KBC 13: దృష్టిలోపం మహిళ ముందు రూ. 7 కోట్ల ప్రశ్న.. బిగ్‌బీకి హిమానీ షాక్.. ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలరా?
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఆగ్రాకు చెందిన హిమాని బుందేలా అద్భుతమైన ప్రతిభను చాటారు. అయితే హిమానీ దృష్టిలోపంతో బాధపడుతున్న మహిళ కావడం గమనార్హం. ఎవరూ ఊహించని విధంగా ప్రశ్నలకు సమాధానం చెబుతూ అమితాబ్ లాంటి దిగ్గజాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. కళ్లు కనిపించకపోయినా కంప్యూటర్ స్క్రీన్ ముందు కేవలం వినికిడి శక్తితో గేమ్‌ను ఆద్యంత ఆసక్తికరంగా మార్చారు. ఏకంగా రూ.7 కోట్ల ప్రశ్నను తన ముందుకు వచ్చేలా తన ప్రతిభను చాటుకొన్నారు. అయితే ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారా? అంటే.. .

ఆగస్టు 23న ప్రారంభమైన కేబీసీ 13
అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కేబీసీ 13వ సీజన్ ఆగస్టు 23వ తేదీన ప్రారంభమైంది. మరోసారి బిగ్‌బీ తనదైన శైలిలో ఈ షోను నిర్వహిస్తూ.. ప్రేక్షకులకు వినోదంతోపాటు నాలెడ్జిని అందిస్తున్నారు. ఈ షోలో ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా అసాధారణమైన ప్రతిభను చాటుకొన్నారు. ఎలాంటి తడబాటు లేకుండా.. ప్రశ్నలను వాటికి సంబంధించిన నాలుగు ప్రశ్నలను వినడం ద్వారానే గ్రహించి సమాధానాలు చెప్పారు.

50 లక్షలు గెలుచుకొని రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా
సోమవారం అంటే ఆగస్టు 30వ తేదీన కేబీసీ హాట్ సీట్‌పైకి హిమాని వచ్చారు. ప్రతీ ప్రశ్నకు అలవోకగా సమాధానం చెబుతూ బిగ్‌బీతో సహా షో చూస్తున్న ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొన్నారు. ప్రశ్నలను అద్బుతంగా విశ్లేషిస్తూ సమాధానం చెబుతూ.. రూ.50 లక్షల గెలుచుకొన్నారు. సోమవారం ఎపిసోడ్ సమయం ముగియడంతో మంగళవారం రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా మళ్లీ హాట్ సీట్‌పైకి వచ్చారు.

హిమానీ ముందు 1 రూపాయల ప్రశ్న
మంగళవారం హాట్ సీట్‌పైకి రాగానే హిమాని ముందు 1 కోటి రూపాయల ప్రశ్నను అమితాబ్ బచ్చన్ ముందు ఉంచారు. ఆ ప్రశ్న ఏమిటంటే..
కోటి రూపాయల ప్రశ్న: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్‌లో బ్రిటన్ తరఫున గూఢచారిగా వ్యవహరించిన నూర్ ఇనాయత్ ఖాన్ మారుపేరు ఏమిటి?
1. వేరా అట్కిన్స్
2. క్రిస్టీనా స్కార్‌బెక్
3. జూలియెన్ ఐస్టర్
4. జీన్ మారీ రెనీయర్
పై ప్రశ్నకు హిమాని సమాధానం చెప్పడంతో ప్రస్తుత సీజన్‌లో 1 కోటి రూపాయలు గెలుచుకొన్న మొదటి కంటెస్టెంట్ అని బిగ్‌బీ ప్రకటించారు. అంతేకాకుండా హిమానికి హ్యుందయ్ ఆరా కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు.
కరెక్ట్ సమాధానం: జీన్ మారీ రెనీయర్
Recommended Video

రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం ఏమిటంటే?
హిమాని కోటి రూపాయల ప్రశ్నను విజయవంతంగా పూర్తి చేయడంతో ఆమె ముందు 7 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రశ్నను అమితాబ్ ఉంచారు.
7 కోట్ల రూపాయల ప్రశ్న: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో 1923 సంవత్సరంలో బీఆర్ అంబేద్కర్ తన పీహెచ్‌డీ పరిశోధనలలో భాగంగా సమర్పించి డాక్టరేట్ పొందిన థీసిస్ టైటిల్ ఏమిటి?
1. ది వాంట్ అండ్ మీన్స్ ఆఫ్ ఇండియా
2. ది ప్రాబ్లెం ఆఫ్ ది రూపీ
3. నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా
4. ది లా అండ్ లాయర్స్
అయితే పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తాను గేమ్ నుంచి క్విట్ అవుతానని చెప్పింది. దాంతో ఆమె కోటి రూపాయలు గెలుచుకొన్నట్టు ప్రకటించారు. అయితే గేమ్ నుంచి వైదొలిగేటప్పుడు ప్రేక్షకులకు కరెక్ట్ సమాధానం తెలియజేయడానికి ఏదైనా మీకు సరైనదిగా అనిపించిన జవాబు చెప్పండి అని అమితాబ్ చెప్పగా.. హిమానీ నేషనల్ డివిడెంట్ ఆఫ్ ఇండియా జవాబు చెప్పింది. అది తప్పు అని చెప్పి.. కరెక్ట్ సమాధానం.. ది ప్రాబ్లెం ఆఫ్ ది రూపీ అని అమితాబ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











