Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు 8లోకి ఊహించని కంటెస్టెంట్ల పేర్లు.. అంతా ఉల్టాపల్టా?
రియాలిటీ షోలకే బాప్ లాంటి బిగ్‌బాస్ 8 తెలుగు షురూ అవుతోందంటూ అభిమానుల సందడి మామూలుగా ఉండదు. ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రానున్నారు, ఎన్ని గొడవలు జరుగుతాయి, కపుల్స్ ఎవరైనా వస్తారా, ప్రేమలో పడేదెవరు అంటూ ప్రేక్షకులు చర్చించుకుంటూ ఉంటారు. ఈసారి సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభం కానుందా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎగ్జయిట్‌మెంట్‌కు తెరదించుతూ బిగ్‌బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభిస్తున్నట్లుగా నిర్వాహకులు క్లారిటీ ఇచ్చేశారు. అలాగే డిసెంబర్ 8న గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అఫీషియల్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది సరే మరి ఈసారి బిగ్‌బాస్ ఎలా ఉండబోతోంది, ఏవైనా మార్పులు , చేర్పులు చేశారా అనే చర్చ జరుగుతోంది. ఉల్టాపల్టా అంటూ కొత్త తరహా కాన్సెప్ట్‌తో వచ్చిన బిగ్‌బాస్ 7 తెలుగు ప్రేక్షకులకు నిజంగానే కొత్త వినోదాన్ని అందించింది. ఈ సీజన్ కూడా కొత్తగా ఉండేలా బిగ్‌బాస్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో చర్చ జరుగుతోంది. అన్ లిమిటెడ్ ఫన్, ఫైట్ అనే కాన్సెప్ట్‌తో 8వ సీజన్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో జినీ గెటప్‌లో ఉన్న నాగార్జున .. ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు.. ఈసారి ఫన్, ట్విస్టులకు లిమటే లేదని హింట్ ఇచ్చేశారు. ఏం కోరినా లిమిట్ లేకుండా ఇస్తానంటూనే.. అడిగే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని కింగ్ పెట్టిన కండీషన్ ఎక్కడో తేడా కొడుతోంది.

బిగ్‌బాస్ 8 తెలుగులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరా అన్నదానిపై సస్పెన్‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు నిర్వాహకులు. గత సీజన్‌లలో అందరూ కాకపోయినా కనీసం ఒకటి రెండు పేర్లయినా బయటికి వచ్చేవి కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్స్‌ను ఇవ్వదలచుకున్నట్లుగా కనిపించడం లేదు. రోజులు గడిచేకొద్ది కొత్త కొత్త పేర్లు ఈ లిస్ట్‌లోకి చేరుతుండటంతో ఆడియన్స్‌లో కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. బిగ్‌బాస్ నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్స్‌ను సిద్ధం చేసేశారని, సడెన్‌గా అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు యూట్యూబర్లు చెబుతున్నారు. మరికొందరేమో బిగ్‌బాస్ లాంచింగ్ రోజు డైరెక్ట్‌గా హౌస్‌లోనే ఈ సీజన్ కంటెస్టెంట్స్‌ను చూపిస్తారని అంటున్నారు.
ఇంటర్వ్యూలు, వడపోతలలో ఎంపికైన కంటెస్టెంట్స్‌ను త్వరలోనే క్వారంటైన్‌కు తరలించి, వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ టెస్టుల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లు తేలితే .. వారి స్థానంలో మరొకరిని కంటెస్టెంట్‌గా పంపించేందుకు నిర్వాహకులు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియా టాక్. ఈసారి కూడా దాదాపు 20 మంది హౌస్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తాన్ని ఒకేసారి హౌస్‌లోకి పంపుతారా , లేక మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంకొందరిని పంపుతారా అని చర్చించుకుంటున్నారు.
తాజాగా ఓ యూట్యూబర్ బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభయ్ నవీన్ (రైటర్), నైనిక (నటి), బెజవాడ బేబమ్మ (యూట్యూబర్), యాష్మీ గౌడ (సీరియల్ నటి), కిరాక్ సీత (యూట్యూబర్), అభిరామ్ వర్మ, ఆదిత్య ఓం (హీరో), సౌమ్యా రావు (యాంకర్), ఇంద్రనీల్ (సీరియల్ నటుడు), జబర్దస్త్ పవిత్ర , యాదమ్మ రాజు , సాకేత్ (సింగర్), సన , అంజలి పవన్, భంచిక్ బబ్లూ, రీతూ చౌదరి, నిఖిల్ (సీరియల్ నటుడు), సుబ్బు (న్యాయవాది), తేజస్విని గౌడ (సీరియల్ నటి), అనిల్ కీలా. మరి ఈ లిస్ట్ కరెక్టేనా, ఇందులో ఎంతమందికి బిగ్‌బాస్‌లో ఛాన్స్ దక్కింది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











