దివి విషయంలో నోరు జారిన రాజశేఖర్: అమ్మాయిని అంత మాట అనడంపై విమర్శలు.!

By Manoj Kumar P

తెలుగులోనే ప్రత్యేకమైన షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా వచ్చిన దీనికి ఇక్కడి ప్రేక్షకులు ఊహించని స్థాయిలో స్పందనను అందించారు. ఈ కారణంగానే రియాలిటీ షో ఏకంగా మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల నాలుగో సీజన్‌ను సైతం ప్రారంభించారు షో నిర్వహకులు.

మొదట్లో పెద్దగా స్పందన దక్కించుకోలేకపోయిన ఈ సీజన్‌.. ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో హౌస్‌లోని బ్యూటీ దివిపై అమ్మా రాజశేఖర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. అంతేకాదు, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

రికార్డులతో మొదలైన బిగ్ బాస్ 4

రికార్డులతో మొదలైన బిగ్ బాస్ 4

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు ఎవరూ ఊహించని రీతిలో స్పందన వచ్చింది. కరోనా వల్ల సినిమాలు లేకపోవడమో.. లేక మరో కారణమో తెలియదు కానీ.. ప్రారంభ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో 18 ప్లస్ రేటింగ్ సాధించింది. ఫలితంగా ఇండియాలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా నిలిచింది. ఓటింగ్‌లోనూ రికార్డులు నెలకొల్పుతూ దూసుకుపోతోందీ రియాలిటీ షో.

ట్రాకులతో హైలైట్.. పెరిగిన రేటింగ్స్

ట్రాకులతో హైలైట్.. పెరిగిన రేటింగ్స్

ప్రారంభ ఎపిసోడ్ మినహా బిగ్ బాస్ సీజన్ 4 చాలా చప్పగా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో షో నిర్వహకులు లవ్ ట్రాకులపై ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ - అభిజీత్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని హైలైట్ చేసి చూపించారు. వీళ్లతో పాటు అవినాష్ - ఆరియానా ట్రాక్, అభిజీత్ - హారిక రిలేషన్‌నూ ఎక్కువగా చూపించి మంచి రేటింగ్ సంపాదించారు.

దివికి పెరిగిన క్రేజ్.. అమ్మ భిన్నంగా

దివికి పెరిగిన క్రేజ్.. అమ్మ భిన్నంగా

బిగ్ బాస్ సీజన్ - 4లో పెద్దగా పేరున్న కంటెస్టెంట్లు చాలా తక్కువ మందే ఉన్నారు. గతంలో ఫేమ్ తక్కువగా ఉన్నా.. షోలోకి వచ్చిన తర్వాత పాపులర్ అయిన వారిలో దివి ఒకరు. తన గ్లామర్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఇక, ఈ సీజన్‌లో బిగ్ సెలెబ్రిటీగా ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ మాత్రం విచిత్ర ప్రవర్తనతో భిన్నంగా కనిపిస్తున్నారు.

ఇద్దరి మధ్యా స్నేహం.. ట్రాక్ మరోలా

ఇద్దరి మధ్యా స్నేహం.. ట్రాక్ మరోలా

హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే దివి ఎక్కువగా అమ్మ రాజశేఖర్‌తోనే స్నేహం చేస్తోంది. అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ ఆయన వెనకే తిరుగుతోంది. ఆయన కూడా దివికి సహాయం చేస్తూ కనిపిస్తున్నాడు. దీంతో ఈ ఇద్దరూ కలిసే దర్శనమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దివి - అమ్మ రాజశేఖర్ మధ్య నడుస్తున్న ట్రాకుపై ప్రేక్షకులు తమదైన శైలిలో జోకులు పేల్చుతున్నారు.

దివిపై నోరు జారిన అమ్మ రాజశేఖర్

దివిపై నోరు జారిన అమ్మ రాజశేఖర్

బిగ్ బాస్ షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులకు కంటెస్టెంట్లపై తమదైన రీతిలో అభిప్రాయాలు స్థిరపరుచుకుంటున్నారు. దీంతో చెడ్డవాళ్లు అనుకున్న కొందరు మంచి వాళ్లుగా.. ఇలా అనుకున్న వాళ్లు అలా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ రాజశేఖర్‌.. సహా కంటెస్టెంట్ దివిపై నోరు జారి చేసిన ఓ కామెంట్ చర్చనీయాంశం అవుతోంది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
అంత మాట అనడంపై విమర్శలు.!

అంత మాట అనడంపై విమర్శలు.!

రెండు రోజుల క్రితం జరిగిన ఎపిసోడ్‌లో అమ్మ రాజశేఖర్.. దివిని ఉద్దేశిస్తూ గర్ల్‌ఫ్రెండ్ అని కామెంట్ చేశాడు. సోహెల్‌తో మాట్లాడుతూ ఆ తరహా వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయనపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వయసును ప్రస్తావిస్తూ కామెంట్లు చేస్తున్నారు. దివి ఇప్పటికైనా ఆయనకు దూరమవ్వాలని కోరుతున్నారు ఆమె అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X