క్షమాపణలు కోరిన అమితాబ్

By Bojja Kumar

ముంబై: రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు ఏ కార్యక్రమానికి హాజరైనా అనకున్న సమయం కంటే లేట్ గా రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ మాత్రం అలా కాదు. మీడియా సమావేశాలకు, ఇతర ఈవెంట్లకు హాజరవ్వడంలో సమయాన్ని ఖచ్చితంగా పాటించడంలో క్రమ శిక్షణకు మారు పేరు అమితాబ్.

తాజాగా బుధవారం ఓ కార్యక్రమానికి లేటుగా హాజరైన అమితాబ్ క్షమాపణ కోరారు. త్వరలో ప్రారంభం కానున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి' 6వ సీజన్ కార్యక్రమం ప్రమోషనల్ కార్యక్రమానికి హాజరవ్వడానికి బయలుదేరిన బిగ్ బీ ట్రాఫిక్ జామ్ కారణంగా గంటన్నరసేపు ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో ఆయన కోసం మీడియా వారు గంటన్నరసేపు వేచి చూసారు.

తన వల్ల మీడియా ప్రతినిధులు ఇబ్బంది పడటంతో...క్షమించమని కోరారు. తాను 10 గంటలకే బయల్దేరానని, ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల 11 గంటలకు రావాల్సింది 12.30 అయిందని తెలిపారు. ఇందులో తన తప్పేమీ లేదని వివరించారు. 69 ఏళ్ల బచ్చన్ క్షమాపణ కోరడంతో అంతా ఆశ్యర్య పోయారు.

కాగా...'కౌన్ బనేగా కరోడ్ పతి' 6వ భాగం సెప్టెంబర్ 7 నుంచి సోనీ ఎంటర్ టైన్మెంట్ ఛానల్‌లో ప్రారంభం కానుంది. ప్రతి శని-ఆదివారం ఈకార్యక్రమం ప్రసారం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X