KBC 12: అమితాబ్ షోలో 7 కోట్లు చేజార్చుకొన్న మహిళ.. బిగ్‌బీ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పగలరా?

కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఎంతో మంది జీవితాలకు పరిష్కారాలకు మార్గం చూపిస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న KBC 12 సీజన్‌లో షో సంచలనాలకు వేదికగా నిలుస్తున్నది. తాజాగా ఎపిసోడ్‌లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అనూప దాస్ ఓ సెన్సేషన్‌కు దగ్గరగా వచ్చి తృటిలో అవకాశాన్ని చేజార్చుకొన్నారు. అసలేం జరిగిందంటే...

జనరంజకంగా కేబీసీ 12

జనరంజకంగా కేబీసీ 12

ఇటీవల ప్రారంభమైన కౌన్ బనేగా కరోడ్ పతి షో అనేక సంచలనాలతో కొనసాగుతున్నది. అమితాబ్ బచ్చన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తుండటంతో ఈ షో మరింత జనరంజకంగా మారింది. ఇలాంటి షోలో బస్తర్ జిల్లా జగ్దల్‌పూర్‌కు చెందిన అనూపాదాస్ తన ప్రతిభాపాటవాలతో అద్భుతంగా ఆకట్టుకొన్నారు.

1 కోటి రూపాయలు ఇలా సొంతం

1 కోటి రూపాయలు ఇలా సొంతం

అమితాబ్ బచ్చన్ అడిగిన జనరల్ నాలెడ్జి ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెబుతూ అనూపా దాస్ కోటి రూపాయల ప్రశ్నకు సక్సెస్‌పుల్‌గా సమాధానం చెప్పారు. కోటి రూపాయల ప్రశ్నగా కేబీసీలో లడక్ ప్రాంతంలోని రేజంగ్ లా అనే ప్రాంతంలో 1962 నవంబర్ 18వ తేదీన అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి.. పరవ్ వీర్ చక్ర అవార్డును అందుకొన్నది ఎవరు? అనే ప్రశ్నను సంధించారు. ఆ ప్రశ్నకు ఏ) మేజర్ ధన్ సింగ్ థాపా బీ) లెఫ్టినెంట్ కల్నల్ ఆర్డెషిర్ తారాపోర్ సీ) సుబేదార్ జోగిందర్ సింగ్ డీ) మేజర్ సైతాన్ సింగ్ పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. ఈ ప్రశ్నకు మేజర్ సైతాన్ సింగ్ అని సమాధానం చెప్పి కోటి రూపాయలు గెలుచుకొన్నారు.

7 కోట్ల రూపాయాల జాక్‌పాట్ ప్రశ్నతో

7 కోట్ల రూపాయాల జాక్‌పాట్ ప్రశ్నతో


ఇక అనూపా దాస్ ముందుకు 7 కోట్ల రూపాయల జాక్‌పాట్ ప్రశ్నను ముందుంచారు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రియాజ్ పూనావాలా, షౌకత్ దుకాణ్‌వాలా ఏ దేశానికి ప్రాతినిథ్యం వహించారు అనే ప్రశ్నను ముందుకు వచ్చింది. ఏ) కెన్యా బీ) యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సీ) కెనడా డీ) ఇరాన్ పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు.

జాక్‌పాట్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక

జాక్‌పాట్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక

అయితే 7 కోట్ల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో అనుపా దాస్ కేబీసీ 12వ సీజన్ తాజా ఎపిసోడ్ నుంచి క్విట్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి నిష్క్రమించమని అడిగితే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని అనూప సమాధానం చెప్పారు. అది కరెక్ట్ సమాధానం అని చెప్పడంతో ఆమె సంతోషంలో మునిగిపోయారు. అయితే తనకు సమాధానం తెలియకపోవడం వల్ల రిస్క్ చేయలేదని చెప్పారు. అయితే ఆ సమాధానం చెప్పే విషయంలో కొంత డౌట్ ఉండటంతో క్విట్ అయ్యాను అని అమితాబ్‌తో తన అనుభవాన్ని షేర్ చేసుకొన్నారు.

Recommended Video

Amitabh Bachchan Will Play The Lead In Gatham Remake
ఇటీవల కాలంలో మూడో వ్యక్తిగా

ఇటీవల కాలంలో మూడో వ్యక్తిగా


కేబీసీ 12 సీజన్‌లో ఇలా 7 కోటల్ రూపాయలు ప్రశ్నకు సమాధానం చెప్పడంలో విఫలమైన వారిలో అనుపా మూడో వ్యక్తి. ఇంతకు ముందు మోహితా, నాజియా నజీమ్ కేబీసీలో చివరి ప్రశ్నకు వరకు గేమ్‌ను ఆడారు. చివరి ప్రశ్నకు సమాధానం చెప్పలేక క్విట్ అయి కోటి రూపాయల బహుమతితో గేమ్ షోను వైదొలిగారు. తాజాగా వీరి సరసన అనూపా దాస్ కూడా చేరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X