Jabardasth: హైపర్ ఆది అందుకే వెళ్లిపోయాడా.. అనసూయ లీక్ చేసిందంటూ వార్తలు?

జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారు ప్రస్తుతం సినిమా పరిశ్రమలో బిజీ గా మారిపోతున్న విషయం తెలిసిందే. అయితే మరి కొంతకాలం జబర్దస్త్ లోనే కొనసాగుతారని అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉండటం విశేషం. జబర్దస్త్ ఎదుగుదలకు ఎంతగానో శ్రమించిన వారిలో హైపర్ ఆది కూడా ఉన్నాడు. కేవలం సుధీర్ కామెడీ తో కొనసాగుతున్న జబర్దస్త్ షో కి హైపర్ ఆది తీసుకొచ్చిన క్రేజ్ అయితే అంతా ఇంతా కాదు అయితే అతను ఇటీవల జబర్దస్త్ ను ఎందుకు వదిలి వెళ్లిపోయాడు అనే విషయంలో యాంకర్ అనసూయ ఒక క్లారిటీ ఇచ్చింది అంటూ.. కొన్ని వార్తలు అయితే వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బ్రేక్ చేసిన ఆది

బ్రేక్ చేసిన ఆది


హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా ఎంతగా గుర్తింపును అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఎలాంటి ఎపిసోడ్ చేసినా కూడా భారీ స్థాయిలో రేటింగ్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో హైపర్ ఆది కామెడీ వీడియోలకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఒక విధంగా సుడిగాలి సుదీర్ టీమ్ డామినేట్ చేస్తున్న సమయంలో హైపర్ ఆది వచ్చి వారి పాత యూట్యూబ్ రికార్డులను కూడా బ్రేక్ చేశాడు.

అదిరే అభి ద్వారా..

అదిరే అభి ద్వారా..

హైపర్ ఆది జబర్దస్త్ లోకి మొదట ఒక రైటర్ గా అడుగు పెట్టాడు. మొదట షార్ట్ ఫిలిమ్స్ చేసిన హైపర్ ఆది ఆ తర్వాత జబర్దస్త్ లోకి అదిరే అభినయ్ సహకారంతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతను రైటర్ గా విభిన్నమైన పంచులు ఎక్కువగా రాస్తూ ఉండడంతో స్కిట్ లో సైతం నటించే అవకాశం ఇవ్వాలి అని టీంలో జాయిన్ చేసుకున్నాడు. ఇక కొన్ని స్కిట్స్ తోనే అతను చాలా మంచి క్రీజ్ అందుకోవడంతో జబర్దస్త్ మేనేజ్మెంట్ ఆదిని ప్రత్యేకంగా టీం లీడర్ కూడా చేసింది.

రొటీన్ అయిపోతున్న సమయంలో..

రొటీన్ అయిపోతున్న సమయంలో..

ఇక ఆ తర్వాత టీం లీడర్ గా మారిన తర్వాత హైపర్ ఆది ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. జబర్దస్త్ పలు వివాదాల్లో హాట్ టాపిక్ గా మారినా కూడా అతని స్కిట్స్ కు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఒక విధంగా కామెడీ రొటీన్ అయిపోతున్న సమయం లో హైపర్ ఆది కామెడీని జనాలు కూడా చాలా కొత్తగా ఫీల్ అయ్యారు. అతని టీం లో కనిపించిన వారికి కూడా మంచి గుర్తింపు అయితే లభిస్తూ వస్తోంది.

అందుకే వెళ్లిపోయాడా?

అందుకే వెళ్లిపోయాడా?

ఇక అందరికంటే ఎక్కువ పారితోషికంతో హైపర్ ఆది జబర్దస్త్ లో కొనసాగుతున్న సమయంలో అతను హఠాత్తుగా బయటకు ఎందుకు వెళ్లిపోయాడు అనే విషయంలో అనేక రకాల కథనాలు అయితే వెలుపడ్డాయి. ముఖ్యంగా మల్లెమాల మేనేజ్మెంట్తో అతనికి విబేధాలు వచ్చినట్లు కొంతమందితో అక్కడ గొడవలు పడడం కారణంగానే హైపర్ ఆది వెళ్లిపోయినట్లుగా చాలా వార్తలు వచ్చాయి.

 అనసూయ క్లారిటీ..?

అనసూయ క్లారిటీ..?

అయితే అసలు కారణం అది కాదు అని ఇటీవల అనసూయ వివరణ ఇచ్చినట్లుగా కొన్ని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఒక పార్టీలో పాల్గొన్న అనసూయ హైపర్ ఆది పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే జబర్దస్త్ లో కొనసాగలేక పోయాడు అని అతనికి ఎక్కువగా సినిమాలో అవకాశం వస్తుండడంతో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నట్లుగా ఆమె చెప్పినట్లు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే అందుకు సంబంధించిన వీడియో ఏది సోషల్ మీడియాలో లేదు. మరి ఈ విషయంలో అనసూయ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X