twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దివి నన్ను అలా కాపాడింది.. అభిజిత్ వేస్ట్.. అఖిల్, నోయల్ ఫేక్.. అమ్మా రాజశేఖర్ ఫైర్

    |

    బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 నుంచి అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో మనసు విప్పి మాట్లాడారు. ఇంటిలో జరిగిన విషయాలను, ఇంటి సభ్యుల గురించి, వారి వ్యవహారాలను పూసగుచ్చినట్టు చెప్పారు. అయితే తాజాగా రాహుల్ సిప్లిగంజ్‌‌తో అమ్మా రాజశేఖర్ చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి...

    అభిజిత్ వల్ల ఏం ప్రయోజనం

    అభిజిత్ వల్ల ఏం ప్రయోజనం

    అభిజిత్ గురించి మాట్లాడుతూ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు బిగ్‌బాస్‌కు సూటబుల్ కాదు. అతడి వల్ల టీఆర్పీ రాదు. షోకు ఏ విధంగా ప్లస్ కాడు. మళ్లీ ఇంటిలోకి వెళ్లాల్సి వస్తే.. అభిజిత్ బయటకు వస్తే నేను లోపలికి వెళ్తాను. అప్పుడు నా వల్ల ఎలాంటి టీఆర్పీ వస్తుందో చూసుకోండి. వాడి వల్ల ఏమీ కాదు అంటూ అమ్మా రాజశేఖర్ తెలిపారు.

     అఖిల్ సిల్లి ఫెలో

    అఖిల్ సిల్లి ఫెలో

    మరో ఇంటి సభ్యుడు అఖిల్ గురించి మాట్లాడుతూ.. నామినేట్ చేయడం అంటే అర్ధం ఉండాలి. కానీ ఆయన నామినేట్ చేసేటప్పుడు సిల్లీ కారణాలతో ఎదుటి వాళ్లను టార్గెట్ చేస్తాడు. నామినేషన్ అంటే ఇంటిలో ఉండటానికి అర్హత లేని వ్యక్తి అని అర్ధం. దానికి పూర్తిగా మీనింగ్ మార్చేసిన వ్యక్తి అఖిల్ అని అమ్మా రాజశేఖర్ చెప్పాడు.

     అరియానా ఎప్పుడూ నెగిటివ్‌గానే

    అరియానా ఎప్పుడూ నెగిటివ్‌గానే

    అరియానా విషయానికి వస్తే.. పాజిటివ్ థికింగ్ ఉండదు. ఎప్పడూ నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. ఇక దివి వద్యా గురించి మాట్లాడుతూ... మంచి అమ్మాయి. పబ్లిక్ దృష్టిలో నేను చెడ్డవాడిని కాదు అనే ఫీలింగ్ కల్పించింది. ఇక హారిక గురించి మాట్లాడుతూ.. మంచి అమ్మాయి. కానీ ఇంగ్లీష్ మాట్లాడితే సెట్ అయ్యేది. కానీ మన లాంగ్వేజ్‌కు సెట్ కాదు. అలాగే లాస్య గురించి చెబుతూ ఫేస్‌లో క్లారిటీ ఉంటుంది. కానీ మనసులో అది ఉండదు అని మాస్టర్ పేర్కొన్నారు.

     నోయల్ సీన్ ఫేక్...

    నోయల్ సీన్ ఫేక్...

    నోయల్ సీన్ గురించి ఫేక్ వ్యక్తి. బయటకు కనిపించేది ఒకటి.. లోపల ఉండేది మరొకటి. తనను టార్గెట్ చేయడం చాలా తప్పు. అవినాష్‌ను కామెడీ గురించి కామెంట్ చేయడం బాధ కలిగించింది. వాడికి కామెడీ మాత్రమే జీవితం. అలాంటి వాడిని తప్పు పట్టుకూడదు అని అన్నారు. అయితే అవినాష్ రేజ్ అయినప్పుడు మీరు పెద్దగా అతడిని ఎందుకు ఆపలేదు. చిల్లర కామెడీ అన్నది మిమ్మల్ని. అవినాష్‌ను కాదు అంటూ అమ్మా రాజశేఖర్‌కు రాహుల్ పంచ్ ఇచ్చారు.

    English summary
    Versatile Actor Kamal Haasan appeared in Bigg Boss Telugu 4. Telugu Bigg Boss Host Nagarjuna met Tamil Bigg Boss Host Kamal Haasan via video conferenance. Both are with them self and contestants too. As per reports, Amma Rajashekhar eliminated from the house. Amma spoke to Rahul Simpligunj after his elimination from the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X