ఇక చంపేస్తా.. చూసుకోండి.. అమ్మా రాజశేఖర్ సవాల్.. అఖిల్ చెప్పాడా అంటూ మోనాల్‌కు షాక్

బిగ్‌బాస్‌ తెలుగులో 8వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత అమ్మా రాజశేఖర్ చాలా మనో వేదనకు గురయ్యాడు. ప్రక్రియ పూర్తయిన తర్వాత అమ్మా రాజశేఖర్‌ను అవినాష్, అరియానా ఓదార్చారు. ఎందుకంటే ఇంటిలో ఉండే అర్హత లేదని అమ్మాను వ్యతిరేకిస్తూ ఇంటి సభ్యులందరూ ఓటేస్తే.. కేవలం అరియానా, అవినాష్ మాత్రమే అనుకూలంగా ఓటేశారు. దాంతో వారి మధ్య చర్చ జరిగింది.

ఎలాంటి ట్విస్టు ఇస్తానో చూడండి

ఎలాంటి ట్విస్టు ఇస్తానో చూడండి

నాకు అర్హత లేదంటారా.. ఇక గేమ్‌లో ప్రేక్షకులకు ఎలా ట్విస్టు ఇస్తానో చూడండి. ఇంకా ఎలా ఉండాలో చెప్పండిరా.. నేను ఏం చేయాలో చెప్పండిరా అంటూ అమ్మా రాజశేఖర్ ఆవేదన చెందారు. మోనాల్ కూడా నాకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా? అని అన్నాడు. అందుకు సమాధానంగా మాస్టర్ మీ ఎంటర్‌టైన‌్‌మెంట్ కొనసాగిస్తూ.. మీరు ఎలా ఉంటారో అలా ఉండండి.. మీకు కోపం వస్తే మీరు కోపంగా ఉండండి.. నవ్వు వస్తే నవ్వండి అంటూ అవినాష్ సలహా ఇచ్చారు. దాంతో ఇక చూడు చంపేస్తాను అంటూ అమ్మా రాజశేఖర్ కామెంట్ చేశాడు.

మోనాల్, సోహైల్ ఓటు వేస్తారనుకోలేదు

మోనాల్, సోహైల్ ఓటు వేస్తారనుకోలేదు

అభిజిత్, అఖిల్ నాకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని నాకు ముందే తెలుసు. కానీ మోనాల్, సోహైల్ వేస్తారని ఊహించలేదు. వారు చెప్పిన కారణాలు సరిగా లేవు అంటూ అమ్మా రాజశేఖర్ ఆవేదన చెందుతుంటే.. అంతలో సోహైల్ వచ్చి మాస్టర్‌ను ఓదార్చారు. మాస్టర్ మీరు చాలా లైఫ్ చూశారు. ఇంకా మీకు చాలా ఉంది అంటూ కామెంట్ చేశాడు. దాంతో అవును.. లైఫ్ చాలా ఉంది అని అమ్మా అన్నారు.

చర్చను ఆపేందుకు అరియానా ప్రయత్నం

చర్చను ఆపేందుకు అరియానా ప్రయత్నం

అయితే అమ్మా రాజశేఖర్, సోహైల్ మధ్య చర్చ జరుగుతుంటే.. అరియానా గ్లోరి దానిని ఆపేందుకు ప్రయత్నించింది. ఈ రోజు ఎమోషనల్‌గా ఉన్నారు. కావాలంటే రేపు డిస్కషన్ చేద్దాం. ఈ రోజు ఆయనను ఎంజాయ్ చేయనివ్వండి అంటూ అరియానా చెప్పింది. అయినా వారి మధ్య చర్చ ముందుకు సాగింది.

నన్ను ఇంటి నుంచి వెళ్లగొడతావా?

నన్ను ఇంటి నుంచి వెళ్లగొడతావా?

ఆ తర్వాత అమ్మా రాజశేఖర్.. మోనాల్ వద్దకు వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పింది. నన్ను ఇంటి నుంచి వెళ్లమని ఓటు వేస్తావా? ఒకవేళ నేను వెళ్తే నీవు హ్యాపీగా ఉంటావంటే వెళ్లిపోతాను అని మాస్టర్ చెప్పాడు. అయితే నేను మెహబూబ్‌కు ఇళ్లు లేదు. ఇంటి కోసం మెహబూబ్ ఆడుతున్నాడు. అందుకే మెహబూబ్ ఇంటిలో ఉండాలని ఆయనకు అనుకూలంగా ఓటు వేశాను అని మోనాల్ అంటే.. మాకు ఇళ్లు ఉందా అంటూ అమ్మా కామెంట్ చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4: Amma Rajashekar Daring Step
నీ మైండ్ ప్రకారం ఆడు..

నీ మైండ్ ప్రకారం ఆడు..

ఇక నీతో జన్మ మాట్లాడ కూడదని అనుకొన్నాను. కానీ నీవు వచ్చి మాట్లాడవు కాబట్టి సరే అనుకొన్నాను. కానీ నాతో వ్యవహరించిన తీరు సరిగా లేదు. అఖిల్ అలా చేయమని చెప్పాడా? నీ మైండ్ ప్రకారం ఆడు.. నీ మైండ్‌లో ఉంటే నీవు నన్ను నామినేట్ చేయి. అంతేగానీ ఒకరి కోసం నీ ఆటను మార్చుకోకు అంటూ మోనాల్‌కు అమ్మా రాజశేఖర్ క్లాస్ పీకారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X