Brahmamudi December 6th: కనకం ప్లాన్ సక్సెస్.. కల్యాణ్, అనామిక పెళ్లి రద్దు.. హనీమూన్‌కు రాజ్, కావ్య!
ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో (డిసెంబర్ 6వ తేదీ) అరుణ్ కావాలనే తప్పించుకున్నాడు అంటూ కావ్య.. రాజ్ తో అంటుంది. ఆ సీఐడీ ఇన్వెస్టిగేషన్ ఆపుతావా అని రాజ్ అంటాడు. హస్పటల్ కు వెళ్తే లేడు.. ఇంటికి వెళ్తే లేడు... కావాలనే తప్పించుకుని వెళ్తున్నాడు అనిపించడం లేదా అని కావ్య అంటుంది. మీ అక్కనే హ్యాపీగా ఉంటుంది.. నీకెందుకు ఇవన్నీ వదిలేయ్ అని రాజ్ సలహా ఇస్తాడు. నేను వదలను... ఆడవాళ్లపై నింద వేస్తే ఎలా వదిలేస్తాను... అని కావ్య అవుతుంది.
ఇక కాసేపు వీరి మధ్య ఫన్నీ వాదన మొదలు అవుతుంది. ఇక కావ్య ఆపకపోవడంతో... బొమ్మ పగులగొడుతాను అని చెప్తాడు రాజ్. అది నేను పుట్టింటి నుంచి తెచ్చుకున్న బొమ్మ.. వద్దండి అని కావ్య అంటుంది. నువ్వు ఆ అరుణ్ గారి ముచ్చట తీసుకువస్తే.. నిజంగానే పగులగొడతాను అని వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఇక కావ్య.. మీరు మంచివారు అని నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది.

మరోవైపు కల్యాణ్ అప్పుకు కాల్ చేస్తుంటే తను కట్ చేస్తుంది. అప్పుడే కనకం వస్తే.. ఫోన్ ఇవ్వండని అడుగుతాడు. ఎందుకు బాబు అని అంటుంది. అప్పుకు కాల్ చేయడనికి అని చెప్పగానే ఫోన్ ఇస్తుంది. ఎందుకు బాబు అని అడిగితే.. నిశ్చితార్థం విషయం చెప్దామని అని అంటాడు. వామ్మో నిశ్చితార్థం అని చెప్తే అప్పుకు విషయం తెలిసిపోతుందని వద్దని చెప్తుంది. నేను చెప్పేశాను.. వచ్చేస్తుంది రేపు అని కనకం చెప్తుంది. ఇక కల్యాణ్ కూడా ఓకే అంటాడు.
కనకం స్నానం చేసి పడుకుందామని అనుకుంటుంది. తను బట్టలు తెచ్చుకోలేదని గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రుద్రాణి బట్టలు ఉన్నాయి కదా వాడేసుకుందాని వెళ్తుంది. కానీ అక్కడ రుద్రాణి డోర్ లాక్ వేసి బయటకు వెళ్లిపోతుంది. కనకం వచ్చి డోర్ తీస్తే రాదు. ఇక లాక్ తీయాలంటే.. తాళమే కావాలా ఏంటి అని పిన్ తో తాళం తీస్తుంది. ఇక రుద్రాణి ఏమో బయట గంట అయింది.. కనకం పోయి స్టోర్ రూంలో పడుకుంటుందని అనుకుంటుంది.

ఇక గదికి వచ్చే సరికి గది తెరిచి ఉంటుంది. షాక్ అవుతుంది రుద్రాణి. ఇక కనకం.. రుద్రాణి నైటీ వేసుకుని ఉంటుంది. నా నైటీ వేసుకున్నావ్ ఏంటి అని అడుగుతుంది. అక్కడ చీరలు ఉన్నాయి... అవి నేను ఎలా కట్టుకోవాలి అని నైటీ వేసుకున్నాను అని చెప్తుంది. స్వప్న గదిలోకి వెళ్ళమని చెప్తే.. మొగుడుపెళ్లాలు ఉంటారు. వాళ్లకి అచ్చట ముచ్చట ఉంటుంది. ఏకాకి మీరు ఉన్నారు. మనం కలిసి ఉందామని చెప్తుంది కనకం.
ఇక తెల్లారాక నిశ్చితార్థం గురించి ఇందిరాదేవి, రాజ్ మాట్లాడుకుంటున్నారు. ఇక కనకానికి అప్పు ఫోన్ చేసి బయటకు రమ్మంటుంది. బయటకు వచ్చాక మాట్లాడుకుంటారు. నేను ఈ ఇంటికి అని అప్పు చెప్తుంది. ఇక కల్యాణ్ వచ్చి.. అప్పుకు నిశ్చితార్థం విషయం చెప్తాడు. ఇక అప్పు బాధ పడుతుంది. ఇక అప్పును బలవంతంగా లోపలికి తీసుకువెళ్తాడు కల్యాణ్. ఇక పంతులు వస్తాడు. కనకం మళ్లీ బెదిరిస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తాను తల్లి అని పంతులు అంటాడు.

ఇక పంతులు ముహుర్తం పెట్టడానికి సిద్ధం అవుతాడు. కనకం సైలెంటుగా బెదిరిస్తూ ఉంటుంది. రుద్రాణికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక పంతులు గారిని ఏమైందని ఇంట్లో వాళ్లు అడుగుతూ ఉంటారు. అబ్బాయి జాతకం అమోఘంగా ఉందని చెప్తాడు పంతులు. ఇక అనామిక జాతకం చెప్పేలోపు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో అనామిక జాతకంలో దోషం ఉందని.. ఈ పెళ్లి ఆపేద్దామని ధాన్యలక్ష్మి అంటుంది.
దానికి కల్యాణ్ సిరీయస్ గా లేచి వెళ్లిపోతాడు. దానికి కావ్య అడ్డుపడి.. మీ అన్నయ్య, నా జాతకాలు అసలు చూడలేదు. మేం హ్యాపీగా లేమా అని చెప్తుంది. మొన్న సర్ ప్రైజ్ అని చెప్పి.. మీ అన్నయ్య హనీమూస్ కోసం ప్లాన్ చేస్తున్నాడు అని చెప్తుంది. ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications










