Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్‌పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
పులిహోర కలపడంలో స్పెషలిస్ట్!.. శేఖర్ మాస్టర్ పరువు తీసిన అనసూయ
వెండితెరపై తారలో అదిరిపోయే స్టెప్పులు వేయించే శేఖర్ మాస్టర్.. బుల్లితెరపై కౌంటర్లు వేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు. అయితే శేఖర్ మాస్టర్.. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ప్రదీప్ వంటి వారితో జంట కడితే ఇక అక్కడ పంచ్‌ల వర్షం కురవాల్సిందే. వీరంతా పులిహోర కలపడంలో స్పెషలిస్ట్. ఈ మేరకు వారిలో వారే కౌంటర్స్ వేస్తుకుంటుంటారు. మొత్తానికి పులిహోరకు వీరికి బాగానే కుదిరింది. అయితే ప్రస్తుతం అందరూ కలిసి శేఖర్ మాస్టర్‌ను ఒంటరి చేశారు.
క్యాష్ షోలో..
సుమ హోస్ట్‌గా నిర్వహించే క్యాష్ షోలో రాబోయే వారానికి గానూ హైపర్ ఆది, అనసూయ, రష్మీ, శేఖర్ మాస్టర్ గెస్ట్‌లు విచ్చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో ఓ రేంజ్లో ఆకట్టుకుంటోంది. అందరూ కలిసి శేఖర్ మాస్టర్‌ను టార్గెట్ చేశారు.
పులిహోర స్పెషల్..
క్యాష్ షోలో ఎంట్రీ ఇచ్చేటప్పుడు సెలెబ్రిటీలకు ఏదైనా తినుబండారాలను ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి పులిహోరను ఏర్పాటు చేశారు. దీంతో అందరూ కలిసి శేఖర్ మాస్టర్‌ను ఓ ఆట ఆడుకున్నారు. సుమతో మొదలుపెట్టిన ఈ బాదుడు.. హైపర్ ఆదితో ముగిసింది.
సుమతో మొదలు..
షోలోకి ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్‌కు పులిహోర అందించింది సుమ. ‘ఈ పులిహోర మిర్చి ఎందుకు వేశారు?‘ అని శేఖర్ మాస్టర్ అనడంతో.. ‘మీరు కలిపే పులిహోరలో మిర్చి ఉండదా?' అని సుమ ఓ పంచ్ వేసింది. ఇక ఇలా మొదలైన దాడి అలా కొనసాగుతూనే వచ్చింది.
రష్మీ, అనసూయలు సైతం..
ఇక ఆ వెంటనే వచ్చిన రష్మీకి సుమ పులిహోర అందించింది. ఎవరు చేశారు అని రష్మీ అడగంతో.. వారు కలిపారు అంటూ శేఖర్ మాస్టర్‌ను చూపించింది. ‘మాస్టర్ మీరు కలిపారా?' అంటూ ఓ రకంగా ఆడిగింది రష్మీ. అనసూయ ఎంట్రీ ఇవ్వగా.. ఫస్ట్ ఆ పులిహోర తీసుకో అని సుమ చెప్పుకొచ్చింది. ‘అప్పుడే కలిపేశారా? మాస్టర్' అంటూ శేఖర్ మాస్టర్ పరువు తీసేసింది.
Recommended Video
చివరి పంచ్..
చివరగా వచ్చిన హైపర్ ఆది పులిహోరను చూస్తూ.. ‘శేఖర్ మాస్టర్ కలిపాక కూడా మిగిలిందా?' అని పంచ్ వేశాడు. ఇక ఇదే సమయంలో శేఖర్ మాస్టర్‌ను చూపిస్తూ రాజా సినిమా బ్యాక్ గ్రౌండ్, వెంకటేష్ డైలాగ్‌లతో( అదంతా అప్పుడండి.. ఇప్పుడు నేను మారిపోయానండి) అంటూ వేసిన ఎడిటింగ్ అదిరిపోయింది. ఇలా అందరూ కలిసి శేఖర్ మాస్టర్‌ను పులిహోరకు అంకితం చేసేశారు.