బండోడు.. గుండోడు అంటూ కొట్టావు.. నొప్పితో బాధపడ్డాను.. నోయల్‌పై అమ్మా రాజశేఖర్ ఎటాక్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోను వీడుతూ కంటెస్టెంట్ నోయల్ సీన్ పెద్ద రచ్చ సృష్టించారు. హోస్ట్ నాగార్జున ఇంటిలోని సభ్యులతో మాట్లాడమని కోరగా.. అవినాష్, అమ్మా రాజశేఖర్‌ను ఒంటి క్లాస్‌పై నిలబెట్టి క్లాస్ పీకాడు. తాను కాలి నొప్పితో బాధపడుతుంటే మీరు నన్ను అవహేళన చేసే విధంగా ఇమిటేట్ చేస్తారా అని కారాలు మిరియాలు రువ్వారు. అయితే నోయల్ సీన్ ఆరోపణలకు అమ్మా రాజశేఖర్, అవినాష్ ధీటుగా సమాధానం ఇస్తూ..

ఇమిటేట్ చేయడం తప్పు అయితే కించపరిచినట్టే.. అవినాష్

ఇమిటేట్ చేయడం తప్పు అయితే కించపరిచినట్టే.. అవినాష్

ఎవరైనా మిమిక్రీ ఆర్టిస్టు కామెడి చేయడం, ఇమిటేట్ చేయడం తప్పు అయితే వారిని కళను కించపరిచినట్టే.. మేము కామెడీ చేసినప్పుడు నవ్వి, బాగుందని చెప్పి ఇప్పుడు బయటకు వెళ్లేటప్పుడు మాపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదు. నీవు హర్ట్ అయితే తలవంచి క్షమాపణ చెబుతాను అంటూ అవినాష్ నేలకు తల పెట్టి సారీ చెప్పాడు.

 నా తప్పు ఉంటే కాళ్లు పట్టుకొంటానని.. అమ్మా రాజశేఖర్

నా తప్పు ఉంటే కాళ్లు పట్టుకొంటానని.. అమ్మా రాజశేఖర్

ఇక అమ్మా రాజశేఖర్ స్పందిస్తూ.. నేను ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా కామెడీ చేయను. ఒకవేళ అలా నోయల్ ఫీల్ అవుతే నేను కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పడానికైనా సిద్ధం అంటూ కామెంట్ చేయగా.. నాగార్జున మధ్యలో వచ్చి అతడు అలా ఫీల్ అవుతున్నాడు మాత్రమే అని అన్నారు.

 ఒంటికాలిపై నిలబడటం లెక్క కాదు

ఒంటికాలిపై నిలబడటం లెక్క కాదు

ఒంటి కాలిపై నిలబడటం ఆపండి అంటూ నాగార్జున కోరగా.. బాబు గారు.. కాళ్లు, చేతులు, వెన్నపూస, బాడీ మొత్తం దెబ్బలు తిని ఉన్నాను. ఇలా కాలు పైన పెట్టుకోవడం నాకు ఇబ్బంది కాదు. కానీ నోయల్ మాట్లాడిన తీరు నాకు చాలా ఇబ్బంది కలిగే విధం బాధగా ఉంది అంటూ నోయల్ సీన్ ఆవేదన వ్యక్తం చేశారు.

నా తలపై కొట్టి బాధపెట్టాడు..

నా తలపై కొట్టి బాధపెట్టాడు..

ఇంట్లో ఉన్న సమయంలో పెద్ద వాడు అనే విషయం మరిచి నా తలపై కొడుతూ.. బండోడా.. గుండోడా అని అన్నావు. చిన్నవాడి అని నేను ఓపిక పట్టాను. నువ్వు కొట్టిన ప్రతీసారి నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అయినా ఓపిక పట్టాను. కానీ నీవు ఇలా మాపై నిందలు వేయడం సరికాదు అని అమ్మా రాజశేఖర్ అంటే.. అవును నేను కొట్టాను అంటూ నోయల్ సీన్ ఒప్పుకొన్నాడు.

నాగార్జున జోక్యంతో సద్దుమణిగిన గొడవ

నాగార్జున జోక్యంతో సద్దుమణిగిన గొడవ

అయితే అమ్మా రాజశేఖర్‌ను కొట్టిన మాట నిజమే అని నోయల్ అనగా.. అయితే నీవు కొడితే ఒప్పు.. మేము చేస్తే తప్పా? అంటూ అవినాష్ ఘాటుగా స్పందించారు. ఇలా అవినాష్, అమ్మా రాజశేఖర్, నోయల్ మధ్య గొడవ జరుగుతుంటే.. నాగార్జున జోక్యం చేసుకొని ఆపించారు. దాంతో వారి మధ్య అంతటితో ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X