Gunde Nida Gudigantalu: గుండె నిండా గుడి గంటలు హీరోయిన్ అమూల్య గౌడ.. ఈ కన్నడ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Amulya Gowda: స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు (Gunde Nida Gudigantalu). ఈ సీరియల్ కు తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ హీరోయిన్ మీనా అలియాస్ అమూల్య గౌడ తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. మరి గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తున్నందుకు గాను అమూల్య గౌడ ఎంత రెమ్యునరేషన్ అందుకుంటుందంటే తెలుసా?
కన్నడ బ్యూటీ అమూల్య గౌడ.. మైసూర్‌కి చెందిన అమూల్య గౌడ పదేళ్ల క్రితమే కన్నడ సీరియల్ 'స్వాతి ముత్తు'తో బుల్లితెరపై కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటించిన కమలి సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ ఫేమ్ తోనే పునర్ వివాహ, ఆరామనే అనే సీరియల్స్ లో ఆఫర్ కొట్టేసింది. తన అందం, అభినయంతో మెప్పించింది. కన్నడలో కూడా తన నటనతో ఎంతో మంది ఫ్యాన్ ను సంపాదించుకుంది.

తెలుగుకు పై మక్కువతో తెలుగు సీరియల్స్ లో ట్రై చేసింది. ఈ క్రమంలో కార్తీకదీపం సీరియల్ తో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇలా కార్తీక దీపం సీరియల్ లో రౌడీ బేబీ శౌర్యగా నటించి మెప్పించింది. ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ అమ్మడు తన నటనతో బుల్లి తెర ప్రేక్షకులను, అటు తన అందంతో కుర్రాకారును అట్రాక్ట్ చేస్తోంది.
కన్నడ సీరియల్స్ ఫేమ్ తో కన్నడ బిగ్ బాస్‌లో అడుగుపెట్టింది. కార్తీకదీపం తరువాత అమూల్య గౌడ కన్నడ బిగ్ బాస్‌కి కంటెస్టెంట్‌గా వెళ్లింది. తన గ్లామర్ సోకులతో కన్నడ బిగ్ బాస్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఇలా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న అమూల్య గౌడ ప్రస్తుతం గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో నటిస్తోంది. సీరియల్ లో తెలుగింటి అమ్మాయిలా.. పద్ధతిగా, చాలా కూల్ గా కనిపించే అమూల్య.

అమూల్య గౌడ ఎలాంటి సీన్ అయినా.. అద్భుతంగా పండించే కలదు. కానీ, రొమాంటిక్ సీన్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సీరియల్‌లో బాలు,మీనాల జోడీకి తెలుగు ఆడియన్స్ కు మంచి ఆదరణ వస్తోంది. చాలా తక్కువ కాలంలోనే తెలుగువారి దగ్గరయ్యారు. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో.. ఈ సీరియల్ కూడా విజయవంతంగా నడుస్తోంది. నిజంగా మీనా పాత్రలో అమూల్య గౌడ యాక్టింగ్ సూపర్ అని చెప్పవచ్చు.
ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తున్నందుకు గాను అమూల్య గౌడ వారానికి రెండున్నర లక్షల రెమ్యునరేషన్ అందుకుంటుందట. అంటే.. నెలకు దాదాపు 10 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. గుండెనిండా గుడిగంటలు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది. ఇలా ఆమెకు సోషల్ మీడియాలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ తయారైంది.


Click it and Unblock the Notifications











