మరో మెగా ఆఫర్ కొట్టేసిన యాంకర్ అనసూయ.. ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ రోల్
టెలివిజన్ రంగంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనసూయ భరద్వాజ్ నటిగా కూడా తన స్థాయిని పెంచుకుంటోంది. అనసూయ ఎలాంటి పాత్ర చేసినా కూడా ఇటీవల కాలంలో చాలా హైలెట్ అవుతున్నాయి. ప్రతీ సినిమాలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక ఆమెకు పారితోషకం కూడా గట్టిగానే ఇస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే రీసెంట్ గా ఒక మెగా హీరో సినిమాలో ఆమెకు మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లామర్ ట్రెండ్..
జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ టెలివిజన్ రంగంలో అందరి కంటే భిన్నమైన క్రేజ్ ను అందుకుంది. ఒకప్పుడు యాంకర్ గా అంటే కేవలం మాటలతోనే ఆకట్టుకునేవారు. కానీ అనసూయ వచ్చిన తర్వాత ఆ
సరికొత్త ట్రెండ్ మొదలయ్యింది అనే చెప్పాలి. కేవలం మాటలతోనే కాకుండా గ్లామర్ తో కూడా అనసూయ సరికొత్త ఫార్మాట్ ను మొదలు పెట్టింది.

అందమే హైలెట్ అయ్యేలా..
ఆమె తర్వాత మరికొంతమంది వారి గ్లామర్ యాంకర్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ అనసూయకు మాత్రం ఎవరు పోటీగా నిలవలేకపోయారు. అనసూయ కు సంబంధించిన ఫోటోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనసూయ ఎలాంటి షో చేసిన కూడా అందులో ఆమె చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.

టాప్ లిస్టులో..
ఇక రీసెంట్ గా అనసూయ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. తెలుగు యాంకర్లలో అయితే సోషల్ మీడియా లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వారిలో అనసూయ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. కేవలం యాంకర్గానే కాకుండా మంచి నటిగా కూడా అనసూయ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. రంగస్థలం సినిమాలో ఆమె చేసిన పాత్ర ఏ స్థాయిలో గుర్తింపు లభించింది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మెగాస్టార్ మూవీలో..
రంగస్థలం నుంచి ఆమె నటిగా చాలా బిజీగా మారిపోయింది కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా చాలా మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇక రీసెంట్ గా అనసూయకు మరొక మెగా మూవీలో ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తో కూడా అనసూయ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

రాబోయే సినిమాలు..
వేదాళం సినిమా రీమేక్ గా రాబోతున్న బోళా శాంమర్ సినిమాలో అనసూయ విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. సెకండాఫ్లో ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కథలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ ఆచార్య సినిమాల్లో కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు బోళా శంకర్ సినిమాలో మరోసారి అమ్మడు
మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. గోపీచంద్ మారుతీ కాంబినేషన్ లో వస్తున్నా పక్కా కమర్షియల్ అనే సినిమాలో కూడా అనసూయ డిఫరెంట్ పాత్రలో కనిపించనుంది.


Click it and Unblock the Notifications











