Anasuya Bharadwaj: మా ఆయన ఊళ్లో లేడంటూ బెడ్ పై అనసూయ వీడియో.. హింట్ ఇస్తున్నావా? అంటూ ట్రోలింగ్
యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. ఆలాంటి గ్లామరస్ యాంకర్లలో బ్యూటిఫుల్ అనూసయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా డ్యాన్సులు చేయడంలోనూ అనసూయ తనకు తానే సాటి. అయితే అప్పుడప్పుడు ఆమె పెట్టే పోస్టులు, కామెంట్లపై తెగ ట్రోలింగ్ జరుగుతుంది. ఇటీవల ఆంటీ అంటూ ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి యాంకర్ అనసూయ ట్రోలింగ్ కు గురైంది.

నటిగా పాపులారిటీ
ఓ వైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఇటీవలే వాంటెడ్ పండుగాడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో భాగమైంది.

క్లాసిక్ నాటకం ఆధారంగా..
అలాగే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లకు కూడా ప్రాధాన్యత ఇస్తానంటోంది అనసూయ. ఇందులో భాగంగానే కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్‌లో అనసూయ నటించనుంది. గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం ఆధారంగా వస్తున్న ఈ సిరీస్‌లో మధుర వాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం.

ఫాలోవర్లతో షేర్..
అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ అనసూయ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.

బెడ్ పైకి ఒంటరిగా వెళ్లడానికి ..
అయితే డ్యాన్స్ వీడియోలు, హాట్ ఫొటోలతో పిచ్చెక్కించే అనసూయ అప్పుడప్పుడు ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ట్రోలింగ్ బారిన పడింది ఈ గ్లామరస్ యాంకర్. తాజాగా ఒంటరిగా బెడ్ పై ఉండి ఒక వీడియోను షేర్ చేసింది అనసూయ. ఈ వీడియోకు ''నా ఇడియట్ (అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్) ఊళ్లో లేనప్పుడు బెడ్ పైకి ఒంటరిగా వెళ్లడానికి ముందు నాకు నేను ముచ్చట్లు చెప్పుకుంటాను'' అని రాసుకొచ్చింది.

ఏకిపారేస్తున్న నెటిజన్లు..
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా నెటిజన్లు అనసూయను ఏకిపారేస్తున్నారు. మీ ఆయన ఊళ్లో లేరన్న విషయం అందరికీ చెప్పాలా.. అసలు నీ ఉద్దేశం ఏంటి.. ఎవరికి చెబుతున్నావ్, హింట్ ఇస్తున్నావా.. ఫీల్ అవుతున్నావా, భర్తను పట్టుకుని ఇడియట్ అంటుంది.. ఆంటీ అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది, అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఎలా రియాక్ట్ అవుతుందో..
మరి ఈ కామెంట్స్ పై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా సుదీర్ఘ కాలంగా జబర్దస్త్ లో సత్తా చాటిన అనసూయ ఇటీవలే స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి అనసూయ ఓ పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తోంది. ఇక, ఇటీవలే ఆమె జబర్ధస్త్ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











