బిగ్ బాస్2: అమిత్, కౌశల్ అవుటేనా.. డబుల్ ఎలిమినేషన్‌పై ఉత్కంఠ!
Recommended Video

బిగ్ బాస్ హౌస్‌లో ఉత్కంఠ పెరుగుతోంది. గత వారం ఏమైనా జరగొచ్చు, ఇకపై మీరు ఊహించని పరిణామాలు హౌస్ లో చోటు చేసుకోబోతున్నాయి వంటి కామెంట్స్ తో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని హీట్ పెంచాడు. అందుకు తగ్గట్లుగానే గత వారం డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇచ్చాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు ఆడియన్స్ భావిస్తున్నప్పటికీ.. షో తుది దశకు చేరుకున్న నేపథ్యంలో అనూహ్య పరిణామాలు జరిగే ఆస్కారం ఉందని అంటున్నారు.

నామినేషన్
ఈ వారం కౌశల్, అమిత్, శ్యామల, దీప్తి నామినేషన్ జాబితాలో ఉన్నారు. వీరిలో హౌస్ ఎలిమినేట్ అయ్యేది ఎవరనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరికి దెబ్బ పడనుందో అని ఆడియన్స్ చర్చించుకుంటున్నారు.

ఆడియన్స్ మద్దత్తు
ఆడియన్స్ మద్దత్తు ఉంది కాబట్టి కౌశల్ కు ఇటివంటి ప్రమాదం ఉండదు. కానీ కౌశల్ సీజన్ మొత్తానికి నామినేట్ అయి ఉన్నాడు. ఇదే కాస్త కలవరపెట్టే అంశం. ఇక అమిత్, శ్యామల, దీప్తి ముగ్గురూ డేంజర్ జోన్ లో ఉన్నా వారే.

దీప్తి కాస్త
అమిత్, శ్యామల, దీప్తి ముగ్గురిలో దీప్తి పరిస్థితి కాస్త బెటర్ గా ఉందని చెప్పొచ్చు. ప్రతి టాస్క్ లో ఆమె ప్రాణం పెట్టి పోరాడుతుంది. ఈ విషయంలో నాని గతంలో ఆమెని అభినందించాడు కూడా.

అమిత్ అవుటేనా
ఇక ఈవారం అమిత్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమిత్ పెర్ఫామెన్స్ గురించి నాని తరచుగానే హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఇక డబుల్ ఎలిమినేషన్ అయితే శ్యామలపై కూడా వేటు తప్పదు అని ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











