Amitabh Bachchan's KBC 12 ఎంపిక ప్రక్రియ ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
ఆలిండియా సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కౌన్ బనేగా కరోడ్‌పతి సందడి బుల్లితెరపై మళ్లీ మొదలైంది. కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కలిగిన ఈ షోలో పాల్గొనే ఔత్సాహికులు కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ నమోదు ప్రక్రియ మే 9వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభమై మే 22 తేదీ వరకు కొనసాగుతుంది అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ..

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
కేబీసీ 12లో పాల్గొనేందుకు ఔత్సాహికులు ముందుగా సోనిలైవ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కేబీసీ లింక్‌పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ సందర్భంగా అడిగే ప్రశ్నలకు సమాధానం టైప్ చేయాలి. ఆ తర్వాత వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్ క్లిక్ చేయడంతో నమోదు ప్రక్రియ పూర్తి అవుతుంది.

అమితాబ్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు
మే 9వ తేదీ రాత్రి 9 గంటలకు సోని టెలివిజన్‌లో అమితాబ్ బచ్చన్ అడిగే ప్రశ్నలకు SMS ద్వారా సమాధానం పంపాలి. ప్రతీ మెసేజ్‌కు మూడు రూపాయలు వసూలు చేస్తారు. గడువులోగా సరైన సమాధానం పంపిన వారి పేరు పోటికి సంబంధించిన జాబితాలో నమోదు అవుతుంది. బీఎస్ఎన్ఎల్, ఐడియా, జియో, ఒడాఫోన్ ఖాతాదారులు తమ సమాధానాలను 509093కు పంపాల్సి ఉంటుంది. అడిగిన ప్రశ్నకు సమాధానం ఒకవేళ B అయి.. పాల్గొనే వ్యక్తి పురుషుడు, వయసు 23 అయితే.. అయితే SMS ను KBC A 23 F టైప్ చేసి 509093 పంపాలి.

22వ తేదీ వరకు రోజు అమితాబ్ ప్రశ్నలు
అలా 22వ తేదీ వరకు ప్రతీ రోజు అమితాబ్ బచ్చన్ అడిగే ప్రశ్నలకు సమాధాణాలు పంచించాలి. అలా సరైన సమాధానాలు పంపడం ద్వారా కేబీసీ సీజన్ 12కు అర్హత సాధిస్తారు. అర్హత సాధించిన వ్యక్తులను టెలిఫోన్ ద్వారా సంప్రదిస్తారు. ఆ తర్వాత జరిగే ప్రక్రియ ద్వారా ఫైనల్ జాబితాను రూపొందిస్తారు అని నిర్వాహకులు వెల్లడించారు. సోనీ లైవ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు.

తొలిసారి వీడియో ఇంటర్వ్యూలు
కేబీసీ చరిత్రలో తొలిసారి అర్హత సాధించిన జనరల్ నాలెడ్డ్ పరీక్ష ద్వారా ఆడిషన్స్ నిర్వహిస్తారు. సోనీలైవ్ ద్వారా యాప్ ద్వారా వీడియో ప్రక్రియ ద్వారా ఎంపిక కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఆన్ లైన్ ఆడిషన్స్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు వీడియో కాల్స్ ద్వారా నిర్వహించి పోటీలో పాల్గోనే వ్యక్తుల తుది జాబితాను రూపొందిస్తారని తెలిపారు.


Click it and Unblock the Notifications











