరికొత్త హంగులతో ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో ఎవరూ ఊహించని కంటెంట్‌ను చూపిస్తున్నారు. ఇలా ఐదు వారాలు పూర్తైన తర్వాత అంటే గత ఆదివారమే ఈ సీజన్‌లో 2.O వెర్షన్‌ను కూడా మొదలెట్టారు. ఫలితంగా ఈ షోపై అందరిలో ఆసక్తి మరింతగా పెరిగింది.

ఐదుగురిలో ఫాలోయింగ్:బిగ్ బాస్ ఏడో సీజన్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు 2.O వెర్షన్ గత ఆదివారమే అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ ఎపిసోడ్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగు పెట్టారు. అందులో సీరియల్ హీరోగా తెలుగు వాళ్లకు సుపరిచితుడు అయిన అంబటి అర్జున్ బాగా హైలైట్ అయ్యాడు. దీనికి కారణం అతడికి బయట భారీ ఫాలోయింగ్ ఉండడమే అని చెప్పొచ్చు.
దమ్ము, దుమ్ము వాళ్లేనట:గత ఎపిసోడ్‌లో బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్‌ను హౌస్‌లో ఉన్న వారిలో దమ్ము ఎవరు? దుమ్ము ఎవరు? చెప్పాలని నాగార్జున అడిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అర్జున్‌ను కూడా సేమ్ క్వశ్చన్ అడిగాడు. దీనికతడు ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ దమ్ము ఆటగాళ్లని చెప్పింది. అలాగే, అమర్‌దీప్ చౌదరి, సందీప్ దుమ్ము ప్లేయర్లు అన్నాడు.
మాకే అర్థం కావడంలేదు:తోటి సీరియల్ హీరోనే అయినా అమర్‌దీప్ చౌదరిని దుమ్ము కంటెస్టెంట్ అనడంపై అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. 'అమర్ ఎందుకు ఇలా ఆడుతున్నాడో తెలీదు. మేము ఎవరం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదైనా వాదన జరిగితే కచ్చితంగా మాట్లాడడం లేదు. కరెక్ట్ పాయింట్ తీసుకున్నా దాన్ని ఎందుకనో సరిగా చెప్పలేకపోతున్నాడు. సందీప్ రూల్స్ ఫాలో అవడం లేదు' అని చెప్పాడు.
రైతు బిడ్డ రతికా బిడ్డలా:దమ్మున్న ఆటగాళ్ల గురించి కూడా అర్జున్ వివరించాడు. 'యావర్‌కు కోపం ఉన్నా అతడు ప్రతి వారం బాగా ఆడుతున్నాడు. ముఖ్యంగా ఫెయిర్‌గా ఆడుతున్నాడు. ఇక, ప్రశాంత్ ఫస్ట్ వారం రైతు బిడ్డ రతికా బిడ్డలా ఆడాడు. తర్వాత శివాజి బిడ్డలా ఆడాడు. కానీ, రెండు వారాలుగా అతడు మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నాడు. ఆటను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు' అని షాకింగ్ కామెంట్ చేశాడు.
శివాజి పుల్లలు పెడతాడు:అనంతరం తనకు శివాజి, యావర్, ప్రశాంత్‌లతో పోటీ ఉంటుందని అర్జున్ చెప్పాడు. అయితే, వాళ్లను తనకు పోటీగా అనుకోకుండా ఆ ముగ్గురికీ పోటీ ఇచ్చేలా ఆడాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ముఖ్యంగా శివాజి పుల్లలు పెడతాడు కానీ, అది ఎవరికీ అర్థం కాదని అన్నాడు. అలాగే, ఆయన ఎంతో తెలివిగా ఆడుతున్నాడని కూడా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











