నాకు ఆ అడిక్షన్.. అందుకే బిగ్‌బాస్‌ను వదులుకొన్నా.. అనసూయ క్లారిటీ
వినోద పరిశ్రమలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమా రంగంలో తనదైన ముద్రను వేశారు. ఇటీవల ఆమె నటించిన క్షణం, రంగస్థలం, యాత్ర సినిమాలు మంచి పేరును తెచ్చాయి. నటిగా మంచి పేరు తెచ్చుకొంటున్న నేపథ్యంలో సింగిల్ హీరోయిన్‌గా కథనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కథనం సినిమా ఆగస్టు 9న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు.
బిగ్‌బాస్ రియాలిటీ షో నేను కావాలనే నేను నిరాకరించాను. ఎందుకంటే నేను ఫ్యామిలీని వదిలి వెళ్లలేను. నా కుటుంబానికి నేను బానిసను (ఎడిక్ట్‌ని). వారికి దూరంగా ఉండలేను. షూటింగ్‌కు వెళ్తే రోజుకు రెండుసార్లు వీడియో కాల్స్ మాట్లాడుతుంటాను. అందుకే బిగ్‌బాస్ ఆఫర్‌ను వదులుకొన్నాను. బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేసే వాళ్లకు చాలా ధైర్యం. ఫ్యామిలీని వదిలి అన్ని రోజులు ఇంట్లో ఉండటానికి నిర్ణయం తీసుకోవడం గ్రేట్.

బిగ్‌బాస్ షో అప్పుడప్పుడు చూస్తుంటాను. ప్రోమోలను రెగ్యులర్‌గా చూస్తుంటాను. బిగ్‌బాస్ షోకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. అందుకే టీఆర్పీ రేటింగ్ రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. అది కాకుండా, ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఉన్న వారిలో ఎక్కువ మంది నాకు చాలా పరిచయం ఉన్నవారే అని బిగ్‌బాస్ అన్నారు.
ఇక కథనం సినిమా విషయానికి వస్తే.. మర్డర్ మిస్టరీ. సస్పెన్స్ థ్రిల్లర్. కథనం సినిమా బాగుంటుంది. తప్పక మీ అందరికి నచ్చుతుంది. మీ ఒపినీయన్ ప్రకారం.. నచ్చకపోతే నచ్చలేదని.. నచ్చితే నచ్చిందని చెప్పండి. సినిమా పరిశ్రమ భవిష్యత్తును నిలబట్టే రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉందని నేను భావిస్తాను అని అనసూయ అన్నారు.


Click it and Unblock the Notifications











