twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవన్నీ పక్కన పెట్టేద్దాం.. ప్రతీ ఏడాది ఓ కొత్త ఆరంభమే.. అనసూయ ట్వీట్ వైరల్

    |

    ప్రతీ పండుగకు బుల్లితెరపై జరిగే హంగా అందరికీ తెలిసిందే. ప్రతీ చానెల్ కూడా పోటీగా తీసుకుని స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తూ ఉంటుంది. వినాయక చవితి, దీపావళి, దసరా, సంక్రాంతి ఇలా ప్రతీ ఒక్క పండుగకు ప్రత్యేకంగా ఈవెంట్లు ప్లాన్ చేస్తుంటారు. స్టార్ మా, జెమిని, జీ, ఈటీవీ ఇలా అందరూ కూడా తమ తమ నటీనటుల బృందంతో కలిసి వెరైటీ కాన్సెప్ట్‌లతో వచ్చేస్తుంటారు. కొత్త ఏడాది సందర్భంగా కూడా స్పెషల్ ఈవెంట్లు రెడీ అయ్యాయి.

     ఢీ, జబర్దస్త్ మధ్య..

    ఢీ, జబర్దస్త్ మధ్య..

    నూతన సంవత్సరం సందర్భంగా ఈటీవీలో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఢీ జబర్దస్త్ మధ్య పోటీ ఉన్నట్టు.. ఇరు టీంలు కూడా తలపడినట్టు చూపించారు. ఢీ సెట్ కావాలంటూ జబర్దస్త్ టీం గొడవలు పడటం, ఆ రెండు టీంల మధ్య పోటీ ఉన్నట్టు బాగానే చూపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు ఫుల్ వైరల్అయ్యాయి.

     స్పెషల్ గెస్ట్‌లు..

    స్పెషల్ గెస్ట్‌లు..

    ఢీజే అంటూ రాబోతోన్న ఈ స్పెషల్ ఈవెంట్ నేటి రాత్రి ప్రసారం కాబోతోంది.దీంతో బాబా భాస్కర్, హీరో కార్తికేయ, జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు, ఢీ కంటెస్టెంట్లు, డ్యాన్సులు, కామెడీ స్కిట్స్ ఇలా అన్ని కూడా పీక్స్‌లో ఉండబోతోన్నట్టు కనిపిస్తున్నాయి.

    పోటీ లేకుండానే..

    పోటీ లేకుండానే..

    అయితే ఈ సారి మాత్రం ఢీజే అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌కు పోటీగా మరో ఈవెంట్‌ను ఎవ్వరూ కూడా ప్లాన్ చేయలేదు. జీ వాళ్లు పార్టీకి వేళాయేరా అంటూ గత ఆదివారం ఓ ఈవెంట్ చేశారు. ఇలా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అంటూ స్పెషల్‌గా మాత్రం చేయలేదు. ప్రస్తుతం ఈ ఒక్క ఢీజే ఈవెంట్ మాత్రం నేటి రాత్రి సందడి చేయబోతోందన్న మాట.

    అనసూయ స్పెషల్ ట్వీట్..

    అనసూయ స్పెషల్ ట్వీట్..

    ఢీజే స్పెషల్ ఈవెంట్, కొత్త సంవత్సరం గురించి అనసూయ ట్వీట్ చేసింది. ప్రతీ ఏడాది మనకు కొత్త ఆరంభం లాంటిదే.. 2020లో ఎలాంటి అనుభవాలు ఎదురైనా గానీ.. అవన్నీ పక్కన పెట్టేసి ముందుకు కదులుదాం.. కొత్త ఏడాదిలో కొత్త ఉద్దేశం, కొత్త లక్ష్యాలు, కొత్త ఉత్సాహంతో ఆరంభిద్దాం.. ఈ ఏడాది చివరి రోజును ఇలా ఎంజాయ్ చేద్దామంటూ ఢీజే ఈవెంట్ గురించి చెప్పింది.

    English summary
    Roja shocked On Hero Karthikeya Comments In DJ 2021 New Year Special Event,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X