Bigg Boss Buzz: హోస్టుగా మరో టాప్ కంటెస్టెంట్.. శివాజి ఫ్రెండ్‌కే బిగ్ బాస్ ఆఫర్
ఊహకే అందని మలుపులు, రసవత్తరంగా సాగే టాస్కులు, షాక్‌కు గురి చేసే గొడవలతో సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే దీన్ని ఇండియాలోని చాలా భాషల్లో తీసుకు వచ్చారు. కానీ, తెలుగులోనే ఇది భారీ స్థాయిలో ఆదరణను సొంతం చేసుకుంది. ముఖ్యంగా మన దగ్గర దేశంలో ఏ షోకూ రానంత రేటింగ్‌ను సొంతం చేసుకుని టాప్ ప్లేస్‌కు చేరుకుంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో త్వరలోనే 8వ సీజన్ మొదలెట్టబోతున్నారు. ఇందులో బిగ్ బాస్ బజ్ షో హోస్టును తాజాగా ఫైనల్ చేశారు. అది ఎవరో మీరే చూడండి!
సీజన్లన్నీ సూపర్ హిట్
చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగులోనే బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్ అవుతోంది. అందుకే టీమ్ ప్రతి ఏడాది ఒక సీజన్‌ను ప్రసారం చేస్తోంది. ఇలా ఇప్పటి వరకూ ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను తీసుకు వచ్చింది. ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదే సమయంలో ఈ బిగ్ బాస్‌కు దేశంలోనే టాప్ రేటింగ్ వచ్చింది. దీంతో మరింత జోష్‌తో సీజన్లను ప్లాన్ చేస్తున్నారు.

ఎనిమిదో సీజన్ సిద్ధం
బిగ్ బాస్ షోకు సంబంధించి ఇప్పటి వరకూ సీజన్లు అన్నీ భారీ స్థాయిలో ప్రేక్షకుల స్పందనను అందుకున్నాయి. దీంతో ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను కూడా ప్రసారం చేసేందుకు నిర్వహకులు ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను కూడా ఇచ్చేశారు. ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయబోతున్నాడు.
లోగో, ప్రోమో, డేట్‌తో
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై అంచనాలు భారీగా ఉండడంతో అందుకు అనుగుణంగానే దీన్ని దీన్ని 'అంతులేని వినోదం' అనే కాన్సెప్టుతో ఎంతో గ్రాండ్‌గా తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ లోగోను, కాన్సెప్టు ప్రోమోను కూడా విడుదల చేశారు. ఇక, ఈ సీజన్‌ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బిగ్ బాస్ బజ్ షోపై
బిగ్ బాస్ సీజన్ సమయంలో 'బిగ్ బాస్ బజ్' అనే టాక్ షోను కూడా రన్ చేస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. గతంలో తనీష్, రాహుల్ సిప్లీగంజ్, ఆరియానా గ్లోరీ, యాంకర్ రవి, యాంకర్ శివ, గీతూ రాయల్ వంటి వాళ్లు దీన్ని హోస్ట్ చేశారు. ఇప్పుడు ఎనిమిదో సీజన్ హోస్టుపై సస్పెన్స్ నెలకొంది.
షాక్ ఇచ్చిన శివాజి
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి బజ్ టాక్ షోకు హోస్టుగా ఎవరు ఉంటారన్న దానిపై చాలా రకాల ప్రచారాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా హైలైట్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్‌కు బిగ్ బాస్ బజ్ హోస్టుగా శివాజిని తీసుకున్నారని ఓ టాక్ నడిచింది. అయితే, ఈ ఆఫర్‌ను అతడు రిజెక్ట్ చేశాడని తాజాగా సమాచారం లీకైంది.
మరో కంటెస్టెంట్‌తో
బిగ్ బాస్ బజ్ షోను హోస్ట్ చేయడానికి శివాజి ఆసక్తి చూపకపోవడంతో నిర్వహకులు శోభా శెట్టి పేరును సైతం పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీనికోసం సీరియల్ హీరో అంబటి అర్జున్‌ను ఫైనల్ చేశారట. ఇప్పటికే అతడు ఈ డీల్‌పై సంతకం కూడా చేసేశాడని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని టాక్.


Click it and Unblock the Notifications











