Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కోట్లు గెలుచుకునే అవకాశం: నేటి నుండే అమితాబ్ ‘కెబిసి 10’
అమితాబ్ బచ్చన్ హెస్ట్ చేస్తున్న పాపులర్ హిందీ క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఇండియన్ టెలివిజన్ చరిత్రలో ఓ సంచలనం. ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తాజగా 10వ సీజన్లోకి అడుగు పెట్టింది.
నేటి(సెప్టెంబర్ 3, 2018) నుండి ఈ షో రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్టెన్మెంట్ టెలివిజన్‌లో ప్రసారం కాబోతోంది. మీరు ఆ సమయానికి ఇంట్లో టీవీ ముందు గడపలేని పరిస్థితి ఉంటే.... మొబైల్ లేదా డెస్క్‌లో కూడా చూసే ఏర్పాటు చేశారు. మొబైల్లో అయితే సోనీ లైవ్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది.
కోటీశ్వరులు కావాలని కలలు కనేవారు తమ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ఒక చక్కని మార్గంగా ఈ టీవీషోను పేర్కొంటున్నారు. ఈ సారి 'కెబిసి 10'... 'కబ్ తక్ రోకోగే' అనే ట్యాగ్ లైన్‌తో ప్రసారం కాబోతోంది. కెబిసి 10 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కబ్ తక్ రోకేగే అంటూ బిగ్ బి ఓ హిందీ పద్యం కూడా పడారు. ఇది ఈ పోటీలో పాల్గొని కోట్లు గెలవాలనుకునే వారిలో మరింత కసి పెంచే విధంగా ఉంది.
ఇప్పటి వరకు ప్రసారం అయిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' సీజన్లలో షారుక్ హోస్ట్ చేసిన ఒకటి మినహా.... మిగతా అన్ని సీజన్లను అమితాబ్ హోస్ట్ చేశారు. 2000 సంవత్సరంలో తొలి సీజన్ ప్రారంభం అవ్వగా సూపర్ హిట్ అయింది. ఈ షోకు అమితాబ్ తప్ప మరెవరూ సూటవ్వరు అనే స్థాయిలో బిగ్ బి ఈ షోను ఓ రేంజికి తీసుకెళ్లి హయ్యెస్ట్ రేటింగ్స్‌లో నిలబెట్టారు.
సక్సెస్ఫుల్ బ్రిటిష్ క్విజ్ షో 'హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్' కార్యక్రమాన్ని ఇండియాలో 'కౌన్ బనేగా కరోడ్ పతి' పేరుతో డిజైన్ చేశారు. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ హోస్ట్ చేయడంతో ఈ షో మరో లెవల్‌కు వెళ్లింది.