Bigg Boss Telugu 7: అంబటి అర్జున్ షాకింగ్ డెసీషన్.. హౌస్‌లో ఉన్నంతకాలం ఆ కంటెస్టెంట్‌తో కలవడట!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో ప్రస్తుతం 12వ వారం నామినేషన్లు కొనసాగుతున్నాయి. గత రెండు వారాలుగా రసవత్తరంగా షో సాగుతుండగా.. అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పదో వారం ఫ్యామిలీ వీక్.. ఆ తర్వాత ఎవిక్షన్ పాస్ కోసం జరిగిన పోటీల్లో అనేక గొడవలు జరిగాయి. కంటెస్టెంట్ల మధ్య జరిగిన వార్ లతో ఇల్లంతా హీటెక్కిపోగా.. ఆదివారం కాస్త చల్లబడింది. కానీ దాన్ని పూర్తిగా కంటెస్టెంట్లు ఆస్వాదించేలోపే మరోసారి వారి మధ్య నిప్పు పెట్టాడు బిగ్ బాస్.

పులికి బాగా ఆకలి వేస్తుంది.. తగిన కారణాలు చెప్పి ఇద్దిరిని నామినేట్ చేయండంటూ చెప్పి కంటెస్టెంట్లు గొడవ పడేలా చేశాడు. నామినేషన్స్ వచ్చాయంటే బిగ్ బాస్ ఇంట్లో జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్లు యమా హాట్ గా సాగాయి. హౌస్ మేట్స్ అంతా ఫౌల్ గేమ్ ఆడాడని.. ఫ్రీ ఎవిక్షన్ పాస్ పోగొట్టుకున్న యావర్ పై పడ్డారు. ఎక్కువ నామినేషన్లు ఈవారం ఆయనకే వచ్చాయి. ఇదంతా చాలదన్నట్లు మరో రాయి కూడా ఆయనపై పడింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ambati Arjun Shocking Decision on Prince Yawar in Bigg Boss Telugu 7

సీరియల్ బ్యాచ్ కు చెందిన అంబటి అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి అడుగు పెట్టారు. అయితే గతంలో అన్ని ఎపిసోడ్ లు చూసి వచ్చిన ఆయన ప్రజలను తనవైపు తిప్పుకునేలా గేమ్ ప్లే చేశారు. ముఖ్యంగా అమర్ దీప్ ను టార్గెట్ చేసి శివాజి, ప్రిన్స్, పల్లవి ప్రశాంత్ లతో స్నేహం కొనసాగించాడు. ప్రియాంక, శోభాశెట్టిలతోనూ నార్మల్ గానే ఉన్నాడు. అయితే రోజులు గడుస్తున్నా కొద్దీ ఆయన తన అసలు స్వరూపాన్ని చూపిస్తున్నారు. క్లోజ్ గా ఉన్న వాళ్లనే నామినేట్ చేస్తూ అందరికీ షాకిస్తున్నారు.

ముఖ్యంగా మొన్నటి వారంలో పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసిన అంబటి అర్జున్ ఇప్పడు తాజాగా ప్రిన్స్ యావర్ ను టార్గెట్ చేశాడు. ఫౌల్ గేమ్ ఆడావు అంటూ నామినేట్ చేశాడు. ఈక్రమంలోనే ప్రిన్స్ యావర్ టర్న్ రాగా.. అమర్ దీప్ తో పాటు అంబటి అర్జున్ ను నామినేట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య హాట్ వార్ సాగినట్లుగా అర్థం అవుతోంది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియకపోయినప్పటికీ... అంబటి అర్జున్ ఓ షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు. దాన్ని మనం ఈరోజు విడుదల అయిన ప్రోమో చివరలో చూడవచ్చు.

Ambati Arjun Shocking Decision on Prince Yawar in Bigg Boss Telugu 7

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం అంబటి అర్జున్ ప్రిన్స్ యావర్ తో మాట్లాడనని... కలవని చెప్పాడు. ఇదంతా చూస్టుంటే యావర్ అన్న మాటలకు అంబటి అర్జున్ చాలా ఫీల్ అయినట్లు అర్థం అవుతుంది. అందుకే ఈ డెసీషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈరోజుటి ఎపిసోడ్ చూస్తే తప్ప పూర్తిగా ఏమైందో తెలియదు. చూడాలి మరి ఏం జరిగిందో, ఎం జరగబోతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X