Anasuya Bharadwaj : మిస్ యూ అంటూ ఎమోషనల్ .. అనసూయ పోస్ట్ ఎవరి గురించి?
కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించడమే కాదు, యువతకు కూడా అదే చెబుతుంటారు యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్. ఓ సాధారణ యాంకర్ స్టేజ్ నుంచి స్టార్ సెలబ్రెటీ అనిపించుకున్నారు ఈ జబర్దస్త్ బ్యూటీ. సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులకు అందుబాటులో ఉండే ఈ స్టార్ యాంకర్.. ఎప్పటికప్పుడు కొత్త సంగతులను పంచుకుంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే :
సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించారు అనసూయ భరద్వాజ్. ఈ దశలో ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రోగ్రామ్ మధ్యలో అనసూయ వేసే జోకులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. జబర్దస్త్‌కు ఆమెకు పెద్ద అస్సెట్‌గా నిలిచారు. నాగబాబు, రోజా వంటి స్టార్లు స్టేజ్‌పై ఉన్నప్పటికీ.. అనసూయ షోపై ప్రభావం చూపారు. జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీతో సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు హోస్ట్‌గా చేసే అవకాశాలను దక్కించుకున్నారు అనసూయ. చాలా మంది సుమకు కరెక్ట్ పోటీ ఇచ్చే ఫిమేల్ యాంకర్ దొరికిందని చెప్పారంటే అనసూయ ఏ రేంజ్‌లో మెస్మరైజ్ చేశారో అర్ధం చేసుకోవచ్చు.

ఇదే సమయంలో సినిమాల్లోనూ అనసూయకు అవకాశాలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె సినీ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. హీరోకి మేనత్తగా , అతనికి తన బాధ్యత గుర్తుచేసే కీలకపాత్ర పోషించారు ఈ స్టార్ యాంకర్. ఎంతో మంది సీనియర్ నటులు ఈ రంగమ్మత్త క్యారెక్టర్ కోసం పోటీపడగా వారందరినీ కాదని అనసూయకి ఈ అవకాశం దక్కింది.
రంగస్థలం తర్వాత క్షణం, విన్నర్, గాయత్రి, ఎఫ్2, యాత్ర, కథనం, చావు కబురు చల్లగా, భీష్మ పర్వం, ఖిలాడీ, విమానం, పెద్దకాపు, రజాకార్ వంటి సినిమాల్లో అనసూయ నటించింది. పలు ఐటెం సాంగ్స్‌లో తన గ్లామర్ షోతో భారీ హైప్ తీసుకొచ్చింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్పలో ద్రాక్షాయణిగా నెగిటివ్ రోల్‌లో నటించి మెప్పించారు అనసూయ. త్వరలో రిలీజ్ కానున్న పుష్ప2లో ఆమె ఎలా భయపెడుతుందోనని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే అనసూయ.. తన సినిమాలు, షోల వివరాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. షూటింగ్స్, ఈవెంట్స్ లేకపోతే భర్త, పిల్లలతో గడపటానికి ఆమె ముందుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక ట్రిప్ వేసి రీచార్జ్ అవ్వడమే కాదు, దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. గత వారం మొత్తం బర్త్ డే పార్టీలతోనే తనకు సరిపోయిందంటూ అనసూయ తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
తన భర్త సుశాంక్ భరద్వాజ్, తల్లి అనురాధ, చెల్లెలు అంబిక, హెయిర్ స్టైలీష్ట్ సిజిల్ పద్మరాజన్, సుకుమార్ భార్య తబిత పుట్టినరోజుల వేడుకల్లో పాల్గొన్నట్లు అనసూయ అందులో పేర్కొన్నారు. అలాగే చెల్లెలు వైష్ణవిని బాగా మిస్ అవుతున్నట్లు తెలిపిన ఆమె.. ఇంటికి త్వరగా వచ్చేయ్ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











