యాంకర్ సుమ సంపాదన ఎంతంటే? సీక్రెట్స్ బయటపెట్టిన టాప్ ప్రొడ్యూసర్

యాంకర్ సుమ కనకాల. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మూడు దశాబ్ధాలుగా తెలుగువారిని తన మాటల మాయాజాలంతో నవ్విస్తూ అలరిస్తున్నారు. తెలుగునాట స్టార్ యాంకర్‌గా స్టార్స్‌ని మించిన స్టార్‌డమ్‌తో వెలుగొందుతున్నారు సుమ. ఎంతోమంది కొత్తవాళ్లు యాంకరింగ్‌లో వస్తున్నారు.. వెళ్తున్నారు.. కానీ సుమ మాత్రం అలాగే తన హవా సాగిస్తున్నారు. జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు ప్రతి ఒక్కరికి సుమతో తమ సినిమా ఈవెంట్స్‌కు యాంకరింగ్ చేయించుకోవాలని ఉంటుందంటే ఆమె రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.

బుల్లితెర మహారాణిగా
సుమ యాంకరింగ్ చూస్తూ పెరిగినవారు.. ఇప్పుడు వాళ్ల పిల్లలతో కలిసి సుమ యాంకరింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. బుల్లితెర, వెండితెర, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ఇతర ప్రైవేట్ పార్టీలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు సుమ. మూడు దశాబ్ధాలుగా అలుపెరగని ప్రయాణం సాగిస్తూ వినోదాన్ని పంచుతున్నారు. ఎలాంటి వాతావరణాన్ని అయినా తన సమయస్పూర్తితో ఆహ్లాదకరంగా మార్చేయడంలో ఈమె దిట్ట. సినిమా ఈవెంట్స్‌లో ఫన్నీ ఇంటర్వ్యూలు.. నటీనటులపై సెటైర్లు వేస్తూ జోష్ నింపుతారు. తాజాగా అనగనగా ఒక రాజు సక్సెస్‌మీట్‌లో సుమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ వివరాల్లోకి వెళితే..

Anaganaga Oka Raju Success Meet Naga Vamsi s Fun Comments on Suma Kanakala Go Viral

నవీన్ పొలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు
స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు. రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ, సత్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీత దర్శకత్వం వహించారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. వంశీ అట్టూరి ఎడిటింగ్, చిన్మయి సంభాషణలు అందించారు.

100 కోట్లతో అనగనగా ఒక రాజు సంచలనం
మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన అనగనగా ఒక రాజు వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. పాజిటివ్ టాక్, రివ్యూలతో జనం ఆదరణ పొందిన ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగ వసూళ్లను సాధించింది. ఇది హీరో నవీన్ పొలిశెట్టి కెరీర్‌లో తొలి 100 కోట్ల సినిమా. గతేడాది వరుస ఫ్లాపుల్లో ఉన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు తిరిగి ఊపిరి అందించింది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో అనగనగా ఒక రాజు మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు సుమ.

ఒక ఫ్లోర్ నాకు, ఇంకో ఫ్లోర్ నవీన్‌కి
సినిమా హిట్ అవ్వగానే పికెల్ బాల్ టీమ్ కొంటానిన చెప్పారు.. ఏది కొంటున్నారు.. అవకాయ, నిమ్మకాయ అని సుమ అడుగుతుంది. మా ప్రొడ్యూసర్ గారు ఏమిస్తే అది డిసైడ్ అవుతా. మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చే గిఫ్ట్‌ని బట్టి అవకాయ, పికెల్ బాల్ అనేది డిసైడ్ చేస్తానని హీరో నవీన్ పొలిశెట్టి ఆన్సర్ ఇచ్చారు. నేను ఇందాక వంశీ గారి దగ్గర రెండు కీలు చూశా... మీకు కారు అనుకుంటా అని సుమ చెప్పింది. ఆ కారు నాకే.. కాకపోతే వెనకాల కొత్త టవర్స్ కూడా వస్తున్నాయని నవీన్ అన్నారు. అందులో 2 ఫ్లోర్స్ ఖాళీ ఉన్నాయట.. ఒకటి నవీన్‌కు, రెండోది నాకు అని సుమ చెప్పగానే అంతా నవ్వేస్తారు.

సుమ మనిద్దరినీ కలిపి కొనేయగలదు
ఆ వెంటనే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఏ ప్రొడ్యూసర్‌కి అయినా ఇలాంటి సక్సెస్ మీట్‌ పెట్టినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మేం కట్టిన డబ్బుకు రూపాయికి రూపాయి వచ్చిందని, డబుల్ చేసిందని, ఇంత కమీషన్ వచ్చిందని చెప్పడమే పెద్ద సక్సెస్. అదంతా వాళ్లే చెప్పారు.. ఇక నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏముంది. మీరు ఇందాక నుంచి ఫ్లాట్ కొంటారా? కార్ కొంటారా? అని రెచ్చగొడుతున్నారు అని సుమపై సరదాగా వ్యాఖ్యానించారు నాగవంశీ. మీకు, నాకు అంటే సంవత్సరానికి నాలుగైదు సినిమాలు ఉంటాయి. రెండు సంవత్సరాలకి ఒకసారి హీరోగా వచ్చే నవీన్‌ని ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు వంశీ. మనిద్దరినీ కలిపి కొంటది.. ఆవిడకి మనం గిఫ్ట్‌లు ఇవ్వడం ఏంటీ? అని నాగవంశీ అనగానే సుమ షాకైంది. మైక్ ఇచ్చి వెళ్లిపోతుండగా నా నెలకి ఈఎంఐ మీకు పంపిస్తానని సుమ సెటైర్ వేయడంతో అంతా నవ్వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X