ఎవరిని నిందించాలో తెలియడం లేదు.. అలాంటి వాడిని ఏరి అవతల పారేయాలి.. అనసూయ ఫైర్
ప్రపంచమంతా కరోనా ధాటికి గజగజవణికిపోతూ ఉంటే.. కొందరికి మాత్రం పిచ్చి ముదురుతోంది. ప్రజలంతా శుభ్రంగా ఉండాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటే ప్రస్తుతం ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. టిక్ టాక్‌లో ఫేమస్ అయిన ఓ యువకుడు చేసిన ఆకతాయి పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టిక్‌టాక్ వాడకం..
భారతదేశంలో టిక్ టాక్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటిలో జరిగే అరాచకాలు చూడలేక కేంద్ర ప్రభుత్వం దీన్ని నిషేంధించినా.. మళ్లీ వచ్చి తిష్ట వేసింది. టిక్ టాక్‌ను మంచికి వాడుకునే వారు ఎంత మంది ఉన్నారో.. అంతకు పదింతలు చెడుకు వాడుకునే వారే ఉన్నారు.

అశ్లీల వీడియోలతో..
టిక్ టాక్‌లో కొందరు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. మరి కొంత మంది అయితే హద్దులు ధాటి ప్రవర్తిస్తుంటారు. యువతను పెడదారి పట్టించేలా అశ్లీల వీడియోలతో రెచ్చిపోతోంటారు. ఇంకొందరు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ.. రాక్షసానందం పొందుతారు. అలాంటి కోవకు చెందిన ఓ యువకుడిపై ప్రస్తుతం సోషల్ మీడియా ఫైర్ అవుతోంది.
పిచ్చికి పరాకాష్ట..
టిక్ టాక్‌లో ఫ్రాంక్ వీడియోలు కూడా హల్చల్ చేస్తుంటాయి. అయితే ఇది మరి ఏ కోవకు చెందిందో తీసిన, చేసిన వారికే తెలియాలి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ ఇద్దరు యువకులు అలా నడుచుకుంటూ వస్తారు. చూడకుండా ఓ యువతికి డ్యాష్ ఇస్తే. ఆమె చెంప చెల్లుమనిపిస్తుంది. దీంతో హర్ట్ అయిన సదరు యువకుడు చేతిలో ఉమ్మి వేసుకుని.. ఆ యువతికి సారీ చెప్పే నెపంతో షేక్ హ్యాండ్ ఇస్తాడు.
Recommended Video

అనసూయ ఫైర్..
టిక్ టాక్ వీడియోను చూసిన అనసూయ.. ‘ఎవరిని నిందించాలో నాకు తెలియడం లేదు.. ఇతడినా, ఇటువంటి వ్యక్తులను ఫాలో అవుతున్న వారినా.. బయట ఉన్న వైరస్ నుంచి కాపాడుకోవడానికి అన్ని పనులు మానుకుని ఇంట్లో కూర్చుని ఉంటున్నాం.. కానీ వైరస్ లాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఇటువంటి వారికి వీలైనంత త్వరగా ఏరి అవతాలపారేయాలి.. మొదటగా ఇతడి ఖాతాను తొలగించాల'ని అని మండిపడింది.


Click it and Unblock the Notifications











