Anasuya Bharadwaj: దారుణంగా మోసపోయిన అనసూయ.. అతిగా నమ్మి డబ్బు మొత్తం..

సాధారణ న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ తన కష్టంతో టాలీవుడ్‌లో సెలబ్రెటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలలో బిజీ కావడంతో యాంకరింగ్‌ను, బుల్లితెరను దూరం పెట్టారు అనసూయ. ఇప్పటి వరకు తెలుగులోనే అలరించిన ఆమె ఇప్పుడు బహుభాషా నటి అనిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా కల్చర్ నేపథ్యంలో అందం, నటనపరంగా తిరుగులేని అనసూయ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్‌గా మారుతున్నారు. ఆమె కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రంగమ్మత్త తాజాగా ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

న్యూస్ రీడర్ టూ యాక్టర్
సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న దశలో జబర్దస్త్‌‌కు హోస్ట్‌గా చేసే ఛాన్స్ రావడం అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. తన అందం, గ్లామర్‌తో జబర్దస్త్‌కు ప్లస్‌గా మారారు. అనసూయ అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటే అనసూయ అన్న ముద్ర వేశారు. సుశాంక్ భరద్వాజ్‌ను అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అనసూయ యాంకరింగ్, సినిమాలు, ఇతర షోలతో బిజీగా ఉండటంతో పిల్లల బాధ్యత సుశాంత్ తీసుకుని భార్యకు అండగా నిలిచారు.

Anasuya Bharadwaj duped Money in online shopping Here s the details

రంగమ్మత్త రోల్‌తో బ్రేక్
నిజానికి టెలివిజన్ రంగంలో యాంకర్‌గా అడుగుపెట్టడానికి ముందే అనసూయ సినిమాలలో నటించారు. 2003లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగాలో ఆమె చిన్న పాత్రలో తళుక్కున మెరిశారు. 2016లో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనలో నాగ్‌కు మరదలిగా నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాలలోనూ అనసూయకు ఆఫర్లు రాగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర అనసూయ సినీ జీవితాన్ని మలుపు తిప్పింది.

జబర్దస్త్ నుంచి తప్పుకున్న అనసూయ
ఆ తర్వాత సుకుమార్ - అల్లు అర్జున్‌ల కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ చిత్రాల్లో ద్రాక్షాయణిగా నెగిటివ్ రోల్‌లో భయపెట్టారు. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లులో స్పెషల్ సాంగ్‌తోపాటు తమిళ్‌లో ఫ్లాష్‌బ్యాక్, వోల్ఫ్ సినిమాలలో అనసూయ నటిస్తున్నారు. తనకు పేరు ప్రఖ్యాతులు, స్టార్ స్టేటస్‌ను తీసుకొచ్చిన జబర్దస్త్ షోను అనసూయ విడిచిపెట్టడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ షో నుంచి ఆమె ఎందుకు తప్పుకున్నారనే దానికి సరైన కారణం తెలియరాలేదు.

ఖరీదైన ఇంటిని కొన్న అనసూయ
ఇటీవల 40వ వసంతంలోకి అడుగుపెట్టిన అనసూయ భరద్వాజ్.. హైదరాబాద్‌లో మరో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి గృహ ప్రవేశం చేశారు. ఆ ఇంటికి తన ఇష్టదైవం ఆంజనేయుడి పేరు కలిసొచ్చేలా శ్రీరామ సంజీవని అని పేరు పెట్టుకున్నారు అనసూయ. ఆ వెంటనే తన పెద్ద కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు ఉపనయన కార్యక్రమాన్ని జరిపించారు. వరుస శుభకార్యాలతో బిజీగా ఉన్న అనసూయ అనంతరం భర్త, పిల్లలతో కలిసి శ్రీలంక వెకేషన్‌కు వెళ్లారు.

ఆన్‌లైన్‌లో మోసపోయిన అనసూయ
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనసూయ తాజాగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమెను ఆన్‌లైన్‌లో కొందరు మోసం చేసినట్లుగా తెలిపింది. కొద్దిరోజుల క్రితం ట్రిపుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో అనసూయ బట్టలు ఆర్డర్ చేశారు. దీనికి డబ్బులు కూడా చెల్లించింది.. నెలరోజులు పైనే గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇంటికి బట్టలు రాకపోగా.. రీఫండ్ కూడా చేయలేదని వాపోయారు అనసూయ. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఆమె సూచించారు. మరి అనసూయ పోస్ట్‌పై సదరు కంపెనీ స్పందిస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Read more about: anasuya bharadwaj cyber crime
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X