Baby Movieని దిమ్మతిరిగే రేటుకు కొనుక్కున్న ప్రముఖ ఛానెల్... టెలికాస్ట్ ఎప్పుడంటే?

కంటెంట్ ఉంటే చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని ప్రేక్షకులు చూడరు. సినిమా నచ్చితే దానికి బ్రహ్మరథం పడుతారు. అలా చిన్న సినిమాగా వచ్చి ప్రభంజం సృష్టించిన చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఓటీటీ హక్కులను ఆహా, నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా... ఇక శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఛానెల్ దిమ్మ తిరిగే రేటుకు విక్రయించింది. ఆ వివరాల్లోకి వెళితే...

చిన్న సినిమాగా రిలీజ్ అయి.. వసూళ్ల ప్రభంజనం సృష్టించిన చిత్రం బేబి. సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ మూవీని కేవలం 10కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తే.. 90 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి.. కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బిగ్ స్క్రీన్ మీద ఎవరూ ఊహించని రేంజ్ లో వసూళ్లను సాధించిన ఈ మూవీ... ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద అలరించడానికి రెడీ అవుతోంది.

Anand Deverakonda Baby Movie satellite rights acquired by ETV For Rs.4Cr and Telecast Details Here

బేబీ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ స్ట్రీమింగ్ కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఆహా డిజిటల్ ఫ్లాట్ఫార్మ్ లో 'బేబీ' చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఓటీటీలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించారు. అంతే కాదు ఈ మూవీ థియేటర్లలో దాదాపు 3 గంటలు ఉంటే.. ఓటీటీకి వచ్చే సరికి 4 గంటల నిడివి గల మూవీని రిలీజ్ చేస్తారని ప్రచారం సాగుతుంది. వైష్ణవి చైతన్య, విరాజ్ మధ్య రొమాన్స్ సీన్స్ తో పాటు.. ఆనంద్, వాళ్ల అమ్మ మధ్య సెంటి మెంట్ సీన్స్ కలిపి ఓటీటీలో 4 అవర్ కట్ సినిమాను రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది.

Anand Deverakonda Baby Movie satellite rights acquired by ETV For Rs.4Cr and Telecast Details Here

ఇక బేబీ సినిమాను ఆహా ఓటీటీయే కాకుండా నెట్ ఫ్లిక్స్ కూడా సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే... బుల్లితెర ప్రేక్షుకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'బేబీ' మూవీ శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'ఈటీవీ' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Anand Deverakonda Baby Movie satellite rights acquired by ETV For Rs.4Cr and Telecast Details Here

'బేబీ' మూవీ శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ ఫ్యాన్సీ రేటు దాదాపు 4 కోట్లకు పైగా ఖర్చు పెట్టి దక్కించుకున్నట్లు సమాచారం. కొత్త సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసే విషయంలో ఈటీవీ, ఈటీవీ విన్ ఓటీటీ కాస్త వెనుకంజలో ఉన్నాయని తెలిసిందే. తెలుగు చిత్రాల శాటిలైట్ హక్కుల కొనుగోలులో స్టార్ మా, జీ తెలుగు, జెమిని వంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈటీవీ మిగతా ఛానల్స్ తో పోటీ పడి మరీ 'బేబీ' హక్కులను చేజిక్కించుకుందని తెలుస్తోంది.

ఇక ఈ బేబీ మూవీని ఈటీవీలో త్వరలో ప్రసారం కానుందని తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీని టీవీలో ప్రసారం చేయనున్నారట. ఇక ఈ కొత్త సినిమాతో నైనా ఈటీవీ రేటింగ్ ఏమైనా సాధిస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X