వైరల్ వీడియో : లైవ్‌లోకి వచ్చిన అనసూయ.. బయట పడ్డ నాభి అందాలకు కుర్రకారు ఫిదా
అనసూయ గురించి ఆమె అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులందరికీ అనసూయ సుపరిచితురాలే. జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరను ఏలేస్తుంటే.. రంగమ్మత్త లాంటి క్యారెక్టర్‌ను పోషించి వెండితెరపైనా వెలిగిపోతోంది. ఇలా అనసూయ రెండు చేతులా సంపాదిస్తూ యమా బిజీగా ఉంటుందో. కాలం మారుతోంది.. ఏళ్లు గడిచిపోతోన్నాయి.. కానీ అనసూయ అందం ఏమాత్రం తగ్గడం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లైనా కుర్రకారుకు అనసూయ అంటే పిచ్చి. ఆమె కోసం పడిచచ్చిపోతూ ఉంటారు. దానికి నిదర్శనమే తాజాగా లైవ్‌లోకి అనసూయ రావడం, దానికి విపరీతమైన స్పందన రావడం, అనసూయ నాభి అందాలు బయటపడటం, ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

లాక్ డౌన్‌లో అంతా ఇంటికే పరిమితం..
కరోనా వైరస్ విజృంభనను తట్టుకోలేక ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్‌ను విధించాయి. మన దేశంలోనూ గత నెలరోజులుగా లాక్ డౌన్ అమల్లోనే ఉంది. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. స్టార్ హీరోలైనా, కూలీలైనా అందరూ ఇంటి గడపదాటి రావడం లేదు.

తారలంతా ఫ్యాన్స్‌తో ముచ్చట్లు..
అందరూ ఇంటికే పరిమితం కావడంతో సెలెబ్రిటీలు నిత్యం ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. కొందరు అదే పనిగా ట్విట్టర్ లైవ్‌లోకి వస్తున్నారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఇంటరాక్ట్ అవుతున్నారు., ఈ క్రమంలో అనసూయ సైతం నెటిజన్లతో చిట్ చాట్ చేసింది.

నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు..
చిట్ చాట్‌లో భాగంగా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది అనసూయ. వెకేషన్‌లో భాగంగా బీచ్‌లు, కొండ ప్రాంతాలకు వెళ్లడటం ఇష్టమంటా. లాక్ డౌన్ అయ్యాక చేసే మొదటి పని ఏంటని? అడిగితే సెలూన్‌కు వెళ్లటమని చెప్పుకొచ్చింది. ఎలాంటి దుస్తులు వేసుకోవడం ఇష్టమని అడిగితే.. ఏది కంఫర్ట్‌గా ఉంటే అదేఅంటూ సమాధానమిచ్చింది.
ఫ్యాన్స్ కోరిక మేరకు లైవ్‌లో
లాక్ డౌన్ వల్ల అనసూయను చూడక చాలా రోజులవుతుండటంతో ఫ్యాన్స్ అంతా కలిసి ఓ విన్నపం చేశారు. మేకప్ వేసుకుని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి రావాలని ట్వీట్లతో, కామెంట్లతో అనసూయకు తమ కోరికను విన్నవించుకున్నారు. అయితే ఫ్యాన్స్ కోరికను మన్నిస్తూ.. అనసూయ లైవ్‌లోకి వచ్చింది.
Recommended Video

కనువిందు చేసిన నాభి అందాలు..
అనసూయ మేకప్ వేసుకుని, చీర కట్టుకుని రావడంతో లైవ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అనసూయ అందాలు, హోయల గురించి అందరికీ తెలిసిందే. అలా అనసూయను చూసిన నెటిజన్ల మతులు పోయాయట. అంతేకాదు మధ్య మధ్యలో అనసూయ నాభి అందాలు దర్శనమివ్వడంతో ఎంతో మంది గుండెలు పేలిపోయాయట. అందుకే అనసూయ నాభి అందాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











