twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీవు మరింత స్లిమ్‌గా, హ్యండ్సమ్‌గా.. ఓంకార్‌కు యాంకర్ అనసూయ టెండర్

    |

    తెలుగు టెలివిజన్ రంగంలో మంచి జోష్, ఊపు ఉన్న రియాలిటీ షోలలో సిక్త్స్ సెన్స్ ఒకటంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆద్యంతం ఉత్కంఠను రేపే విధంగా ఈ షోను డిజైన్ చేసి ప్రేక్షకులకు వినోదాన్ని హోస్ట్ ఓంకార్ పంచుతున్నారు. అయితే మొదటి మూడు సీజన్ల సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని 4వ సీజన్‌కు తెరలేపారు. సిక్త్స్ సెన్స్ సీజన్ 4కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    గత మూడు సీజన్లలో

    గత మూడు సీజన్లలో

    స్టిక్త్ సెన్స్ మూడు సీజన్లలో సెలబ్రిటీలు భారీగా తరలిరావడంతో ఈ షోపై మంచి క్రేజ్ ఏర్పడింది. అంతేకాకుండా కంటెంట్ కూడా ఇంట్రెస్ట్‌ క్రియేట్ చేయడంతో మంచి టీఆర్పీ సాధించింది. సీజన్ 3 తర్వాత అదే ఫార్మాట్‌తో చిన్న చిన్న మార్పులతో సిక్త్ సెన్స్ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నట్టు టీమ్ వెల్లడించనట్టు సమాచారం.

    అనసూయ, ఆదితో ఓపెనింగ్ ఎపిసోడ్

    అనసూయ, ఆదితో ఓపెనింగ్ ఎపిసోడ్

    సిక్త్ సెన్స్ సీజన్‌లో క్రేజీ స్టార్లతో ఆరంభించేందుకు హోస్ట్ ఓంకార్ డిసైడ్ అయినట్టు కనిపించింది. జబర్దస్త్‌తో మంచి పాపులారిటీ సాధించిన యాంకర్ అనసూయ, హైపర్ ఆదిని తొలి ఎపిసోడ్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే వారితో ఆడించిన గేమ్‌కు సంబంధించిన ప్రోమో విజువల్స్‌ క్రేజీగా మారాయి.

    బంగారు కోడిగుడ్లను

    బంగారు కోడిగుడ్లను

    సిక్త్ సెన్స్ సీజన్‌ 4లో గేమ్‌లో జాక్‌పాట్ కోసం తన ముందు ఉన్న బంగారు కోడిగుడ్లను సుత్తితో పగలకొట్టాలి. అందులో ఏ రేంజ్‌లో ప్రైజ్ మనీ ఉంటే ఆ మొత్తం సెలబ్రిటీ సొంతం అవుతుంది. అయితే కోడి గుడ్లను పగలకొట్టేందుకు ప్రయత్నిస్తూ హోస్ట్ ఓంకార్‌ను బట్టలో వేసుకోవడానికి అనసూయ ప్రయత్నించింది.

    హ్యాండ్సమ్‌గా ఉన్నావంటూ...

    హ్యాండ్సమ్‌గా ఉన్నావంటూ...

    తనదైన శైలిలో గేమ్ ఆడుతూ అనసూయ.. మీతో ఓ విషయం చెప్పడం మరిచిపోయాను అంటూ.. ఓమీ ఈ సీజన్‌లో మరింత స్లిమ్‌గా, సన్నగా, హ్యాండ్సమ్‌గా అయ్యారు అంటూ అనసూయ తన మనసులోని బయటపెట్టింది. దాంతో ఓంకార్ నవ్వుతూ అనసూయ కామెంట్స్‌ను కాంప్లిమెంట్‌గా తీసుకొన్నారు.

    జూన్ 12వ తేదీన సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్

    జూన్ 12వ తేదీన సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్

    సిక్త్స్‌సెన్స్ సీజన్ 4 కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా షేర్ చేస్తూ.. గేమ్‌ను గెలవడానికి కావాల్సింది సిక్త్స్ సెన్స్ కానీ.. ఇక్కడ అనసూయ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నది అంటూ కామెంట్ పెట్టింది. సిక్త్ సెన్స్ షో జూన్ 12వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నది.

    English summary
    Actor and Anchor Anasuya Bharadwaj crazy compliments to Omkar on Sixth Sense Season 4. She had good time with Omakr in the show. Anasuya had pep talk with Host Omkar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X