Brahmamudi December 21st: రూ.2 కోట్లు కొట్టేసిందుకు అనామిక ప్లాన్.. స్వప్న బండారం బయటపెడతానన్న అరుణ్!
ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో (డిసెంబర్ 21వ తేదీ) దుగ్గిరాల కుటుంబం అంతా కల్యాణ్ పెళ్లి కోసం రిసార్టుకు చేరుకుంటుంది. రిసార్ట్ భారీదే బుక్ చేశారని అనామిక తండ్రి అంటాడు. నా తమ్ముడు పెళ్లికి ఆమాత్రం కూడా ఉండకూడదా అని రాజ్ అంటుడంగా... బావగారు ఇది మీ తమ్ముడి పెళ్లి మాత్రమే కాదు. నా పెళ్లి కూడా. ఇందులో నాకు కూడా హక్కు ఉందని అనామిక అంటుంది. అప్పుడే నా కోడలు హక్కుల గురించి మాట్లాడుతుందని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఇప్పుడంతా కాలం మారింది. పూర్వకాలంలో అయితే పెళ్లి అయి పిల్లలు పుట్టాక కూడా భయంగా ఉండట్లేదు కదా అని ఇందిరాదేవి చెప్పుకువస్తుంది. ఎంత హక్కుల గురించి మాట్లాడినా.. అత్తింటికి వచ్చే ఆడపిల్ల కాస్తా భయంగా ఉండాలి కదా అమ్మమ్మ అని కావ్య మాట్లాడుతుంది. నువ్ ఎప్పుడు భయపడ్డావు. మమ్మల్ని భయపెట్టావ్ అని రుద్రాణి కౌంటర్ వేస్తుంది. అందుకు కారణం మీరే కదా అని కావ్య తిరిగి కౌంటర్ ఇస్తుంది. రుద్రాణి నువ్ కావ్యను ఏదో ఒకటి అనకుండా ఉండలేవా అని ఇందిరాదేవి కోపంగా అంటుంది.

కల్యాణ్ సాఫ్ట్, అనామిక ఫైర్ బ్రాండ్. నా కొడుకు కూడా మరో ప్రకాశంలా ఉండిపోతాడేమేనని అనిపిస్తుందని ప్రకాశం ఫన్నీగా చెప్పుకువస్తాడు. దీంతో అంతా నవ్వుతారు. ఇంతలో ఆటోలో అప్పు, కనకం, కృష్ణమూర్తి దిగుతారు. ఇదంతా చూస్తూ నువ్ బాధపడటం నాకు ఇష్టం లేదు. వచ్చిన ఆటోలోనే ఇంటికి వెళ్లు అని కనకం.. అప్పుతో అంటుంది. కల్యాణ్ తాళి కట్టడం చూస్తేనైనా నా గుండె రాయిలా మారుతుందేమో అని అప్పు చెప్పుకువస్తుంది.
ఇంతలో అప్పును చూసిన కల్యాణ్ అందరిముందుకు తీసుకొస్తాడు. అప్పు నా పక్కనే తోడిపెళ్లి కొడుకులా ఉండాలని చెప్తాడు. నాకు ఎప్పుడూ వెన్నంటే ఉండి ధైర్యం చెప్పిందంటూ అప్పు గురించి గొప్పగా చెప్తాడు కల్యాణ్. అది చూసి అనామిక తల్లిదండ్రులు మొహం తిప్పుకుంటారు. మరోవైపు స్వప్నకు అరుణ్ కాల్ చేస్తాడు. స్వప్న పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. ఇక అరుణ్ మీద ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా నాతో వచ్చేయ్. లేకుంటే నేనే అక్కడికి వచ్చి గొడవ చేస్తాను అని అరుణ్ అంటాడు.
రారా.. నీకోసమే ఎదురుచూస్తున్నాను అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది. నేను అక్కడికి వస్తాను. కానీ నిజం చెప్పను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనే తండ్రిని అని చెబుతానని బెదిరిస్తాడు. అంతా నన్నే నమ్ముతారు. కాబట్టి నేను చెప్పినట్లు ఎవరికీ తెలియకుండా వచ్చేయ్ అని అరుణ్ అంటాడు. అరుణ్ ఫోన్ పెట్టేశాక... ఇప్పుడు నేను వీడిని హ్యాండిల్ చేయలేనని అనుకుంటుంది స్వప్న. ఈ విషయం కావ్యకు చెప్పాలని అనుకుంటుంది.
ఇంతలో పద్మావతి, వీక్కి ఫ్యామిలీ రిసార్టుకు వస్తుంది. వాళ్లను దుగ్గిరాల కుటుంబం ఆహ్వానిస్తుంది. అంతా సరదాగా మాట్లాడుకుంటారు. ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. వీళ్లు కూడా మీలాగే మిడిల్ క్లాస్ వాళ్లు అని రుద్రాణి అంటే.. అత్తింటి పేరు నిలబెడితే చాలు అని కౌంటర్ వేస్తుంది. దాంతో నువ్ నాకు నచ్చావే పిల్లా అని ఇందిరాదేవి అంటుంది. అనంతరం పద్మావతి వాళ్లకు కావ్య, రాజ్ రూమ్స్ చూపిస్తారు.

ఇక రాజ్, కావ్య - పద్మావతి, విక్కి బెడ్ రూమ్స్ గురించి మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో వారి ఇద్దరి కాపురం సరిగా లేదని అనుకుంటారు కావ్య రాజ్. మరోవైపు ఇంకా కావ్య రావట్లేదని స్వప్న టెన్షన్ పడుతుంటుంది. అది చూసి ఫోన్ వచ్చేసరికి పాప కంగారుపడుతుందని రాహుల్ అనుకుంటాడు. ఇందాకా నీ కాల్ వచ్చినప్పటి నుంచి నీ బిహేవియర్ మారింది. ఏదైనా తప్పు చేశావా. నీ చరిత్ర అలాంటిది. నీకన్న నేను చాలా బెటర్. పెళ్లికి ముందు నా డబ్బు చూశావ్. ఇప్పుడు డబ్బు లేదని తప్పు పడుతున్నావ్ అని రాహుల్ అంటాడు.
ప్రేమిస్తే తప్పులన్నీ వదిలేస్తాం అని స్వప్న అంటుంది. ఇంతలో రుద్రాణి వచ్చి ఏమంటుంది నీ పెళ్లాం అంటుంది. కంగారు పడుతుంది. కావ్యకు చెబితే మాత్రం ప్లాన్ రివర్స్ అవుతుందని రాహుల్ అంటాడు. దీనికున్న పొగరుకు చెప్పదని రుద్రాణి అంటుంది. మరోవైపు కల్యాణ్, అప్పు మాట్లాడుకుంటారు. డాడీకి అప్పు ఇచ్చినవాడు పెళ్లిలో గొడవ చేస్తాడేమో. ముందే కల్యాణ్‌ను ట్రైన్ చేయాలని అనామిక అనుకుంటుంది. కల్యాణ్ గదిలోకి వెళ్లే సరికి అప్పు ఉండటం చూసి షాక్ అవుతుంది.
ఇలా పెళ్లి కాకముందు పెళ్లికొడుకు గదిలోకి రాకూడదు కదా అని కల్యాణ్ అంటే.. నీతో పర్సనల్‌గా మాట్లాడదమంటే ఎప్పుడు ఎవరో ఒకరు అడ్డుగా ఉంటున్నారు అని అనామిక అంటుంది. దీంతో నేను పోతున్న అని అప్పు వెళ్లిపోతుంది. అప్పును ఆపి డోర్ పెట్టి కాపాల ఉండమంటుంది అనామిక. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ లో హల్దీ ఫంక్షన్ జరుపుకుంటారు. జంటలు అందరూ పసుపు పూసుకుంటూ హ్యాపీగా గడుపుతారు.


Click it and Unblock the Notifications











