అనసూయ, సుశాంక్‌ను విడగొట్టేందుకు కుట్ర.. తొలిసారి బయటపెట్టిన యాంకర్

తెలుగు బుల్లితెర నుంచి ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే చాలా మంది భామలు యాంకర్లుగా వచ్చి సెన్సేషన్ అయ్యారు. అలాంటి వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేసిన ఈ భామ.. అనతి కాలంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ గురించి ఓ షాకింగ్ సీక్రెట్‌ను ఆమె ట్రైనర్ బయటపెట్టింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

స్టార్‌గా మారిన అనసూయ
అనసూయ భరద్వాజ్ 'జబర్ధస్త్' షోతో ఎంట్రీ ఇచ్చి తనదైన హోస్టింగ్‌తో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుసగా షోల మీద షోలు చేసి సత్తా చాటుకుంది. అలా ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన హవాను చూపించింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అనసూయ తెలుగు బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు.

Anasuya Bharadwaj College Trainer Reveals Crazy Secret in Kiraak Boys Khiladi Girls Show

వరుస సినిమాలతో బిజీగా
ఎన్నో ఏళ్ల పాటు తెలుగు బుల్లితెరపై ప్రభావాన్ని చూపించిన అనసూయ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలోని చాలా భాషల్లో సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'మైఖేల్'తో వచ్చి మెప్పించింది. అలాగే, వరుసగా 'రంగమార్తాండ', 'విమానం', 'పెద కాపు 1', 'ప్రేమ విమానం' వంటి మూవీలలో విభిన్నమైన పాత్రలను చేసి అలరించింది.

భారీ సినిమాల్లో నటిస్తూ
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా దూసుకుపోతోన్న అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు కూడా తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈ సుందరాంగి 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2' వంటి భారీ ప్రాజెక్టులు చేస్తోంది. అలాగే, తమిళంలో 'ఫ్లాష్‌బ్యాక్' సహా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇలా హై రేంజ్ మూవీలతో తన స్టామినాను పెంచుకుంటోంది.

Anasuya Bharadwaj College Trainer Reveals Crazy Secret in Kiraak Boys Khiladi Girls Show

బుల్లితెరపైకి వచ్చింది
బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా సత్తా చాటిన అనసూయ భరద్వాజ్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది అందులో ఓ షో చేసిన తర్వాత మళ్లీ గ్యాప్ ఇచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె రీఎంట్రీ ఇస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనసూయ 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోతో మరోసారి బుల్లితెరపై కనిపించింది.

ట్రైనర్ ఎంట్రీ ఇస్తోంది
'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' పేరుతో స్టార్ మాలో ఓ గేమ్ షో జూన్ 29వ తేదీ నుంచి ప్రసారం అవుతోంది. ఇందులో అనసూయ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. ఇక, గత వారం జరిగిన ఎపిసోడ్‌లో అనసూయ కోసం ఆమె కాలేజ్‌లో వర్క్ చేసిన ట్రైనింగ్ ఆఫీసర్ ఎంట్రీ ఇచ్చారు. ఆమెను చూడగానే సర్‌ప్రైజ్ అయిపోయింది. తర్వాత ఆమెను హత్తుకుని ఎమోషనల్ అయింది.

Anasuya Bharadwaj College Trainer Reveals Crazy Secret in Kiraak Boys Khiladi Girls Show

విడగొట్టాలని ప్లాన్ అని
'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోలో అనసూయ కాలేజ్ ట్రైనింగ్ ఆఫీసర్.. 'అనసూయను నేను ఎంతో స్ట్రిక్ట్‌గా చూసుకున్నాను. సుశాంక్‌ను, ఈమెను విడగొట్టాలని చాలా ప్లాన్ చేశాను' అని చెప్పుకొచ్చారు. తర్వాత అనసూయ మాట్లాడుతూ.. 'ఈ మేడం వల్లే మా ఇద్దరికీ ఆ సమయంలో ఫొటోలు దిగే అవకాశం కూడా రాలేదు' అని చెప్పింది. ఈ అంశం ఇప్పుడు హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X