డైలీ సీరియల్‌లో నటించటానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్

By Srikanya

Amitabh Bachchan
ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కొన్ని దశాబ్దాలుగా వెండితెరపై, బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఆయన కొత్త అవతారం ఎత్తనున్నారు. డైలీ సీరియల్‌లో ఒక ప్రధానపాత్ర పోషించబోతున్నారు. కౌన్‌ బనేగా కరోడ్‌పతి ఆరవ సీజన్‌ షూటింగ్‌నుఇటీవలే ముగించిన అమితాబ్‌ ఈ ఏడాదే ప్రసారం కాబోతున్న ఒక హిందీ సీరియల్‌లో నటించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దీనికి సంబంధించిన సమాచారాన్ని బయటకు తెలపకుండా దాస్తున్నప్పటికీ, ఈ సీరియల్‌ను అమితాబ్‌ సొంత సంస్థ ఏబీసీఎల్‌ నిర్మిస్తున్నట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా. ఈ సీరియల్‌కోసం ప్రస్తుతం ముంబాయి అంధేరిలోని పలు స్టూడియోలలో నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిసింది. భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నారు. దీనిలో ప్రధాన ఆకర్షణ అమితాబ్‌ అయినప్పటికీ, ఆయన ప్రతి ఎపిసోడ్‌లో కనిపించరని చెబుతున్నారు. అయితే ఆయన దీనికి ప్రచారంమాత్రం ముమ్మరంగా రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది.

ఇక ఏడాది కిందట ప్రసారమైన కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పవిత్ర ఖురాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌పై దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. సెప్టెంబరు 28, 2011న ప్రసారమైన కార్యక్రమంలో అమితాబ్‌.. 'రచా గయా' అనే పదాన్ని వాడారంటూ ఝాన్సీ నివాసి ముదస్సిర్‌ ఉల్లా ఖాన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఖురాన్‌ను ఎవరూ రచించలేదని, అది ఎవరీ సృష్టి కాదని.. అల్లా నుంచి ఉద్భవించిన పవిత్ర గ్రంథమని ఖాన్‌ న్యాయస్థానానికి నివేదించారు. ఆయన వాదనను తోసిపుచ్చిన జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా.. సోమవారం పిటిషన్‌ను కొట్టివేశారు. అమితాబ్‌ బచ్చన్‌ స్టార్‌ప్లస్‌లో నిర్వ హించిన 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' ఎంతో మందిని నిజంగా కోటీశ్వరులని చేయడమే కాక కోట్లాది ప్రేక్షక ప్రజానీ కాన్ని కూడా విశేషంగా ఆకర్షించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X