అమ్మా రాజశేఖర్, దివి మధ్య అలాంటి రూమర్స్.. మాస్టర్ సతీమణి ఫైర్

బిగ్ బాస్ హౌజ్ లో నెక్స్ట్ టార్గెట్ అమ్మా రాజశేఖర్ అని ఒక రూమర్ అయితే గట్టిగా వస్తోంది. మెహబూబ్, అఖిల్ వంటి వారు లిస్ట్ లో ఉన్నప్పటికీ చివరికి హౌజ్ మెంట్స్ అంతా కలిసి అమ్మా వైపే గురుపెట్టినట్లు ఇప్పటికే ఒక వాదన బలంగా వినిపిస్తోంది. ఇక దివి ఎలిమినేషన్ లో అమ్మా రాజశేఖర్ పాత్ర కూడా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని కొన్ని రూమర్స్ రాగా వాటిపై తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు అమ్మా రాజశేఖర్ సతీమణి రాధా.

దివి, అమ్మా ఎమోషనల్ మూమెంట్స్

దివి, అమ్మా ఎమోషనల్ మూమెంట్స్

అమ్మా రాజశేఖర్, దివి మొదటి నుంచి కూడా చాలా ఎమోషనల్ గా ట్రావెల్ చేశారు. అరియానా, మెహబూబ్ వంటి వారితో గొడవలు ముదిరినప్పుడు కూడా అమ్మా రాజశేఖర్ కి మద్దతు ఇచ్చిన వారిలో దివి ఒకరు. చాలా సార్లు దివి మాస్టర్ పై ఒక రకమైన ఎమోషన్ ని చూపించింది. వారిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా గట్టిగానే వచ్చాయి.

ఆ సీన్ కాస్త ఓవర్ గా అనిపించినప్పటికి

ఆ సీన్ కాస్త ఓవర్ గా అనిపించినప్పటికి

అమ్మా రాజశేఖర్ గుండు కొట్టించుకొని ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నప్పుడు మొదట కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ దివి. అమ్మా వద్దు అంటూ ఆయన ముందు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సీన్ కాస్త ఓవర్ గా అనిపించినప్పటికి అమ్మాకు ఒక అమ్మాయి అయినా చాలా జెన్యున్ గా క్లోజ్ అయ్యిందని అంతా భావించారు. కానీ దివికి అది ఎలాంటి ఫలితాన్నీ. ఇవ్వలేదు. పైగా ఎలిమినేషన్ కి గురి కావాల్సి వచ్చింది.

క్లారిటీ ఇచ్చిన అమ్మా రాజశేఖర్ భార్య

క్లారిటీ ఇచ్చిన అమ్మా రాజశేఖర్ భార్య

అయితే వారిద్దరి మధ్య ఎదో నడుస్తోందని వస్తున్న రూమర్స్ పై అమ్మా రాజశేఖర్ భార్య రాధ స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. వాళ్ళది ఒక జన్యున్ బండింగ్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే కూడా తప్పుబట్టారు. వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ పెరుగుతోందిని కూడా అన్నారు. నిజంగా అలాంటిదేమీ లేదని నాకు క్లియర్ గా అర్ధమయ్యింది. ఒక అబ్బాయి అమ్మాయి క్లోజ్ గా ఉంటే అలాంటి రూమర్స్ క్రియేట్ చెయ్యాలా?

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
కామెడీగా అనిపించింది

కామెడీగా అనిపించింది

షో మొదట్లో ఆయన కరాటే కళ్యాణితో కూడా క్లోజ్ గా డ్యాన్స్ చేశారు. అది సరదాగా చేశారు. కామెడీగా అనిపించింది. వాళ్లిద్దరి మధ్య కూడా ఏదో ఉందని ఎందుకు అన్నారో నాకైతే అర్థం కాలేదు. దివి విషయంలో కూడా అదే జరిగింది. వాళ్లేమి సీక్రెట్ గా మాట్లాడుకోలేదు. అమ్మా రాజశేఖర్ అమ్మాయిలతో ఎంతవరకు ఉండాలో అంత వరకే ఉంటారు. సెన్సిటివ్ గా ఉండేవాళ్లకు అమ్మాయిలు పడతారు అంటే ఇప్పటికి ఆలిస్ట్ చాలా పెద్దగా ఉండేదని.. అమ్మా రాజశేఖర్ సతీమణి రాధ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X