twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది నన్ను ఏడ్పించింది.. పెళ్లైనంత మాత్రాన బానిస అయినట్టు కాదు.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్

    |

    జబర్దస్త్ యాంకర్‌గా ఇటు బుల్లితెరను, రంగమ్మత్త అంటూ అటు వెండితెరను షేక్ చేసేస్తోంది అనసూయ. నటిగా, డ్యాన్సర్‌గా, యాంకర్‌గా ఇలా ఎన్నో రకాలు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనసూయ. అయితే సోషల్ మీడియాలో మాత్రం అనసూయకు ప్రతీసారి ఎదురుదెబ్బలే తగులుతుంటాయి. కానీ ఈసారి నెటిజన్లతో చిట్ చాట్ చేసిన అనసూయ.. చాలా కూల్‌గా సమాధానాలిచ్చింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనసూయ అనేక విషయాలను వెల్లడించింది. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలన్నింటి గురించి నెటిజన్లకు చెప్పుకొచ్చింది. ఈ కమ్రంలో అనసూయ ఇష్టాఇష్టాలెన్నో బయట పడ్డాయి.

     అనసూయ ఇష్టాఇష్టాలు..

    అనసూయ ఇష్టాఇష్టాలు..

    అనసూయకు వెకేషన్‌లో భాగంగా బీచ్‌లు, కొండ ప్రాంతాలకు వెళ్లడటం ఇష్టమంటా. లాక్ డౌన్ అయ్యాక చేసే మొదటి పని ఏంటని? అడిగితే సెలూన్‌కు వెళ్లటమని చెప్పుకొచ్చింది. ఎలాంటి దుస్తులు వేసుకోవడం ఇష్టమని అడిగితే.. ఏది కంఫర్ట్‌గా ఉంటే అదేఅంటూ సమాధానమిచ్చింది.

    అది నన్ను ఏడిపించింది..

    అది నన్ను ఏడిపించింది..

    మిమ్మల్ని ఏడిపించిన పుస్తకం ఏది అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. Sidney Sheldon's If Tomorrow Comes అని ట్వీట్ చేసింది. ప్రతిరోజూ పండగే ఈవెంట్ వస్తూ ఉంటే ఇంట్లో వాళ్లు చానెల్ చేంజ్ చేయనివ్వడం లేదని చెబితే.. అది నాకు బాగా నచ్చిందంటూ ఆన్సర్ ఇచ్చింది.

    ట్రోల్స్ గురించి..?

    మీపై వచ్చే ట్రోల్స్ గురించి ఎలా స్పందిస్తారు?వాటి గురించి ఏం ఆలోచిస్తారు? అని అడిగితే.. నాకు నేను ఇంపార్టెంట్.. నేనేంటో అదే ముఖ్యం అంటూ అనసూయ రిప్లై ఇచ్చింది. మీ అమ్మనాన్నలు ఇచ్చిన సలహా ఏంటని అడిగితే.. ‘మనం సరైన మార్గంలోనే వెళ్తుంటే, సరైందే చేస్తుంటే భయపడొద్దు, మనకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ఎప్పటికీ స్వతంత్రంగానే ఉండాలి'అని చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie
    బానిస, పని మనుషులమ్ కాదు..

    బానిస, పని మనుషులమ్ కాదు..

    ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘పెళ్లైన ప్రతీ మహిళ తన జీవితం అయిపోయిందని ఫీల్ కాకుండా చేయాలి.. పెళ్లయ్యాక కూడా కలలు కనొచ్చు.. సాధించవచ్చు.. పెళ్లి అనేది వరమే కానీ శాపం కాదు. ఒకవేళ పెళ్లి అయితే నువ్ ఒక భాగస్వామివి అవుతావ్ కానీ బానిస, పనిమనిషి, పిల్లలు కనే యంత్రంలాంటి దానివి కావు. పెళ్లి అనేది జీవితాన్ని ఉన్నతంగా మారుస్తుంద'ని చెప్పుకొచ్చింది.

    English summary
    Anasuya Bharadwaj Chit Chat With Netizens. She Says That To make every married woman feel life doesn’t end after marriage.. you can still dream.. and achieve.. marriage is a boon.. not a curse.. you will be a partner but not a slave/maid/baby sitter/etc once you are married. Marriage should only better one’s life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X