Amigos Event: అలాంటి సినిమా చిరంజీవి గారు చేశారు.. మళ్ళీ నేను ఇలా: కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ స్పీచ్

కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించిన డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం అమిగోస్ పై నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇక ఫిబ్రవరి 10న అమిగోస్ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఆదివారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించగా.. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలని తెలియజేశారు.

నా తమ్ముడు నాకు గుండెకాయ

నా తమ్ముడు నాకు గుండెకాయ

ముందుగా నా తమ్ముడు నాకు గుండెకాయ అంటూ కళ్యాణ్ రామ్ నందమూరి అభిమానులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఇలాంటి అద్భుతమైన కథని అందించిన దర్శకుడు రాజేంద్రకి ముందుగా కళ్యాణ్ రామ్ థాంక్స్ చెప్పారు. అనంతరం మాట్లాడుతూ టాలీవుడ్ లో ఫస్ట్ డ్యూయల్ రోల్ మూవీ అంటే రాముడు భీముడు సినిమాని తాతగారు ఎన్టీఆర్ చేశారు. ఆ తరువాత దానిని కొనసాగిస్తూ చాలా మంది చేశారు.. అని కళ్యాణ్ రామ్ అన్నారు.

అలాంటి సినిమా చిరంజీవి గారు చేశారు

అలాంటి సినిమా చిరంజీవి గారు చేశారు

ఇక మూడు పాత్రలలో ముగ్గు మొనగాళ్ళు సినిమాని చిరంజీవి చేశారు. తరువాత జై లవకుశ సినిమాని మా బ్యానర్ లోనే తమ్ముడు తారక్ చేశారు. అయితే డ్యూయల్ రోల్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్ని కూడా అన్నదమ్ముల రిలేషన్ లోనే ఎక్కువ ఉంటాయి. అయితే మొదటిసారి అమిగోస్ లో సంబంధం లేకుండా ఒకే రూపంలో ఉండే ముగ్గురు వ్యక్తుల మధ్య నదించే కథగా అమిగోస్ ఉంటుంది.. అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

 ముగ్గురి కథ అమిగోస్

ముగ్గురి కథ అమిగోస్

మనుషులని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని విన్నాం. అలాంటి వారిలో ఈ ముగ్గురు కథ ఉంటుంది. ఒక ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ని కమర్షియల్ కథగా మార్చి దర్శకుడు రాజేంద్ర ఈ మూవీని అద్బుతంగా ప్రెజెంట్ చేశారు. ఈ సినిమా కచ్చితంగా మిమ్మల్ని డిజపాయింట్ చేయదు.. అని కళ్యాణ్ రామ్ మాట్లాడారు.

నాకు అండగా నా తమ్ముడు

నాకు అండగా నా తమ్ముడు

బింబిసార సమయంలో ఏదైతే చెప్పానో ఇప్పుడు కూడా అదే చెబుతున్న కచ్చితంగా ఈ మూవీ మీకు నచ్చుతుంది. నేను ఎప్పుడూ కూడా కొత్తగా ప్రేక్షకులకి ఏదైనా ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటా ఈ ప్రయాణంలో నన్ను 18 ఏళ్ళు మీరందరూ భరించారు. దానికి అందరికి థాంక్స్ చెబుతున్న అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. ఇక ఈ నా లైఫ్ లో నా పక్కనే ఉంటూ నాకు అండగా ఉండే నా తమ్ముడు తారక్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

మీ అందరికి నచ్చుతుంది

మీ అందరికి నచ్చుతుంది

ఇక మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ గా కంటే మా కుటుంబంలో ఒకరుగా వారంటే నాకు ఎప్పుడూ అభిమానం ఉంటుంది. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని కళ్యాణ్ రామ్ స్పీచ్ తెలిపారు. అలాగే టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్ కి గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ.. ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్స్ లో రాబోతోందని తప్పకుండా అందరికి నచ్చుతుందని కళ్యాణ్ రామ్ స్పీచ్ ను ముగించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X