అర్ధరాత్రి భారీ వర్షం.. ఆస్పత్రి బయట అమ్మ స్ట్రెచర్‌పై.. టాప్ హీరో ఫోన్‌చేసి..అమ్మా రాజశేఖర్ ఎమోషనల్
బిగ్‌బాస్ హౌస్‌లో 39వ రోజు ఇంటి సభ్యులందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంటి సభ్యులక బిగ్‌బాస్ తమ బాల్యానికి సంబంధించిన రోజులను గుర్తు చేశారు. దాంతో ఒక్కసారిగా వారు తమ జీవితంలోని సుఖం, దు:ఖాన్ని పంచుకొన్నారు. ఈ క్రమంలో అమ్మా రాజశేఖర్ తన తల్లి ప్రేమను, తల్లి అనారోగ్యం గురించి, ఆస్తుల కోసం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను ప్రస్తావించారు. అమ్మా రాజశేఖర్ తన జీవితంలో ఎదురైన విషయాల గురించి మాట్లాడుతూ..

సంపాదించిందంతా అమ్మ చేతిలోనే
తమిళ సినిమా పరిశ్రమలో నాన్న, అన్నయ్య ఫైట్ మాస్టర్స్, నేను డ్యాన్స్ మాస్టర్‌గా ఇండస్ట్రికి వచ్చాను. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. డ్యాన్సులు చేస్తే వచ్చే డబ్బు, డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తే వచ్చే సంపాదన అంతా నేను అమ్మకే ఇస్తాను. కారు కొనుగోలు చేసినా దానిపై అమ్మ అని రాయించుకొంటాను. ఏదైనా అమ్మ పేరుతోనే ఉంటాయి అని అమ్మా రాజశేఖర్ చెప్పారు.

ఓ చిన్న ట్విస్టుతో జీవితం అలా
అయితే దేవుడు నాకు నాన్న, అన్నయ్య, తల్లి ప్రేమలను ప్రేమలతో పాటు అన్నీ ఇచ్చారు. కానీ చిన్న ఫ్యామిలీలో, నా జీవితంలో చిన్న ట్విస్టు అంతా మార్చేసింది. ఆస్తుల విషయంలో ఫ్యామిలీలో చోటుచేసుకొన్న వివాదం మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అప్పటి నుంచి మా కుటుంబంలో కలతలు చోటుచేసుకొన్నాయి అని అమ్మా రాజశేఖర్ వెల్లడించారు.

ఆస్థుల పంపకం విషయంలో గొడవ
మా కుటుంబానికి చెందిన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనే ప్రశ్న వచ్చినప్పుడు రాజా (నాకు)కు ఇస్తాననని చెప్పడంతో గొడవలు జరిగిపోయాయి. నాకు ఎందుకు ఇస్తానని ఎందుకు చెప్పావమ్మా అని అడిగితే.. నా నోరు మూయించింది. ఆ తర్వాత మా కుటుంబంలో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. అందుకే నా ఫ్యామిలీ ఫోటో చూపించుకోలేని పరిస్థితి అని అమ్మా రాజశేఖర్ భావోద్వేగానికి గురయ్యారు.

అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంటే..
ఆ తర్వాత ఆస్తులు అందరం పంచుకొని ఎవరికి వారు వేరైపోయాం. అమ్మను బంగారంలా చూసుకొన్నాను. నటగలు ఆ తర్వాత అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అమ్మను నేనే జాగ్రత్తగా చూసుకొన్నాను. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఓ పెద్ద హీరోకు కాల్ చేస్తే.. ఎంత డబ్బు అయినా పర్వాలేదు. నేను పంపిస్తాను. జాగ్రత్తగా చూసుకో అని భరోసా ఇచ్చాడు అని అమ్మా రాజశేఖర్ చెప్పారు.

టాప్ హీరో ఫోన్ చేసి ఎంతైనా ఫర్వాలేదంటూ..
అమ్మకు చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స జరుగుతుండగానే.. ఆరోగ్యం మరింత క్షీణించింది. అమ్మ బతకడం చాలా కష్టమని వైద్యులు చెప్పారు.ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోండి అని అన్నారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో స్ట్రెచర్ తీసుకొచ్చి బయట పెట్టారు. ఆ సమయంలో భోరున వర్షం అమ్మ స్ట్రెచర్‌పై వర్షం పడుతుంటే.. ఒంగి ఏదో అడ్డం పెట్టి వర్షం పడకుండా చూశాను. ఆ తర్వాత చిన్న హాస్పిటల్‌లో చేర్పించాం. ఆ తర్వాత అమ్మ ఈ లోకం నుంచి వెళ్లిపోయిందని కంటతడి పెట్టారు.
Recommended Video

జీవితంలో డబ్బు గురించి ఆలోచించొద్దు
నా తల్లి పడినే బాధ జీవితంలో మరిచి పోలేనిది. అమ్మ గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. జీవితంలో డబ్బు గురించి ఆలోచించకూడదు. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ మనషులతో రిలేషన్ చాలా ముఖ్యం. అదే విషయాన్ని ఎప్పుడూ చెబుతుంటాను అని చెబుతూ అమ్మా రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











