నీ కంపు నోరు అంటూ అనసూయ..ప్రతివత పాయసం వండితే అని నెటిజన్లు..అంటీ అంటూ ఆటాడుకొన్న నెటిజన్లు

టెలివిజన్ యాంకర్, టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న అనసూయ భరద్వాజ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కాంట్రవర్సియల్ పోస్టులతో ట్రెండింగ్‌గా మారారు. సోషల్ మీడియాలో అంటీగా పాపులర్ అయిన అనసూయ ఈ మధ్య విజయ్ దేవరకొండను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేయగా ఆమెను భారీగా నెటిజన్లు నోటికి చెప్పలేని పదాలతో దూషణకు దిగడం అత్యంత వివాదాస్పదంగా మారింది. అయితే ఆ ట్వీట్ వివాదం తగ్గిందనుకొనే లోపే తాజాగా మరో ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ వివాదంలోకి వెళితే..

విజయ్ దేవరకొండపై పరోక్షంగా: యువ హీరో విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార పోస్టర్లు ఇటీవల కాలంలో అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నాయి. ఈస సినిమా పోస్టర్లు, ప్రచార వీడియోల్లో తన పేరును The Vijay Deverakonda అని వేసుకొన్నారు.

Anasuya Bharadwaj get trolled by netizens for Tweet on Vijay Deverakonda again

బాబోయ్ పైత్యం అంటూ: అయితే విజయ్ దేవరకొండ The అని తన పేరు ముందు పెట్టుకోవడాన్ని తట్టుకోలేక అనసూయ కెలికే విధంగా ట్వీటింది. ఇప్పుడే ఒకటి చూశాను. The నా? బాబోయ్ పైత్యం. ఏం చేస్తాం. అంటకుండా చూసుకొందాం అని ట్వీట్ చేసింది. దాంతో విజయ్ దేవరకొండ అభిమానులు, నెటిజన్లు ఆమె ట్వీట్‌పై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు.

Anasuya Bharadwaj get trolled by netizens for Tweet on Vijay Deverakonda again

అనసూయపై దారుణంగా కామెంట్లు: అయితే కొద్ది రోజులు అనసూయ, నెటిజన్ల మధ్య ట్వీట్లు విసురుకొన్నారు. అయితే నెటిజన్ల కామెంట్లను ఎత్తి చూపుతూ పలురకాలుగా ఆమె ట్వీట్లు పెట్టింది. అయితే ఈ వివాదం ముగిసిందనే లోపే మళ్లీ అనసూయ ట్వీట్ చేసి నెటిజన్లను మళ్లీ కెలికే పనిలో పడినట్టు కనిపించింది. దాంతో అనసూయ, నెటిజన్ల మధ్య భారీగా ట్వీట్ల వార్ కొనసాగుతుంది.

Anasuya Bharadwaj get trolled by netizens for Tweet on Vijay Deverakonda again

నీ కంపు నోరు అంటూ మళ్లీ అనసూయ ట్వీట్: అనసూయ ట్వీట్ చేస్తూ..నువ్వు నన్ను తిడితే.. నీ కంపు నోరు తప్పవుతుంది. కానీ నేను ఎలా తప్పు అవుతాను. నా పెంపకం గర్వించదగినది. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్ధం చేసుకోండి. షేమ్ ది అబ్యూజర్. నా టూ అబ్యూజ్ అంటూ ట్వీట్ చేసింది.

అనసూయ ఏకి పారేసిన ఫ్యాన్స్: అయితే నెటిజన్లు ఘాటుగా స్పందిస్తూ అనసూయను ట్రోల్ చేశారు. ప్రతివత పాయసం వండితే.. తెల్లారే దాక చల్లారలేదట అంటూ.. ఒకరు. సోకాల్డ్.. గర్వించదగిన పెంపకం అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. తప్పుగా మాట్లాడుతున్నారు. ఒకరిని అనే ముందు మన గురించి కూడా ఆలోచించు కోవాలి. ఎందుకండీ కెలుకుతారు. మాటలు పడుతారు అంటూ నెటిజన్లు ఆటాడేసుకొంటున్నారు.

Anasuya Bharadwaj get trolled by netizens for Tweet on Vijay Deverakonda again

మధ్యలో దూరిన రాహుల్ రామకృష్ణ: అయితే అనసూయ ట్వీట్‌కు నటుడు రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ.. నన్ను క్షమించండి. మిమ్మల్ని అడుగకుండా జోక్యం చేసుకొంటున్నాను. అసలేం జరుగుతున్నదనే ఆసక్తి కలుగుతున్నది అంటూ ట్వీట్ చేశారు. అయితే రాహుల్ రామకృష్ణ ట్వీట్‌కు ఓ నెటిజన్ సమాధానం ఇస్తూ.. వదిలేయ్ అన్న.. పబ్లిసిటీ కోసమే హంగామా అనిపిస్తున్నది. ఎప్పుడు చూడు బేకార్ ముచ్చట్లు.. బేకార్ పంచాయితీలు అంటూ కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X