twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత నన్ను చూసి నవ్వుకుంది.. కౌశల్‌లా ఉండడం ఎవరివల్లా కాదు.. బిగ్ బాస్ అమిత్!

    |

    బిగ్ బాస్ సమరం మరి కొన్ని రోజులో ముగియబోతోంది. ఇంటి సభ్యులంతా టైటిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న బిగ్ బాస్ ఎపిసోడ్స్ గమనిస్తుంటే ఇంటి సభ్యుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అమిత్ 99 రోజులు హౌస్ లో సక్సెస్ ఫుల్ గా గడిపిన తరువాత ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం అమిత్ ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అమిత్ బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    అమిత్ భయ్యా

    అమిత్ భయ్యా

    బిగ్ బాస్ షో ద్వారా తాను అమిత్ భయ్యాగా మారిపోయానని అమిత్ తెలిపాడు. అమిత్ భయ్యా అనే పిలుపు చాలా బావుంది. ఇకపై నుంచి అందరూ నన్ను ఇలాగే పిలవండి అని అమిత్ తెలిపాడు.

     దగ్గరకు వచ్చేందుకు బయపడేవాళ్లు

    దగ్గరకు వచ్చేందుకు బయపడేవాళ్లు

    బిగ్ బాస్ షోకు ముందు నాకు ఎక్కడ చూసినా చాలా మంది భయపడేవాళ్లు. దగ్గరకు రావడానికి ఆలోచించేవాళ్లు. నేను సినిమాలో కదా విలన్‌ని. బయట ఎందుకు భయపడుతున్నారు అని అనుకునేవాడిని అంటూ అమిత్ తెలిపాడు. పలు తెలుగు చిత్రాల్లో అమిత్ విలన్ వేషాలు వేసిన సంగతి తెలిసిందే.

     ఆడవాళ్లే వచ్చి

    ఆడవాళ్లే వచ్చి

    కానీ బిగ్ బాస్ పూర్తిగా నా ఇమేజ్ ని మార్చేసింది. ఇప్పుడు ఆడవాళ్లే నా దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు అని అమిత్ తెలిపాడు. బిగ్ బాస్ కు ముందు ఇచ్చిన సెల్ఫీల కన్నా ఎక్కువ సెల్ఫీలు ఈ రెండు మూడురోజుల్లోనే ఇచ్చానని అమిత్ తెలిపాడు.

     నేనేంటో తెలిసింది

    నేనేంటో తెలిసింది

    నేను సినిమాల్లో విలన్ పాత్రలు వేస్తాను. కానీ రియల్ లైఫ్ లో ఎలా ఉంటానో బిగ్ బాస్ షో ద్వారా తెలిసిందని అమిత్ తెలిపాడు. బిగ్ బాస్ హౌస్ ఓ ఉన్నట్లే నా ఫ్యామిలీతో, పిల్లలతో ఉంటానని అమిత్ తెలిపాడు.

     సన్నాఫ్ సత్యమూర్తి

    సన్నాఫ్ సత్యమూర్తి

    సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించా. ఆ చిత్రంలో ఫైట్ సన్నివేశంలో సమంతని జుట్టు పట్టుకుని విసిరివేయాలి. కాని అలాంటి సన్నివేశాలు నేను చేయలేను. ఆడవారి పట్ల అలా ప్రవర్తించలేను. అందుకే షాట్ కి ముందు సమంత వద్దకు వెళ్లి చెప్పా. నేను మీ తలని జస్ట్ అలా తాకుతాను. మీరు వెళ్లిపోండి అని చెప్పా.

     సమంత నవ్వుకుంది

    సమంత నవ్వుకుంది

    సమాంత మాత్రం.. పరవాలేదు.. మీరు మాస్టర్ చెప్పిన విధంగానే జుట్టు పట్టుకోండి అని చెప్పింది. ఎలాగో కష్టపడి ఆ షాట్ పూర్తి చేశాం అని అమిత్ తెలిపాడు. ఆ తరువాత సమంత మాట్లాడుతూ.. పేద జుట్టు, గడ్డం వేసుకుని ఉన్నాం.. ఇంత సున్నితంగా ఉన్నావు ఏంటి అంటూ నవ్వుకుంది అని అమిత్ తెలిపాడు. పైకి ఆలా కనిపిస్తారు కానీ సున్నితమైన హృదయం ఉన్న వ్యక్తి మీరు అని సమంత అన్నట్లు అమిత్ తెలిపాడు.

     కౌశల్‌కి హ్యాట్సాఫ్

    కౌశల్‌కి హ్యాట్సాఫ్

    బిగ్ బాస్ షో లో కౌశల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గీత మధురికి కూడా మంచి ఛాన్స్ ఉంది అని అమిత్ తెలిపాడు. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ ఉన్నట్లు ఒంటరిగా ఉండడం ఎవ్వరికి సాధ్యం కాదు. ఆ విషయంలో కౌశల్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి అని అమిత్ అన్నాడు.

    English summary
    Amit Tiwari shares his experience in bigg house. Amit remembers S/o Satyamurthi movie incident with Samantha
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X