బిగ్ బాస్2: సరైనోళ్లు ముగ్గురూ ఉన్నారు.. కానీ ఆ ఇద్దరిలో ఒక్కరే!
బిగ్ బాస్2 లో ఈ వీకెండ్ అంత్యంత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. ఈవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటే వాళ్ళు ఫైనల్స్ కు చేరువైనట్లే. ప్రస్తుతం ఇంటిలో ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. బిగ్ బాస్ 2 సీజన్ విజేత ఎవరనే చర్చ ఆడియన్స్ లో అప్పుడే మొదలైపోయింది. వినోదాత్మకంగా సాగుతున్న బిగ్ బాస్ షో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేదానిపై ఉహాగానాలు మొదలయ్యాయి.

నామినేషన్‌లో ఉన్నవారు
ఈ వారం నామినేషన లిస్టులో కౌశల్, అమిత్, గీత, రోల్ రైడ, దీప్తి ఉన్నారు. వీరిలో ఇంటిని వదలి వెళ్ళేది ఎవరనే ఉత్కంఠ నెలకొని ఉంది. కౌశల్ సీజన్ మొత్తానికి నామినేట్ అయ్యాడు. బయట ఆడియన్స్ నుంచి అతడిని సపోర్ట్ లభిస్తుండడంతో ప్రతివారం ఎలిమినేషన్ నుంచి బయట పడుతున్నాడు.

ఆ ముగ్గురూ
ప్రస్తుతం హౌస్ లో హాట్ ఫేవరెట్స్ గా భావిస్తున్న కౌశల్, గీత, దీప్తి ఈ వారం నామినేషన్ లో ఉండడం విశేషం. కౌశల్ కు గీత గట్టి పోటీదారు. ఆమెకు కూడా ఆడియన్స్ నుంచి మంచి మద్దత్తు లభిస్తోంది.

అదే ఆమెకు బలం
దీప్తి పోరాట పటిమ కలిగిన ఇంటి సభ్యురాలు. ఆమెకు అదే బలం. ఈ నేపథ్యంలో దీప్తికి ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రమాదం ఉండకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మిగిలింది వాళ్లిద్దరే
హౌస్ లో మొదటి నుంచి అమిత్, రోల్ రైడ ఏదో విధంగా బండిని లాగేస్తున్నారు. కానీ ఈవారం మాత్రం వాళ్లిదరిలో ఒకరు బయటకు వెళ్ళక తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రోల్ రైడ, అమిత్ లలో ఇంటి నుంచి బయటకు వెళ్ళేది ఎవరు ? వీళ్లిద్దరూ కాకుండా ఇంకెవరైనా వెళుతారా అనేది తేలాలంటే వీకెండ్ ఎపిసోడ్స్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











