Brahmamudi October 21st: కారులో కల్యాణ్ రొమాన్స్.... అప్పు ప్రేమను గుర్తించిన అనామిక

కల్యాణ్, అనామికలతో పాటు అప్పు కూడా కారులో వెళ్తుంది. ఇక షాపింగ్ పూర్తి చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి మనసు నాకు తెలుసు అని అనామిక అంటుంది. అప్పు ఎవరినో ప్రేమిస్తుందని అనామిక అంటుంది. మా బ్రోనా ఛాన్సే లేదు అని కల్యాణ్ అంటాడు. అప్పును అడుగుతుంది అనామిక... అలాంటిది ఏమి లేదు అని అప్పు అంటుంది. నీకు చెప్పడం ఇష్టం లేనట్టు ఉంది.. చెప్పాలి అనిపించినప్పుడు చెప్పు అని అనామిక అంటుంది.

నా ప్రేమ పుట్టడమే ఆయువు లేకుండా పుట్టింది.. నాకు తెలిసే లోపే చచ్చిపోయింది.. అంటూ మనసులో అనుకుంటుంది అప్పు. కల్యాణ్ కూడా హెల్ప్ చేస్తా అని అంటాడు. అనామికకు అంటే తెలియదు.. నీకు కూడా తెలియదా అని అప్పు అంటుంది. నా గురించి మీకు ఎందుకు.. మీరు పెళ్లి చేసుకోండి అంటుంది అప్పు.

Anamika Doubt on Appu Love and Kalyan Romance in October 21st 2023 Episode number 233 in Brahmamudi Telugu Serial

మరోవైపు రాహుల్ దొంగతం గురించి స్వప్న పంచాయితీ పెడుతుంది. నీకు సిగ్గులేదా అంటూ ఫైర్ అవుతుంది. దొంగతం చేశావ్ అంటే పళ్లు రాలుతాయ్ అని రాహుల్ అంటాడు. మరి దైర్యంగా ఎందుకు తీసుకుపోలేదు.. అందరూ అడుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావ్ అంటూ స్వప్న అంటుంది. రాజ్ కంటే గొప్పవాడివి... ఏదో సాధిస్తావ్ అని నమ్మాను అంటూ స్వప్న అంటుంది. చేసిన తప్పుకు సిగ్గు పడాల్సింది పోయి... సమర్ధించుకుంటావా అని స్వప్న అంటే.. నాకు సిగ్గులేదు అంటూ రాహుల్ చెప్తాడు.

ఇక అప్పును ఇంటి దగ్గర దింపుతారు కల్యాణ్, అనామిక. ఇక బై చెప్పే క్రమంలో కల్యాణ్.. అనామిక మీదకు వస్తాడు. అప్పు ముందే రొమాన్స్ చేసుకుంటారు. అది చూసిన అప్పు.. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక గదిలో కావ్య తన బెడ్ తెచ్చుకుంటుంది. నడుము నొప్పితో బాధపడుతూ ఉంటుంది కావ్య. అది చూసిన రాజ్ ఏమైంది అని అడుగుతాడు. చింతకాయ తొక్కైంది.. మీ పని మీరు చూసుకోండి అని కావ్య అంటుంది.

Anamika Doubt on Appu Love and Kalyan Romance in October 21st 2023 Episode number 233 in Brahmamudi Telugu Serial

కావ్య నడుము నొప్పితో బాధపడుతుంది. అది చూసి హెల్ప్ చేద్దామా అనుకుంటాడు రాజ్. వద్దులే అనుకుంటుండగా.. పెళ్లాం కష్టపడుతుంది.. హెల్ప్ చేద్దామని లేదు అని కావ్య అంటుంది. నువ్వు ఏమైనా అనుకుంటావేమో అని రాజ్ అంటాడు. ఇక రాజ్.. కావ్య నడుముకు అయింట్ మెంట్ రాస్తాడు. కావ్య నడుముని రాజ్ టచ్ చేయగానే ఇద్దరికీ తెలియని ఫీలింగ్స్ మొదలు అవుతాయి.తర్వాత నిన్ను ఒకటి అడుగుతా. తిట్టవు కదా అని రాజ్ అంటాడు. కొంపదీసి ముద్దుగాని అడుగుతాడా ఏంటీ అని కావ్య అనుకుని అడగండి అని అంటుంది. చాలా సేపటి తర్వాత ఆరోజు గుడికి వెళ్లావ్ కదా. నిజంగా మొక్కేనా అంటాడు రాజ్. దీంతో కావ్య సీరియస్ అవుతుంది.

Anamika Doubt on Appu Love and Kalyan Romance in October 21st 2023 Episode number 233 in Brahmamudi Telugu Serial

తర్వాత రాజ్ పడుకుంటాడు. ఆయనలో కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది. కచ్చితంగా ఆయన్ను మార్చుకుంటాను అని కావ్య అంటుంది. మరోవైపు తన చీరలు కప్పుకున్నదన్న కోపంతో కనకం చీరలను కత్తెరతో కట్ చేస్తుంది రుద్రాణి. తర్వాత వచ్చి చూసుకున్న కనకం షాక్ అవుతుంది. ఈ గదిలో ఎలుక ఉంది వదిన. ముదిరిపోయిన ఎలుక. ఎంత ట్రై చేసిన ఇదే గదిలోకి వస్తుంది అని రుద్రాణి అంటుంది. రుద్రాణినే చీరలు కట్ చేసిందని కనకం అనుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X