ఆ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసేందుకు భారీ ప్లాన్: వెళ్లిపోయే ముందు కావాలనే అలా చేశారా.!

By Manoj Kumar P

గతంతో పోలిస్తే సరికొత్త టాస్కులు.. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్.. మరికొంచెం మసాల సీన్లతో రంజుగా సాగుతోంది బిగ్ బాస్ సీజన్ 4. తెలుగులో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. అంతకు ముందు మరే కార్యక్రమానికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. నాలుగో సీజన్‌ను గ్రాండ్‌గా మొదలెట్టి ఇండియాలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. ఇక, ఈ సీజన్ విషయంలో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ యూనిట్ భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఆ సంగతుంటేంటో చూద్దాం పదండి.!

గ్రాండ్ ఓపెనింగ్.. మధ్యలో మలుపులు

గ్రాండ్ ఓపెనింగ్.. మధ్యలో మలుపులు

బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ప్రీమియర్ ఎపిసోడ్‌తో ఇండియన్ టెలివిజన్ రికార్డులు బద్దలైపోయాయి. దీనికి తోడు సరికొత్త టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, లవ్ ట్రాకులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, మసాలా సన్నివేశాలు ఇలా ఎన్నో మరెన్నో వాటి వల్ల ఈ సీజన్‌ హాట్ టాపిక్ అవుతోంది. ఫలితంగా ప్రేక్షకుల నుంచి స్పందనను కూడా అందుకుంటోంది.

వాటి వల్ల బిగ్ బాస్‌పై విమర్శల వర్షం

వాటి వల్ల బిగ్ బాస్‌పై విమర్శల వర్షం

గత సీజన్లతో పోలిస్తే ఇందులో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని బిగ్ బాస్ షో నిర్వహకులు ముందు నుంచీ చెబుతూ వచ్చారు. అందుకు అనుగుణంగానే హౌస్‌లో జరిగిన ఎన్నో అంశాలను పక్కన పెట్టేసి, కేవలం లవ్ ట్రాకులు, మసాలా సన్నివేశాలనే హైలైట్ చేశారు. వీటి వల్ల బిగ్ బాస్‌పై విమర్శల వర్షం కురిసింది. అదే సమయంలో ఈ రియాలిటీ షో హైలైట్ కూడా అయింది.

వాళ్లిద్దరూ బాగా తప్పించుకున్నారుగా

వాళ్లిద్దరూ బాగా తప్పించుకున్నారుగా

ఈ సీజన్‌లో పలువురు కంటెస్టెంట్లు ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు. మరికొందరు డేంజర్‌ జోన్‌లో ఉన్నా కూడా తప్పించుకోగలిగారు. మొదటి జాబితాను పక్కన పెడితే.. రెండో దాంట్లో మాత్రం మోనాల్ గజ్జర్, అమ్మ రాజశేఖర్ ఉన్నారు. ఎక్కువ సార్లు నామినేట్ అయిన ఈ ఇద్దరూ... బిగ్ బాస్ షో నిర్వహకుల వల్లే హౌస్‌లో కొనసాగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

నామినేషన్.. ఎలిమినేషన్ అలాగేనా

నామినేషన్.. ఎలిమినేషన్ అలాగేనా

వాస్తవానికి బిగ్ బాస్ హౌస్‌లో ఎవరిని ఉంచాలి.. ఎవరిని బయటకు పంపించాలి అన్నది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. వాళ్లు వేసే ఓట్ల ఆధారంగానే ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతోంది. అయితే, ఈ సీజన్‌లో అందుకు భిన్నంగా కనిపించింది. ప్రేక్షకుల మద్దతు ఉన్న దివి వద్యా, దేవీ నాగవల్లి, కుమార్ సాయి వంటి వాళ్లు ఎలిమినేట్ అవడం పట్ల ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఎలిమినేట్ చేసేందుకు బిగ్ బాస్ ప్లాన్

ఎలిమినేట్ చేసేందుకు బిగ్ బాస్ ప్లాన్

ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్లు ఏమోగానీ... ఈ వారం హౌస్‌ నుంచి బయటకు పంపించే కంటెస్టెంట్ విషయంలో బిగ్ బాస్ నిర్వహకులు ఓ అంచనాతో ఉన్నారని తెలుస్తోంది. ఎప్పుడో ఎలిమినేట్ అవుతారనుకున్న అమ్మ రాజశేఖరే ఈ వారం బయటకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా ఆయనే హైలైట్ చేయడంతో ఇది ఖాయమేనన్న టాక్ వినిపిస్తోంది.

ఎలిమినేషన్‌ ముందు కావాలనే అలా

ఎలిమినేషన్‌ ముందు కావాలనే అలా

గత వారం నోయల్ వెళ్లడంతో ఎలిమినేషన్ తప్పించుకున్నాడు అమ్మ రాజశేఖర్. ఈ వారం మాత్రం ఆయన వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది. ప్రైవేట్ వెబ్‌సైట్లు నిర్వహించే పోల్స్ అన్నింటిలోనూ ఆయనకే తక్కువ ఓట్లు పోలయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్లాన్ ప్రకారం అమ్మను కెప్టెన్సీ టాస్క్‌ పోటీదారును చేయడం.. అందులో ఆయనను గెలిపించడం జరిగాయని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X