Just In
- 3 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 4 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 6 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
జనసేన-బీజేపీ అభ్యర్థులను గెలిపించండి, మోడీ నాయకత్వంలో ప్రభుత్వం: పవన్ కళ్యాన్
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనసూయ నడుము మీద చేతులేసిన శేఖర్ మాష్టర్.. ఆ సరసానికి ఆడియెన్స్ షాక్
అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణు ప్రియ లాంటి యాంకర్స్ బుల్లితెరపై హంగామా చేస్తుంటారు. అయితే వీరందరిలోనూ అనసూయ, రష్మీకి ఉన్న క్రేజ్ వేరు. అందులోనూ ముఖ్యంగా అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్, అచ్చ తెలుగులో అవలీలగా మాట్లాడే సత్తా ఇలా ప్రతీ వాటిలో అనసూయ ఆమెకు ఆమే సాటి అనిపించుకుంటూ ఉంటోంది.

పలు షోలతో బిజీగా..
జబర్దస్ షోతో ఎంతో ఫేమస్ అయిన అనసూయ వెండితెరపైనా మెరిసింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. ఐటమ్ సాంగ్స్ అని మాత్రమే కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. అటు వెండితెరపై పలు ప్రాజెక్ట్స్, ఇటు బుల్లితెరపై పలు షోలతో బిజీగా గడిపేస్తుంది.

బుల్లితెరపై ఫేమస్ అయిన శేఖర్ మాష్టర్..
బుల్లితెరపై వచ్చే డ్యాన్స్ షోలో జడ్జిగా వ్యవహరించే శేఖర్ మాష్టర్‌కు ఉన్న ఫాలోయింగే వేరు. ఆయన పంచ్‌లు, ఆయన స్టెప్పులు, రోజా, అనసూయలతో వేసే స్టెప్పులు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఇక రోజా, శేఖర్ మాష్టర్ల కెమిస్ట్రీ గురించి ఇదివరకే ఎన్నో ఈవెంట్స్‌లో చూశాం. రాజశేఖర.. అనే పాటకు వీరిద్దరు వేసిన స్టెప్పులు ఎంతో ఫేమస్.

తాజాగా లోకల్ గ్యాంగ్స్..
జబర్దస్త్ నుంచి వేరుపడిన నాగబాబు జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్, అదిరింది అనే షోలను ప్రారంభించాడు. లోకల్ గ్యాంగ్స్‌కు అనసూయ, శేఖర్ మాష్టర్‌లను జడ్జిలుగా నియమించారు. అయితే ఈ షోలో తాజాగా అనసూయ, శేఖర్ మాష్టర్స్ చేసిన రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతంది.

నడుము మీద చేయి..
ఈమధ్య వీరి ఎంట్రీల్లో మరింత ఘాటుదనం కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మరింత వేడిని పుట్టించేలా ఉంది. బలపం పట్టి భామ ఒళ్లో అనే పాటకు వీరిద్దరు వేసిన స్టెప్పులు ఒకెత్తు అయితే.. అనసూయ నడుము మీద చేయి వేసి ఉంచడం మరో ఎత్తు. వీరి రొమాన్స్ పీక్స్‌లో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రోజాపై పంచ్‌లు..
ఇక రోజాకు శేఖర్ మాష్టర్ లేరని ప్రదీప్ అంటూ ఉండగా.. ఆవిడ రమ్మంటుందని ప్రదీప్ తెలిపాడు. ఎక్కడికి బండి షోకా? అని అనసూయ అనడం.. అయితే అక్కడ ఆమె జడ్జిగా ఉంటుందా? పార్టిసిపేట్‌గా ఉంటుందా? అని పంచ్ వేయడంతో పక్కనే ఉన్న శేఖర్ మాష్టర్ అవాక్కయ్యాడు. మరి ఈ పంచ్‌లపై రోజా స్పందిస్తుందో లేదో చూడాలి.