నా కెరీర్‌ను దెబ్బ తీసేందుకు కుట్ర.. పోలీసులు తొందర్లోనే బుద్ది చెబుతారు.. అనసూయ మళ్లీ ట్వీట్ వార్

లైగర్ సినిమా రిలీజ్ రోజున యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో దుమారం సృష్టించాయి. విజయ్ దేవరకొండను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. అయితే ఆ వివాదం దాదాపు రెండో రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వివాదంపై అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసిన అంశం మళ్లీ మీడియాలో రచ్చగా మారింది. అయితే నెటిజన్లకు, అనసూయకు మధ్య మరోసారి ట్వీట్ల వార్ ఎలా కొనసాగిందంటే..

 కర్మ అంటూ విజయ్ దేవరకొండపై ట్వీట్

కర్మ అంటూ విజయ్ దేవరకొండపై ట్వీట్


లైగర్ రిలీజ్ రోజున విజయ్ దేవరకొండను ఉద్దేశించి కామెంట్ చేస్తూ.. తల్లిని అలా బూతులు తిట్టినందుకు కర్మ సిద్దాంతాన్ని అనుసరించాల్సిందే. కర్మ ఎప్పుడూ వెంటాడుతుందని అనసూయ ట్వీట్ చేసింది. దాంతో ఆమె ట్వీట్‌పై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. నానా రకాలు బూతులు తిడుతూ ట్వీట్లు పెట్టారు.

 ఆంటీ అంటూ వేధించారు అంటూ

ఆంటీ అంటూ వేధించారు అంటూ


అయితే అనసూయను ఆంటీ అనడంతో ఈ వివాదం పక్కదారి పట్టింది. తన వయసును ఉద్దేశించి ట్రోల్ చేస్తున్నారు. ఏజ్ షేమింగ్ చేస్తూ నన్ను దూషిస్తున్నారు. నన్ను ఆంటీ అంటూ దుర్బాషలు ఆడినందుకు శిక్ష అనుభవించాల్సిందే అంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేశారు. అయితే అనసూయ ఫిర్యాదు చేయడంపై నెటిజన్లు సెటైర్ వేశారు.

నన్ను దెబ్బ తీసేందుకు కుట్ర


అనసూయ తనను ఆంటీ అనడంపై అనసూయ స్పందిస్తూ.. మీరు అలా అన్నందుకు కాదు.. ఆంటీ పేరుతో నన్ను ద్వేషిస్తున్న తీరుతో బాధపడ్డాను. నా కెరీర్‌ను దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతున్నది. నా మానసిక ప్రశాంతతను హరించి వేస్తున్నారు. అది శిక్షార్హమైన నేరం అని అనసూయ ట్వీట్ చేసింది. దాంతో అంటీ.. అంకుల్ అని వేధించినందుకు ఏం శిక్ష వేస్తారు అని నెటిజన్ తుంటరి ప్రశ్న వేశారు.

 నీలా పని పాట లేదంటూ

నీలా పని పాట లేదంటూ


హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేయడంపై నెటిజన్ స్పందిస్తూ.. నీలా మాకు పని పాట లేదు అని అనుకొంటున్నారా? అని చెప్పి పోలీసు డిపార్ట్‌మెంట్ మిమ్మల్ని పంపించేశారంట కదా అని అని నెటిజన్ మరోసారి అనసూయను ట్వీట్‌తో కవ్వించాడు. దానికి అనసూయ ఘాటుగా స్పందించింది.

బుద్ది చెప్పే రోజు తొందర్లోనే


నెటిజన్ ట్వీట్‌కు అనసూయ స్పందిస్తూ.. లేదండి.. మీలా పనిపాట లేని వాళ్లకి బుద్ధి చెప్పే టైమ్ వచ్చింద అని చెప్పారండి. మీకు నోరు జారడంలో తొందర ఎలాగో ఉంది. బోల్తా పడటానికి కూడా తొందరే కదా మీకు.. కాస్త ఓపిక పట్టండి. అన్నీ జరుగుతాయి. జరుగుతంటాయి అని అనసూయ ట్వీట్‌లో తెలిపారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X