twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోట్లు గెలుచుకునే అవకాశం: నేటి నుండే అమితాబ్ ‘కెబిసి 10’

    By Bojja Kumar
    |

    అమితాబ్ బచ్చన్ హెస్ట్‌ చేస్తున్న పాపులర్ హిందీ క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఇండియన్ టెలివిజన్ చరిత్రలో ఓ సంచలనం. ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తాజగా 10వ సీజన్లోకి అడుగు పెట్టింది.

    నేటి(సెప్టెంబర్ 3, 2018) నుండి ఈ షో రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్టెన్మెంట్ టెలివిజన్లో ప్రసారం కాబోతోంది. మీరు ఆ సమయానికి ఇంట్లో టీవీ ముందు గడపలేని పరిస్థితి ఉంటే.... మొబైల్ లేదా డెస్క్‌లో కూడా చూసే ఏర్పాటు చేశారు. మొబైల్‌లో అయితే సోనీ లైవ్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

    కోటీశ్వరులు కావాలని కలలు కనేవారు తమ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ఒక చక్కని మార్గంగా ఈ టీవీషోను పేర్కొంటున్నారు. ఈ సారి 'కెబిసి 10'... 'కబ్ తక్ రోకోగే' అనే ట్యాగ్ లైన్‌తో ప్రసారం కాబోతోంది. కెబిసి 10 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కబ్ తక్ రోకేగే అంటూ బిగ్ బి ఓ హిందీ పద్యం కూడా పడారు. ఇది ఈ పోటీలో పాల్గొని కోట్లు గెలవాలనుకునే వారిలో మరింత కసి పెంచే విధంగా ఉంది.

    Amitabh Bachchans Kaun Banega Crorepati 10 begins

    ఇప్పటి వరకు ప్రసారం అయిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' సీజన్లలో షారుక్ హోస్ట్ చేసిన ఒకటి మినహా.... మిగతా అన్ని సీజన్లను అమితాబ్ హోస్ట్ చేశారు. 2000 సంవత్సరంలో తొలి సీజన్ ప్రారంభం అవ్వగా సూపర్ హిట్ అయింది. ఈ షోకు అమితాబ్ తప్ప మరెవరూ సూటవ్వరు అనే స్థాయిలో బిగ్ బి ఈ షోను ఓ రేంజికి తీసుకెళ్లి హయ్యెస్ట్ రేటింగ్స్‌లో నిలబెట్టారు.

    సక్సెస్‌ఫుల్ బ్రిటిష్ క్విజ్ షో 'హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్' కార్యక్రమాన్ని ఇండియాలో 'కౌన్ బనేగా కరోడ్ పతి' పేరుతో డిజైన్ చేశారు. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ హోస్ట్ చేయడంతో ఈ షో మరో లెవల్‌కు వెళ్లింది.

    English summary
    Amitabh Bachchan's Kaun Banega Crorepati 10 begins on Monday, September 3, 2018. Hosted by Bollywood legend Big B, KBC 10 premieres tonight at 9 pm IST on Sony Entertainment Television.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X