Bigg Boss Telugu 7: మరో ఉల్టా పుల్టా ట్విస్ట్.. ఎవిక్షన్ పాస్ గెలిచిన అర్జున్.. అంతలోనే సీన్ రివర్స్
తెలుగు బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలోనే ఎన్నో రకాల కార్యక్రమాలు వచ్చాయి. అయితే, అందులో కొన్నింటిని మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తూ సక్సెస్ చేస్తున్నారు. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ షో ఒకటి. కొత్త కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో వరుసగా సీజన్లను మొదలెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను నడుపుతున్నారు. ఇది చివరి దశకు చేరడంతో నిర్వహకులు ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కును పెట్టారు. ఇందులో మొదటి రౌండ్‌లో ఎవరు గెలిచారు? ఏం జరిగింది? అనేవి చూద్దాం పదండి!
అలాంటి కంటెంట్‌తో మజా:మిగిలిన భాషల కంటే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ స్పందన వస్తోంది. దీంతో ఏడో సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎన్నో ప్రయోగాలతో ఉల్టా పుల్టాగా నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు, షాక్‌లతో కూడిన కంటెంట్‌ను చూపిస్తూ మజాను పంచుతూ వెళ్తున్నారు.

ర్యాంకుల టాస్క్.. ఎవరంటే:గత ఎపిసోడ్‌లో ర్యాంకుల టాస్కును నిర్వహించారు. ఇందులో శివాజిని అందరూ కలిసి టాప్‌లో పెట్టారు. ఆ తర్వాత ప్రిన్స్ రెండో ర్యాంకులో, పల్లవి ప్రశాంత్ మూడో ర్యాంకులో, ప్రియాంక జైన్ నాలుగో ర్యాంకులో, శోభా శెట్టి ఐదో ర్యాంకులో నిలిచారు. వీళ్ల తర్వాత అమర్‌దీప్‌కు ఆరో స్థానం, గౌతమ్‌కు ఏడో ర్యాంక్, అర్జున్‌కు 8వ స్థానం, అశ్వినికి 9 ర్యాంక్, రతికాకు పదో స్థానం దక్కాయి.
చివరి ఐదుగురి కోసం టాస్క్:ర్యాంకుల టాస్కులో చివరి ఐదు స్థానాల్లో నిలిచిన అమర్‌దీప్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతికాలకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వీళ్ల ఐదుగురు వీక్ కంటెస్టెంట్లు అని అందరూ భావించిన కారణంగా.. బాటమ్ 5 కంటెస్టెంట్ల కోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇస్తున్నట్లు చెప్పాడు. ఇందులో గెలిచిన వాళ్లు ఒక వారం ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఐదుగురికి పజిల్ టాస్కుతో:ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో పజిల్ టాస్కును ఇచ్చారు. అందులో భాగంగా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న తాళాలను గేలంతో పట్టుకోవాలి. ఆ తర్వాత తమ పజిల్ దగ్గరకు వెళ్లి కీ ఓపెన్ చేయాలి. అనంతరం వాళ్ల ముందు ఉన్న స్టాండ్‌లపై 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' అనే విధంగా పజిల్ పెట్టాలి. ఇది ఎవరైతే త్వరగా, కరెక్టుగా పెడతారో వాళ్లే విజేత అవుతారని చెప్పాడు.
వాళ్లు ముందే.. అతడే కరెక్ట్:'ఎవిక్షన్ ఫ్రీ పాస్' టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో ఇచ్చిన పజిల్ టాస్కును అశ్విని, గౌతమ్ ఎంతో వేగంగా కంప్లీట్ చేసేశారు. ఆ తర్వాత అమర్‌దీప్ కూడా తన పజిల్‌ను పూర్తి చేసి గంట మోగించాడు. తర్వాత రతికా రోజ్, అర్జున్ కూడా ఈ టాస్క్ పూర్తి చేశారు. అయితే, ఇందులో మిగిలిన అందరూ పజిల్‌ను తప్పుగా పెట్టగా అర్జున్ కరెక్టుగా సెట్ చేసి విజయం సాధించాడు.

అంతలోనే ట్విస్ట్ ఇచ్చాడు:'ఎవిక్షన్ ఫ్రీ పాస్'ను అర్జున్ గెలుచుకున్నాడని, పాస్‌ను తీసుకోమని కూడా సూచించాడు. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ ఇస్తూ.. 'అర్జున్.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నందుకు అభినందనలు. కానీ, దీన్ని మీరు డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది' అని ట్విస్ట్ ఇచ్చాడు. అంటే టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లతో పోరాడితేనే అతడికి పాస్ వస్తుంది. దీంతో అందరూ షాక్ అయిపోయారు.


Click it and Unblock the Notifications











