Bigg Boss Telugu 7: 4 సినిమాల్లో నటించినా ఎవరికీ తెలియని నటి.. ఈ శుభ శ్రీ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభం అయింది. అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహారిస్తున్న ఈ షో కు సంబంధించిన గ్రాండ్ కర్టెన్ రైజర్ ఈవెంట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాకు తెలిసినా వివరాలు.. మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. వారిలో శుభ శ్రీ గురించి ఇప్పుడు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఇక ఈ షోలో ఒక్కో కంటెస్టెంట్ తమదైన స్టైల్ లో డ్యాన్స్ ఫర్మామెన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. ఇక శుభ శ్రీ... బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈమె గురించి చాలా మందికి తెలియదు. ఎవరూ ఈ శుభ శ్రీ... ఏ సినిమాల్లో నటించిందనే వివరాలపై ఓ లుక్ వేద్దాం.

Amigos Movie fame Subhashree Rayaguru into Bigg Boss Telugu 7 show

శుభ శ్రీ రాయగురు... సౌత్ ఇండియాకు చెందిన మోడల్, యాక్టర్, యాంకర్. అంతేాకాదు ఆమె న్యాయవాది కూడా. ఇక ఒడిశా రాష్ట్రంలో పుట్టి పెరిగిన శుభ శ్రీ... ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తుంది. ఇక కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించింది శుభ శ్రీ. ఇక ముంబైలోని కేవీ లా కాలేజీలో LLB కోర్సు చేసింది.

తన చిన్నతనం నుంచి.. సుభశ్రీకి క్రీడలంటే మక్కువ. అందులోనూ ఆమె మంచి ప్రతిభను కనబరిచింది. ప్రాంతీయ స్థాయిలో ఖో ఖో పోటీలలో, జిల్లా స్థాయిలో బ్యాడ్మింటన్‌లో, జిల్లా స్థాయిలో మంచి క్రికెట్ క్రీడాకారిణిగా కూడా తన పాఠశాలకు ప్రాతినిధ్యం వహించింది. కళాశాల రోజుల్లో, సుభశ్రీ మోడలింగ్‌లో తన వృత్తిని ప్రారంభించింది.

VLCC ఫెమినా మిస్ ఇండియా ఒడిశా 2020ని కూడా శుభ శ్రీ గెలుచుకుంది. తర్వాత, సుభశ్రీ యాంకర్‌ గా మారి అనేక ప్రోగ్రామ్స్ చేసింది. సుభాశ్రీ హిందీ చిత్రం 'మస్తీజాదే'కి సహాయ దర్శకురాలిగా కూడా పనిచేశారు. ఇక పలు సీరియల్స్ లోనూ నటించిన ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక పలు సినిమాల్లోనూ మెరిసింది శుభ శ్రీ.

Amigos Movie fame Subhashree Rayaguru into Bigg Boss Telugu 7 show

2022లో రుద్రవీణ చిత్రంతో శుభ శ్రీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత డెవిల్ అనే తమిళ్ సినిమాలో నటించి... కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇక తెలుగులో అమిగోస్, కథ వెనుక కథ, సందేహం సినిమాల్లో నటించింది. కానీ ఇవేవి తనకు గుర్తింపును తీసుకురాలేదు. ఆమెగా నటిగా అయితే పేరు తెచ్చుకున్నప్పటికీ... ఎందుకో మాత్రం ఆమెకు అవకాశాలు రాలేదు.

ఇక ఈ భామ తన అందం, అభినయంతో ఆలరించే శుభ శ్రీ బిగ్‌బాస్ మనసు దోచుకొన్నారు. దాంతో ఆమెకు బిగ్‌బాస్‌ తెలుగు 7 సీజన్‌లో పాల్గొనే ఆఫర్ లభించింది. సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమయ్యే బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతున్నారు. తెలుగు ఫిల్మి బీట్ నుంచి ఆమెకు ఆల్ ది బెస్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X