హోళీ వేడుకల్లో అనసూయకు చేదు అనుభవం.. అలాంటి వేధింపులు

స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. తన కష్టంతో సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు. తెలుగు చిత్ర సీమతో పాటు దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అనసూయ కూడా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనసూయ.. పలు అంశాలపై స్పందిస్తూ వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా లైవ్‌లో ఆమె వేధింపుల బారినపడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Thalapathy Vijay- Trisha: సంగీత విడాకులు నోటీసు... త్రిషతో జంటగా విజయ్, నటితో రిలేషన్‌పై అలా హింట్?
Thalapathy Vijay- Trisha: సంగీత విడాకులు నోటీసు... త్రిషతో జంటగా విజయ్, నటితో రిలేషన్‌పై అలా హింట్?

సాక్షి టీవీలో కెరీర్ ప్రారంభించిన అనసూయ జీవితాన్ని జబర్దస్త్ కార్యక్రమం మలుపు తిప్పింది. తన అందంతో ఈ షోకు అదనపు ఆకర్షణగా మారడంతో పాటు స్టార్ యాంకర్‌గా వెలుగొందారు. ఈ క్రమంలో సినీరంగం నుంచి అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. క్షణం, రంగస్థలం, పుష్ప చిత్రాలు అనసూయకు మరింత స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ దెబ్బతో యాంకరింగ్‌ను పక్కనపెట్టి పూర్తి స్థాయిలో నటిగా నిలదొక్కున్నారు అనసూయ భరద్వాజ్. దక్షిణాది ఇండస్ట్రీ నుంచి ఆమె కాల్షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారంటే అతిశయోక్తి కాదు.

Anasuya Bharadwaj Faces Awkward Moment at Holi Celebrations as Crowd Shouts Aunty During Speech

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే లైవ్ చిట్‌చాట్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఈ సంభాషణల్లో ఎవరైనా హద్దు దాటితే మాత్రం అప్పటికప్పుడే వాళ్లని ఏకీపారేస్తుంది ఈ స్టార్ యాంకర్. దాంతో పలుమార్లు ట్రోలింగ్ బారినపడ్డారు అనసూయ. ముఖ్యంగా ఆంటీ అని తనను పిలవడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. చిన్నారులు పిలిచే పిలుపులో ప్రేమ ఉంటుందని.. అదే కుర్రాళ్లు, ఒక వయసొచ్చిన మగాళ్లు ఆంటీ అని పిలిచే పిలుపులో వేరే అర్ధం ఉంటుందని అందుకే తనకు ఇష్టం ఉండదని అనసూయ పలుమార్లు తెలిపారు. అలాగే తనపైనా, తన వ్యక్తిత్వంపైనా దారుణమైన కామెంట్స్ చేస్తున్న కొందరిపై అనసూయ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Recommended For You
మా అన్న ఇంటిని ముక్కలు చేశావు... త్రిషపై దళపతి విజయ్ ఫ్యాన్స్ దారుణంగా
మా అన్న ఇంటిని ముక్కలు చేశావు... త్రిషపై దళపతి విజయ్ ఫ్యాన్స్ దారుణంగా

ఇక ఇటీవల దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. మారాల్సింది మగాళ్ల మైండ్‌సెట్ మాత్రమేనని.. చీరలో వచ్చినా, మోడ్రన్ డ్రెస్‌లో వచ్చినా వేధింపులు తప్పవని అనసూయ పేర్కొన్నారు. మాకు చెబుతున్న కొందరు నటులు.. ముందుగా పబ్లిక్ ఈవెంట్స్‌లో హీరోయిన్ల మీద అంబోతుల్లా పడుతున్న మగాళ్లకు చెప్పాలని వ్యాఖ్యానించారు. దాంతో ఇండస్ట్రీ, సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయి అనసూయకు, శివాజీకి సపోర్ట్‌గా సోషల్ మీడియాలో యుద్ధం చేసుకున్నారు.

You May Also Like
Saraswathi Movie Review: సరస్వతి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Saraswathi Movie Review: సరస్వతి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఈ వివాదం తర్వాతి నుంచి సైలెంట్‌గా ఉంటున్నారు అనసూయ. తన సినిమాలు, షూటింగ్స్, ఫ్యామిలీతోనే గడుపుతున్నారు. సోషల్ మీడియాలోనూ పెద్దగా పోస్టులు పెట్టడం లేదు. ఇలాంటి దశలో అనూహ్యంగా అనసూయకి చేదు అనుభవం ఎదురైంది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనసూయ సందడి చేశారు. వేదిక మీద మాస్ సాంగ్స్‌కి స్టెప్పులు వేసి అలరించారు. అయితే మైక్ తీసుకుని మాట్లాడుతుండగా ప్రేక్షకుల్లో ఉన్న కొందరు ఆకతాయిలు దారుణంగా ప్రవర్తించారు. అనసూయ మాట్లాడుతున్నంత సేపు ఆంటీ ఆంటీ అంటూ కేకలు వేశారు. ఊహించని ఈ ఘటనతో షాకైనప్పటికీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ప్రసంగాన్ని కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై అనసూయ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: anasuya bharadwaj holi sivaji
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X